సదం మండలంలో బురగమందలో 8 మంది టిడిపి ఏజెంట్ల కిడ్నాప్
చితకబాది పిలేరులో పదేచిన వైనం
నిందితులపై చర్యలు తీసుకోనందుకు ఎస్ ఐ సస్పెండ్ కు ఆదేశాలు
గుడిపాలలో వైసిపి ఏజంటుకు కత్తిపోట్లు
చిత్తూరులో పోలింగ్ ఏజెంట్లుగా వాలంటిర్లు
అభ్యంతరం చెప్పిన టిడిపి నేతలు, ఇరు వర్గాల వాగ్వివాదాలు
దేవలంపేటలో వైసిపి అభ్యర్థిని అడ్డుకున్న టిడిపి నాయకులు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చెదురు మొదలు సంఘటనలు మినహా చిత్తూరు జిల్లాలో సోమవారం సాధారణ ఎన్నికల్లో. పోలింగ్ ప్రశాంతంగా జరిగాయి. కొన్నిచోట్ల ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వాటిని దగ్గరుండి పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులు పరిష్కరించారు. సదం మండలం బురగామందలో ఆదివారం రాత్రి ఎనిమిది మంది తెలుగుదేశం పార్టీ ఏజెంట్లను కిడ్నాప్ అయ్యారు. వారిని కిడ్నాప్ చేసినా వారు చితకబాది పీలేరులో పడేసి వెళ్లిపోయారు. ఈ విషయం పుంగనూరు నియోజకవర్గంలో తీవ్ర సంచలనంగా మారింది. దీంతో ఈ విషయాన్ని టిడిపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏజెంట్లు దొరికారని, కావున సమస్య ఏమీ లేదంటూ కేసును నమోదు చేయకుండా పోలీసులు మిన్నన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ చాలా సీరియస్ గా తీసుకుంది రెండు రోజుల క్రితం సదం ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన షేక్వ షావల్లిని సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. గతంలో సదం మెస్సైగా పనిచేసిన మారుతీ ని కూడా సస్పెండ్ చేసిన విషయం పాఠకులకు వివిధమే. సదం మండలంలో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఎన్నికల వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటనలో పోలీసులు భాధితుల మీదనే హత్యాయత్నం కేసులు నమోదుచేశారు. పోలీసుల వైఖరికి నిరసిస్తూ రామచంద్ర యాదవ్ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై విచారణ జరిపి సదం ఎస్సైగా ఉండిన మారుతిని తొలుత బదిలీ చేసి, అనంతరం సస్పెండ్ చేశారు. రెండు రోజుల క్రితం షేక్ షావల్లి సదం నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టారు. ఆదివారం రాత్రి జరిగిన కిడ్నాప్ సంఘటనలతో ఆయనను కూడా సస్పెండ్ చేయాల్సిందిగా ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
చిత్తూరు నియోజకవర్గంగుడిపాల మండలంలో తెలుగుదేశం వైసీపీ నాయకుల మధ్య వాగ్వివాదం పెరిగి, వైసిపి ఏజెంట్ ను టిడిపి ఏజెంట్ కత్తితో పొడిచిన సంఘటన చోటు చేసుకుంది. 65 సంవత్సరాల వయసుగల రత్నాకర్ అమ్మ అనే ఆమెను ఓటు వేయడానికి మనవడితో సహా వచ్చింది. దీంతో అక్కడ ఏజెంట్ ఉన్న టిడిపి ఏజెంట్ సంగీత ఆమె ఓటు ఆమె వేసుకోవాలని సహాయకులని అనుమతించేది లేదని తెలిపింది. ఆమె ఒక ఓటు వేసి ఇంకొక ఓటు వేయకుండా వెళ్లి తిరిగింది. దీంతో వైసిపి పార్టీ ఏజెంట్ కలగజేసుకొని టిడిపి ఏజెంట్ గా ఉన్న సంగీతాను ఇలా అబ్జెక్షన్ చేయడం సరిలేదని ఆక్షేపించారు. దీంతో ఇద్దరని బూతు నుండి బయటికి పంపించేశారు. ఆ సమయంలో ఏజెంట్ సంగీత తండ్రి చంద ప్రసాద్ రెడ్డి గొడవపడుతూ తన జోబులో ఉన్న కత్తితో వైసిపి ఏజెంట్ ప్రసాద్ రెడ్డి పైన దౌర్జన్యం చేసి, కత్తితో పొడిచాడు. ఆయనకు కడుపులోకి గాయం కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు.
చిత్తూరు పట్టణంలో కూడా ఉద్రిక్తతల నడుమ పోలింగ్ జరిగింది. పోలింగ్ కార్యక్రమాన్ని తెలుగుదేశం, వైసీపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చిత్తూరు మున్సిపాలిటీ పరిధిలో పలువురు వాలంటీర్లను ఏజెంట్లుగా కూర్చొని పెట్టారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. వాలంటీర్లుగా ఉండి రాజీనామా చేసిన వారు ఏజెంట్లుగా కూర్చోకూడదని ఎన్నికల కమిషన్ ఆదేశించిన ఈ విషయం పట్టించుకోవడంలేదని టిడిపి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు ఆందోళనకు దిగారు. ఒక బూతులో దీంతో వైసిపి టిడిపి నాయకులు మధ్య భాగ్యవాదం జరిగింది. ఈ విషయమై సి ఐ విశ్వనాథ్ సర్ది చెప్పారు. అనంతరం ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. చిత్తూరులోని మిట్టూరు కేంద్రంలో కూడా వాలంటీర్లు ఏజెంట్గా కూర్చున్నారని సమాచారం అందడంలో చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు అక్కడికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ అభ్యర్థి విజయానంద రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. సీకే బాబు ఎందుకు పోలింగ్ కేంద్రంలోకి వచ్చారని ప్రశ్నించా.రు దాంతో తాను జనరల్ ఏజెంట్ అని తన ఎక్కడికైనా వెళ్లే అధికారం ఉందని సీకే బాబు అన్నారు. వాలంటీర్ల విషయమై ప్రశ్నించగా వాళ్ళు రాజీనామా చేశారని కావున ఏజెంట్ కూర్చోబెట్టామని సమాధానం ఇచ్చారు. వాళ్ళు రాజీనామా చేయడము, దాన్ని ఆమోదించిన ఆమోదపత్రాన్ని చూపించేసిందిగా సీకే బాబు పట్టి పట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదాలు జరిగింది. అక్కడికి చేరుకున్న జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సర్ది చెప్పారు. చిత్తూరు డిఈఓ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల పోలీస్ స్టేషన్ టిడిపి ఏజెంట్ పైన దాడి చేసినా, వైసిపి ఏజెంటును కొనసాగించడం పట్ల టిడిపి నాయకులు అభ్యంతర వ్యక్తం చేశారు. ఈ విషయంలో అక్కడికి చేరుకున్న పట్టణ సి ఐ విశ్వనాథ్ రెడ్డితో టిడిపి అభ్యర్థి గురజాల వాగ్వివాదానికి దిగారు. ఏజెంట్ పైన దాడి చేసిన వారిని తప్పించి కొత్తవారిని నియమించాలని సూచించారు.
గంగాధర నెల్లూరు మండలం వెదురు కుప్పం మండలం దేవళంపేట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. పోలింగ్ సరళని పరిశీలించడానికి వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి కృపాలక్ష్మి అక్కడికి వచ్చారు. ఆమెను స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డుకోవడంతో ఈరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో టిడిపి వారిని చెప్పుతో కొట్టుతానని వైసిపి అభ్యర్థి హెచ్చరించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరిని సర్దిచెప్పి పంపి వేశారు. కుప్పం పట్టణంలో పోలింగ్ కేంద్రం వద్ద టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి వైసిపి నాయకులు ఎన్నికల ప్రచారం చేస్తుండగా టిడిపి మాజీ ఎంపీటీసీ భర్త వేణు వైసిపి నాయకులతో వాదానికి దిగాడు. దీంతో మునిసిపల్ కౌన్సిలర్ సురేష్ తమ్ముడు ఉన్నారు. తన తమ్ముడిని తిడతావా అంటూ వేణుపైనే సురేష్ మండిపడ్డాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దుబాటు చేశారు
గంగాధర్ నెల్లూరు టిడిపి అభ్యర్థి థామస్ ఓటర్లకు 500 రూపాయల టోకెన్లను పంపిణీ చేశారు. తాను గెలిచిన తర్వాత ఈ టోకెన్లను స్కాన్ చేస్తే 5000 రూపాయలు వస్తుందని ఆయన నమ్మబలికారు. దీంతో ప్రజలు పోటీలు పడి థామస్ దగ్గర ఆటో టోకన్లు తీసుకున్నారు. ఈ విషయమై వైసీపీ నేతలు టోకెన్లను సేకరించి పోలీస్ అధికారులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం పాలసముద్రం మండలం వనదుర్గాపురం పంచాయతీ పోలింగ్ కేంద్రంలో తెలుగుదేశం వైసిపి నాయకులు మధ్య రెండు సార్లు ఘర్షణ జరిగింది.

