మామిడి కొనుగోలు రంగంలోకి ఫ్రూటెక్స్ సంస్థ
ఇప్పటికే తిరుపతిలో కొనుగోళ్ళు ప్రారంభం
25న బంగారుపాల్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
తోతాపురి కిలో రూ.27 నుండి 35 వరకు
తక్షణం నగదు చెల్లింపులు
మామిడి రైతులలో హర్షాతిరేకాలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
మామిడి కొనుగోలు రంగంలోకి ఫ్రూటెక్స్ సంస్థ రంగ ప్రవేశం చేసింది. జిల్లాలో మామిడికి గిట్టుబాటు ధర లభిస్తుందని మామిడి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రూటేక్స్ సంస్థ తిరుపతిలో గత శనివారం నుంచి మామిడి కొనుగోలును ప్రారంభించింది. ఈనెల 25వ తేదీన చిత్తూరు జిల్లాకు సంబంధించి బంగారుపాలెంలో కూడా కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించనుంది. ఫ్రూటెక్స్ సంస్థ వివిధ రాష్ట్రాలలో డిజిటల్ మండిలను నడుపుతోంది. ఇప్పటికే దానిమ్మ, నారింజ మండిలతో తమ వ్యాపారాన్ని ప్రారంభించింది. ఈ సంవత్సరం కొత్తగా మామిడి కొనుగోలు రంగంలోకి ప్రవేశిస్తుంది. తొలుత శ్రీనివాసుని పాదాల చెంత తిరుపతి అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అక్కడ మామిడి రైతుల నుంచి మంచి స్పందన రావడంతో చిత్తూరు జిల్లాలో కూడా బ్రాంచ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీంతో మామిడి దిగుబడి ఎక్కువగా ఉన్న బంగారుపాలెంను ఎంచుకుంది. బంగారుపాలెంలో ఈనెల 25వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఎందుకు సంబంధించి మామిడి రైతులతో ఫ్రూటెక్స్ సంస్థ సంప్రదింపులు జరుగుతోంది. మామిడి రైతులతో వాట్స్అప్ గ్రూపులను కూడా ఏర్పాటు చేసింది. ఏ రోజు ఉన్న ధరను ఆరోజు వినియోగదారులకు తెలియజేస్తుంది. వినియోగదారులు మామిడికాయలు తీసుకెళ్లిన వెంటనే డిజిటల్ తూకం ద్వారా తూకం వేసి నగదను చెల్లించే పద్ధతికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రస్తుతం బెర్నిషా కిలో 40 నుంచి 50 రూపాయలు, తోతావురికి 27 నుంచి 35 రూపాయలు, సింధూరకు 24 నుంచి 30 రూపాయలు, అల్పన్స రకానికి 45 నుంచి 53 రూపాయలు మద్దతు ధరగా నిర్ణయించారు. అయితే ఇప్పటివరకు జిల్లాలో 20 రూపాయలకు మించి తోతాపూరి మామిడి పరికింది లేదు. జిల్లాలో మొట్టమొదటిసారిగా తోతాపురి రకానికి 27 నుంచి 35 రూపాయలు మద్దతు ధరగా ఫ్రూటెక్స్ ప్రకటించింది. దీంతో మామిడి రైతులల్లో అష్టాచనేకాలు వ్యక్తమవుతున్నాయి తమకు గిట్టుబాటు ధర లభిస్తుందని భావిస్తున్నారు. జిల్లాలో సుమారుగా లక్షా, 50 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఇందులో 20వేల ఎకరాలు లేత తోటలు కాగా లక్ష యాభై వేల ఎకరాల్లో కాపు వస్తుంది. జిల్లాలో సగటున 5 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావాల్చిఉంది. అయితే పూత రాకపోవడంతో 10 శాతం పంట వచ్చే అవకాశం ఉందని ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. సగటున జిల్లాలో సంవత్సరానికి 5 లక్షల టన్నుల మామిడి దిగిబడి రావల్చి ఉండగా, ఈ సంవత్సరం ఒకటి లేక రెండు లక్షల తన్నులు దిగుబడి రావచ్చని ఉద్యానవన శాఖ అధికారులు భావిస్తున్నారు. ఇటేవల కురిచిన అకాల వర్షం, ఎదురు గాలుల కారణంగా, పంట చాలా వరకు వేలరాలింది. తూర్పు మండలాల్లో ఎక్కువగా విస్తీర్ణంలో మామిడి తోటలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా పండిన పంటంతా చిత్తూరు, దామలచెరువు, బంగారుపాళ్యం, పుత్తూరు, తిరుపతి కేంద్రంగా కలకత్తా, ఢిల్లీ వంటి కేంద్రాలకు ఎగుమతి అవుతోంది. ఈ ఏడాది జిల్లాలో మామిడి నిరాశాజనంగానే ప్రారంభం అయ్యింది. మంచు, అకాలంగా వీస్తున్న గాలుల వల్ల మామిడి పూత రాలిపోవడంతో పాటు పిందెలకు మచ్చలు ఏర్పడడంతో పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి. ఇలా జిల్లా వ్యాప్తంగా భారీగా మామిడి పంట నష్టపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి మామిడి సాగు దారుల్లో అత్యధికులు కౌలుదార్లే. ఎకరాకు రూ.15 వేలు నుంచి రూ.20 వేలుకు లీజుకు తీసుకున్న సాగుదారుడు, దుక్కులు దున్నడం, పురుగు మందుల వాడకానికి ఎకరాకు మరో రూ.20 వేలు వరకు ఖర్చు చేస్తున్నారు. అంటే ప్రతి ఎకరాకు రైతుకు రూ.40 వేలు వరకూ ఖర్చవుతోంది. అయితే ఈసారి పెట్టు బడులు కూడా తిరిగి రావని రైతులు గగ్గోలు పెడుతున్న నేపధ్యంలో జిల్లాలో ఫ్రూటెక్స్ ప్రారంభం కావడంతో మామిడి రైతులలో ఆశలు చిగురిస్తున్నాయి. మామిడి రైతులకు ఫ్రూటెక్స్ ఆశాజనకంగా కనిపిస్తోంది. జిల్లాలో గత ఏడాది ఆరులక్షల టన్నుల మామిడి దిగుబడి వచ్చింది. అంచనాకు మించి దిగుబడి రావడంతో జిల్లాలో మామిడి ధరలు పడిపోయాయి. కిలో తోతాపురి రకం 10 రూపాయలు కూడా పలకలేదు. మామిడి ఫాక్టరీ లకు సరఫరా ఎక్కువ కావడంతో సెలవులు కూడా ప్రకటించారు. లోడ్ తో వెళ్ళిన ట్రాక్టర్ లో కాయలు దించడానికి రెండు, మూడు రోజులు కూడా పట్టింది. జిల్లా కలెక్టర్ రంగప్రవేశం చేసి, మద్దతు ధర నిర్ణయించినా, ఫ్యాక్టరీలు ఆ ధర ఇవ్వలేదు. గత ఏడాది భారీగా నష్టపోయిన మామిడి రైతులకు ఈ ఏడాది ధర ఆశాజనకంగా ఉంది. అయితే, వాతావరణ పరిస్థితుల ప్రభావంతో జిల్లాలో మామిడి దిగుబడి భారీగా తగ్గింది. గుడ్డిలో మెల్ల లాగా, ఫ్రూటెక్స్ వంటి కంపనీ రావడం, మామిడి ధరలు పెరగడంతో పంట వచ్చిన రైతులకు కొంత ఉపచమనం లభించినట్లు అయ్యింది.