దగ్గుమళ్ళ ప్రచారాన్ని అందుకోలేని ప్రత్యర్థులు
ప్రచారపర్వంలో తనదైన శైలిలో దూసుకుపోతున్న టిడిపి
గెలువలేమని కుయుక్తులు పన్నుతున్న అధికార పక్షం
సెర్చ్ వారెంటు లేకుండా ఎంపి కార్యాలయంలో పోలిసుల సోదాలు
తనకు ప్రాణ హాని ఉందంటున్న దగ్గుమళ్ళ
భద్రత కల్పించాలని వినతి, స్పందించని అధికారులు.
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు పార్లమెంటు టిడిపి అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాదరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అయన ప్రచారాన్ని అందుకోవడం ప్రత్యర్థులకు సాధ్యం కావడం లేదు. దగ్గుమళ్ళ కారణంగా చిత్తూరు పార్లమెంటులో తెలుగుదేశం పార్టీకి నూతన ఉత్సాహం వచ్చింది. పార్లమెంటుతో పాటు, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి ఆదరణ లభిస్తోంది. ఏడు నియిజక వర్గాలు కూడా విజయం వైపు ప్రయానిస్తున్నాయి. దీంతో ప్రత్యర్థుల గుండెలు గుబులు మంటున్నాయి. ప్రచారపరంగా దగ్గుమల్లను ఎదుర్కొనలేక అధికార దుర్వియోగానికి పల్గాడుతున్నారు. ఇటేవల టిడిపి పార్లమెంటు కార్యాలయం మీద పోలీసులు మొరుపు దాడులు నిర్వహించారు.సెర్చ్ వారెంటు లేకుంటే, ఏకపక్షంగా తనిఖీలు చేశారు. దీంతో ఎంపి అభ్యర్థి దగ్గుమళ్ళ తనకు వైసిపి నేతల నుండి ప్రాణహాని ఉందని జిల్లా పొలిసు అధికారులకు ఫిర్యాదు చేశారు. జిల్లా అధికారులు స్పందించలేదు. దీంతో రాష్ట్ర అధికారులకు, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. తనకు భద్రత కల్పించాలని కోరారు. ఎక్కడ తన మిదచ్దడులు జరుతాయో అని ఎంపి అభ్యర్థి దగ్గుమళ్ళ అందోళన చెందుతున్నారు.
తెలుగు దేశం పార్టీని స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన నాటి నుంచి 2019 సార్వత్రిక ఎన్నికల వరకు ఆ నియోజకవర్గం టీడీపీ కంచుకోటలా విరాజిల్లింది. అప్పటి వరకు జరిగిన 8 ఎన్నికల్లో 7 సార్లు టీడీపీ చిత్తూరు పార్లమెంట్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇక 2019 ఎన్నికల్లో నారమల్లి శివప్రసాద్ వైసీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో పరాభవాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. సరైన అభ్యర్థి కోసం ఎదురు చూసిన చంద్రబాబు అనేక సర్వేలు నిర్వహించారు. సర్వేల అనంతరం బాపట్లకు చెందిన రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు ను రంగంలోకి దింపింది. అప్పటికే బాపట్లలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూ వచ్చిన దగ్గుమళ్ళ ప్రసాద్ రావు….ఆదాయపు పన్ను శాఖలో జాయింట్ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో 2019లో విఆర్ఎస్ తీసుకొని ప్రజా సేవకు అంకితం అయ్యారు. జన్మభూమికి ఏదొకటి చేయాలని భావించిన ప్రసాద్ రావు కులం, మతం అనే బేధాలు లేకుండా స్వచ్ఛంద సేవలు చేస్తూ వచ్చారట. ఇక క్రీడా కారులకు ప్రోత్సాహాలు, విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తు వచ్చారు. టీడీపీ కంచు కోటలో మళ్లీ పూర్వవైభవం తీసుకు రావడానికి మళ్లీ దగ్గుమళ్ళ ప్రసాద్ రావును రంగంలోకి దించారు. దగ్గుమళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం, సెంట్రల్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ లో పీజీ చేశారు.
పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రసాద్ రావు మేనిఫెస్టో తయారు చేశారు. ఉమ్మడి జిల్లా కేంద్రమైన చిత్తూరు అభివృద్ధిలో మాత్రం వెనుకంజలోనే ఉంది అలాంటి చిత్తూరును స్మార్ట్ సిటీగా తీర్చి దిద్దుతామన్న హామీ ఇస్తున్నారు. చిత్తూరు పార్లమెంట్ పరిధిలో అధికంగా పండించే మామిడి రైతులకు మద్దతు ధర కల్పించేందుకు మామిడ్ బోర్డు ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేస్తామని మాట ఇచ్చారు. నిత్యం ఏనుగుల దాడులకు గురి అవుతున్న ప్రాంతాల్లో నివారణకు బంగారుపాళ్యం నుంచి కుప్పం వరకు సౌర కంచెతో పాటు అటవీ ప్రాంతంలో కంద కాల తవ్వకం చేయిస్తామని, అంతర్జాతీయ సంస్థ ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి మహిళలకు ఉపాధి కల్పించడం తన ప్రథమ లక్ష్యంగా చెప్తున్నారు. పుణ్యక్షేతమైన కాణిపాకంలో వేద పాఠశాల ఏర్పాటుఆసుపత్రి నిర్మాణం…. ఇలా అనేకమైన హామీల ద్వారా ప్రజలకు దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సారి చిత్తూరు పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికై ప్రజలు., యువత కష్టాలు తీర్చే విధంగా చర్యలు తీసుకుంటామని., చిత్తూరు పార్లమెంట్ స్థానమే కాకుండా ఆ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు సైతం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమాగా ఉన్నారు. వైసీపీలో బలమైన నేత అండదండలు ఉన్న రెడ్డెప్ప సైతం రెండవ సారి పార్లమెంట్ స్థానం గెలవాలని ఉవిర్లు ఊరుతున్నారట. జగన్ చరిష్మా., పెద్దిరెడ్డి అండదండలే తనకు శ్రీరామ రక్షగా బావిస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలిచి టీడీపీ కంచుకోటను కాస్త…. వైసీపీ పార్టీకి బలమైన స్థానంగా నిరూపించాలని ఆరాట పడితున్నారు.
పార్లమెంటు పరిధిలో తెలుగుదేశం గెలుపును నివారించడానికి అధికార పార్టీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. ఇందులో భాగంగా తొలుత ఎంపి కర్యలం మీద పోలీసులతో దాడులు చేయించారు. ఈ దాడులపై టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి దగ్గుమళ్ళ ప్రసాద్ రావు మాట్లాడుతూ.. ఏడు అసెంబ్లీ, ఒక పార్లమెంటరీ నియోజకవర్గం అంతా టీడిపి క్లీన్ స్వీప్ చేస్తుందనే భయంతో వైసీపీ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. వైసీపీ నాయకుల కనుసన్నలో నడుస్తున్న అధికారులు సెర్చ్ వారెంట్ లేకుండానే ఇటీవల తమ గృహంలోకి వచ్చి బెడ్ రూమ్ అంతా వెతుకులాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా తనకు ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందని, సెక్యూరిటీ ఇవ్వమంటే చిత్తూరు ఎస్పీ నుండి స్పందన లేదని స్పష్టం చేశారు. ప్రధానంగా తన ఇంట్లో తనిఖీల పేరుతో నిబంధనలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు వస్తున్న ప్రజాదారణను చూసి ఓర్వలేకనే వైసీపీ మూకలు పోలీసులను ఉసిగొల్పి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అక్రమార్గాలను అనుసరిస్తున్న వారికి ప్రజా కోర్టులో గుణపాఠం తప్పదని ఎన్డీఏ కూటమి చిత్తూరు పార్లమెంట్ హెచ్చరించారు. ఇప్పటికే ఎన్డీఏ కూటమి విజయం ఖరారు అయిందని.., దీన్ని చూసి ఓర్వలేని వైసీపీ నాయకులు పోలీసుల ద్వారా సోదాల పేరుతో తనను ఇబ్బంది పెట్టడం అప్రజాస్వామికమని దుయ్యబట్టారు. ప్రజాభిమానమున్న తమను వైకాపా నాయకులు భయపెట్టలేరన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో వైసిపి సర్కార్ .. దళితులను ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వేధింపుల కారణంగా చాలా మంది దళితులు అసువులు బాసారని తెలిపారు. తమ ఓట్లతో గద్దెనెక్కిన జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహిగా మిగిలిపోయారని విమర్శించారు. జగన్ అనుసరించిన విధానాలను చూసి ప్రజలు విసికి వేసారిపోయి ఉన్నారని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దళిత సామాజిక వర్గం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, మాయమాటలకు మోసపోకుండా తమ సంక్షేమాన్ని కోరే వారికే ఓటు వేసి గెలిపించాలని వారు అభ్యర్థించారు. ఎన్డీఏ కూటమి బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటే దళితులు అన్ని రకాల వృద్ధి చెందుతారని తెలియజేశారు.