5, మే 2024, ఆదివారం

రైతుల ఆత్మ బందువు దగ్గమల్ల ప్రసాదరావు

రైతులకు పగటిపూట 12 గంటల విద్యుత్తు

5 సంవత్సరాల పాటు రైతు బరోసా రూ. 20 వేలు

మ్యాంగో బోర్డు ఏర్పాటుకు కృషి

రూ.2 లక్షల వరకు వడ్డీలేని రుణాలు

రైతు బీమా రూ.10 లక్షలకు పెంపు

పంటలకు గిట్టుబాటు ధర

ఆవులు, గేదెలకు 75 శాతం రాయితీ



ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.


ప్రకృతి సహకరించకుండా నిత్యం నష్టాల సాగు చేస్తున్న రైతన్నకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. తెలుగుదేశం పార్టీ రైతుల కోసం ప్రకటించిన ప్రణాళికలు రైతులను భారీగా ఆకర్షిస్తుంది. రైతన్నల శ్రేయస్సు కోసం చిత్తూరు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ కూడా రైతాంగాన్ని కట్టిపడేస్తుంది. దగ్గిమల్ల ప్రసాదరావు ఎక్కడికి ప్రచారానికి వెళ్లిన రైతులు జేజేలు పలుకుతున్నారు. తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు. వైసీపీ పాలనలో భారీగా నష్టపోయామని, తెలుగుదేశం పార్టీ సురక్షితంగా ఉండగలమని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. దగ్గమల్ల ప్రసాదరావు కూడా చిత్తూరు జిల్లా రైతులకు సాగునీటిని అందించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు నుండి చిత్తూరు జిల్లాకు సాగునీటిని తీసుకురావడానికి ప్రణాళికను రూపొందిస్తున్నట్లు దగ్గమల్ల ప్రసాదరావు వెల్లడించారు. పోలవరం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని మళ్లించి, అక్కడి నుండి కృష్ణ, గోదావరి నదులను అనుసంధానం చేసి, ఆ నీటిని తెలుగు గంగ, హంద్రీ - నీవా ద్వారా చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసే అవకాశం ఉందని ఆయన అభిప్రాయం పడుతున్నారు. ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతున్నారు. అలా నష్టపోకుండా వారికి నిర్ణీత మద్దతు నిర్ణయించడం, మినీ కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసి మ్యాంగో పల్ప్ ఉంచడం ద్వారా గిట్టుబాటు ధర వచ్చే ప్రయత్నం చేస్తామని తెలియజేశారు. అలాగే రైతు బరోసా కార్యక్రమాన్ని మరో ఐదేళ్లపాటు కొనసాగించనున్నట్లు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తెలిపారు. వైసిపి ప్రభుత్వం 15,000 రూపాయలను అందజేస్తుండగా దాన్ని, 20,000 కు పెంచనున్నట్లు తెలిపారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు వడ్డీరేని రుణాలను అందజేస్తామని, రైతు బీమాను 10 లక్షలకు పెంచి, పంటల బీమాను కూడా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుందని తెలియజేశారు. పగటిపూట రైతులకు 12 గంటల పాటు నాణ్యమైన విద్యుత్తు అందజేస్తామని పేర్కొన్నారు. పంటల గిట్టుబాటు ధర కోసం ఐదు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధుని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 100% ప్రకృతి సేద్యంకు ప్రోత్సాహం ఇస్తామని, రాష్ట్రాన్ని ఆర్టికల్ హబ్ గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఆవులు, గేదెలు కొనుగోలుకు రైతులకు 75% రాయితీ ఇస్తామన్నారు. దాణా పైన కూడా అత్యధిక రాయితినీ ప్రకటించారు. వైసిపి ప్రభుత్వం రైతుల కోసం సున్నా శాతం వడ్డీ రుణాలు ప్రకటించినా, రైతులకు సకాలంలో వడ్డీ ప్రభుత్వం అందజేయడం లేదు. బ్యాంకులు మాత్రం పూర్తిస్థాయిలో రైతుల నుంచి వడ్డీని ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి. సున్న వడ్డీ పథకం గురించి ప్రశ్నిస్తే రాష్ట్ర ప్రభుత్వం తమకు నిధులు విడుదల చేయడం లేదని, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రైతులకు అందజేస్తామని పేర్కొంటున్నారు. రైతులకు 9 గంటలపాటు ఉచిత విద్యుత్ అని ప్రకటించినా, వాస్తవంగా ఈ ఏడు గంటలకు కూడా ఇవ్వడం లేదు. అది కూడా రాత్రిపూట కూడా విద్యుత్ సరఫరా చేసి, రైతులను అవస్థలకు గురిచేస్తుంది. చిత్తూరు జిల్లాలో లక్ష ఎకరాలకు పైగా మామిడి తోటలు ఉన్నాయి. మామిడి తోటలతో మామిడి రైతులు ప్రతి సంవత్సరం నష్టపోతూనే ఉన్నారు. పంట వచ్చిన సంవత్సరం గిట్టుబాటు ధర లేకుండా, మరోసారి పంట రాకుండా పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా రైతులు నష్టపోవడం జరుగుతుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా మ్యాంగో బోర్డును ఏర్పాటు చేస్తామని దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. దగ్గుమళ్ళ గెలిస్తే, రైతాంగ సమస్యల ఉన్న అవగాహనతో రైతాంగం బాగుపడవచ్చని భావిస్తున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *