4, మే 2024, శనివారం

దగ్గుమళ్ళకు అండగా నిలుస్తున్న ముస్లిం మైనారిటీలు


దగ్గుమళ్ళ ప్రచారంలో అడుగడుగునా  సంఘీభావం  

ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు 

మసీదు నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.5,000

నూర్ బాషా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయింపు

 50 ఏళ్లు పైబడిన మైనారిటీలకు పెన్షన్లు 

ప్రధాన పట్టణాలలో ఈద్గాలు, శ్మశాన వాటికలకు స్థలాలు  

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీలు చిత్తూరు టిడిపి పార్లమెంటు అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావుకు అండగా నిలుస్తున్నారు. ముస్లిం మైనారిటీల అభివృద్ధి కోసం తెలుగు దేశం పార్టీ రూపొందించిన ఎన్నికల ప్రణాళిక పట్ల ఆకర్షితులవుతున్నారు. ఈ విషయమై మైనారిటీ పెద్దలు మాట్లాడుతూ.. తెలుగుదేశం పాలనలో ముస్లిం మైనారిటీలోని పేదలను ఆదుకునేందుకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది. వేరే రాష్ట్ర రాష్ట్రాల నుండి హజ్ యాత్రకు పోకుండా,  హైదరాబాదులోనే హజ్ హౌస్ ను నిర్మించి హజ్ యాత్రకు పంపే  ఏర్పాటు చేసింది. 2014 తర్వాత విజయవాడ, కర్నూల్ లలో  హాజ హౌస్ ను  నిర్మించారు. కర్నూల్ లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. చంద్రబాబు రంజాన్ తోఫా ప్రవేశపెట్టారు. ఉర్దూను రెండవ అధికార భాషగా చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ లో  దుల్హన్ పధకాన్ని ప్రారంభించింది. మైనార్టీ యువతల వివాహానికి 50వేల రూపాయల సహాయాన్ని అందించింది. మత మతసామరస్యాన్ని కాపాడి మత ఘర్షణలు  లేకుండా తెలుగుదేశం పార్టీ చిసింది.  జగన్ పాలనలో మైనార్టీల పైన దాడులు పెరిగాయి. వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు దాపురించాయి. వేధింపుల కారణంగా నంద్యాలలోని అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాదులో ఎద్దు యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. గత ఐదేళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లింల కోసం ఒక భవనాన్ని కూడా నిర్మించలేదు. 14 సంవత్సరాల తెలుగుదేశం పరంలోని ముస్లిం మైనారిటీలకు న్యాయం జరిగినట్టు భావిస్తున్నారు. ముస్లిం మైనారిటీలు  తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తాము అభివృద్ధి చెందుతామని ఆశాభావంతో ఉన్నారు. ఈ విషయమై దగ్గుమళ్ళ ప్రసాదరావు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింలపై దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ముస్లింల కోసం ఎన్నో అభివృద్ధి పనులు చేశామని తెలిపారు. హైదరాబాద్‌ లో ఉర్దూ యూనివర్సిటీని ఏర్పాటు చేశామని, హజ్‌ హౌస్‌ నిర్మించి ముస్లిం సోదరులను మక్కా పంపించామని  చెప్పారు. కడప, విజయవాడలలో కూడా హజ్‌ హౌస్‌ లు నిర్మించామని వివరించారు. రూ.8 కోట్లు ఖర్చు పెట్టి షాదీ మంజిల్‌ కట్టించామని తెలిపారు. గత ఐదేళ్ల వైఎస్సార్ సీపీ పాలనలో ముస్లింల కోసం ఒక్క భవనమైనా నిర్మించారా? అని ప్రశ్నించారు.  ముస్లింలంటే గుర్తుకొచ్చేది నమ్మకం, ధైర్యం. కష్టాన్ని నమ్ముకొని జీవించే మనస్థత్వం. అన్ని రంగాల్లో ముస్లింల ప్రాధాన్యత ఉంది. ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసంతో జీవనం సాగించాలని ముస్లింలు కోరుకుంటారు. ముస్లింలు లేకపోతే అభివృద్ధి లేదని దగ్గుమళ్ళ వ్యాఖ్యానించారు. 2014 విభజన అనంతరం 16వేల కోట్ల లోటు బడ్జెట్‌వున్నా రాష్ట్రాన్ని సంక్షేమం, అభివృద్ధి దిశగా నడిపించానని గుర్తు చేసుకున్నారు. ప్రపంచపటంలో హైదరాబాద్‌కు ప్రత్యేక స్థానం ఉందంటే అది టీడీపీ చలువేనని, అక్కడి ముస్లిం బావున్నారంటే అది టీడీపీ కృషేనన్నారు. టీడీపీ ఎన్డీయేలోవున్న ఏ సందర్భంలోనూ ముస్లింలకి అన్యాయం జరగలేదని స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌ ముస్లిం మైనారిటీ ఫైనాన్స్‌ తెస్తే, పీఎం వాజ్‌పాయ్‌ సహకారంతో హైదరాబాద్‌లో ఉర్దూ యూనివర్సిటిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీల అభ్యున్నతిని దృష్టిలో పెట్టుకుని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నపుడు హైదరాబాద్‌లో, విభజన తరవాత కడప, విజయవాడలోను హజ్‌హౌస్‌లు కట్టించామని గుర్తు చేశారు. ప్రస్తుతం సమావేశం జరుగుతున్న షాదీమందిర్‌నీ రూ.8 కోట్లతో మూడంతస్థుల భవనంగా నిర్మించుకున్నామని చెప్పారు. ఐదేళ్ల పాలనలో ముస్లింలకు జగన్‌రెడ్డి ఏం చేశాడని ప్రశ్నించారు. దుల్హన్‌ పథకం అమలు, ఉర్దూని రెండో భాషగా ఏర్పాటు, రంజాన్‌ తోఫా, విదేశీ విద్యలాంటి అభివృద్ధి పథకాలు టీడీపీ ప్రవేశపెట్టినవేనని చంద్రబాబు అన్నారు. విదేశీ విద్య విధానంతో 527మంది విద్యార్ధులకు రూ.15 లక్షల ఆర్ధిక సాయం, ఏటా 10 వేల మందికి రూ.3 లక్షల రుణం, దర్గాలు, మసీదులు, ఈద్గాల మరమ్మత్తులకు నిధులు, ఇమాం, మౌజన్‌లకు గౌరవ వేతనం ఇచ్చింది టీడీపీయేనన్నారు. నెల్లూరులో రొట్టెల పండుగను రాష్ట్ర పండుగగా చేశామని, అబ్దుల్‌కలాం ఆజాద్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్లు ఏర్పాటు చేశామని, మహిళలకు గోషా హాస్పిటల్‌ నిర్మించామన్నారు. ఇస్లామిక్‌ బ్యాంక్‌ పెడతానన్న జగన్‌ `కనీసం ఆ ఒక్కటైనా చేశాడా? అని నిలదీశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌ `తానొక్కడే బావుండాలని కోరుకునే సైకో అని దగ్గుమళ్ళ వ్యాఖ్యానించారు. జగన్‌ ఏలుబడిలో ముస్లిం బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని, 50మందికిపైగా దాడులు జరిగింది ఐదేళ్లలోనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. నంద్యాలలో అబ్దుల్‌ సలాంని దొంగగా చిత్రీకరించి `కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి తెచ్చారు. పలమనేరులో మిస్బా అనే విద్యార్ధిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. నర్సరావుపేటలో వక్ఫ్‌ బోర్డును వైసీపీ నాయకులు ఆక్రమిస్తే అడ్డుకున్నందుకు చంపేశారు. మాచర్లలో 100మంది ముస్లిం కుటుంబాలను బహిష్కరించారు. నందికొట్కూరులో మహిళ నమాజ్‌కి వెళ్లి వస్తుంటే బుర్కా తీసి అవమానించడంతోపాటు ఆమె కుటుంబ సభ్యులను హీనంగా కొట్టిన పార్టీ వైసీపీ. గతంలో టీడీపీ హయాంలో ఎప్పుడైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయా? అని ముస్లిం వర్గాలు ఆలోచించాలన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీ బిల్లులకు పార్లమెంట్‌లో కేంద్రానికి సపోర్ట్‌ చేశారు. ఏ2 విజయసాయిరెడ్డి బిల్లుకు మద్ధతుగా సంతకం కూడా పెట్టారు. ఇప్పుడు ముస్లింలకు టీడీపీ అన్యాయం చేస్తుందంటూ నాటకాలాడుతున్నారు. మభ్యపెట్టి మోసాలు చేసి ముస్లింలను అమాయకులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాడు జగన్‌ అని చంద్రబాబు దుయ్యబట్టారు. హజ్‌ యాత్రీకులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష ఆర్థిక సాయం చేస్తామని ప్రసాదరావు ప్రకటించారు. ముస్లింల మనోభావాలను గౌరవించే టీడీపీ, జీవన ప్రమాణాలు పెంచేందుకు కృషి చేస్తుందన్నారు. ముస్లింల కోసం గురుకుల పాఠశాల 90 శాతం పూర్తి చేశామని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లను కాపాడుతామని, రాష్ట్రంలో మసీదు నిర్వహణ కోసం ప్రతి నెలా రూ.5,000 ఆర్థిక సాయం అందజేస్తామని చెప్పారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే నూర్ బాషా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి ఏటా రూ.100 కోట్లు కేటాయిస్తామని  హామీ ఇచ్చారు.  50 ఏళ్లు పైబడిన మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన వ్యక్తులకు పెన్షన్లు అందిస్తాము. అదనంగా, మేము మైనార్టీల కోసం ప్రధాన పట్టణాలలో ఈద్గాలు మరియు శ్మశాన వాటికల కోసం స్థలాలను కేటాయిస్తామని దగ్గుమళ్ళ ప్రసాదరావు వివరించారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *