ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్షలు చేయడం కోడ్ ఉల్లంగనే: CPM
ప్రధానోపాధ్యాయులతో ఎమ్మెల్యే సమీక్షలు చేయడం కోడ్ ఉల్లంగనే:
సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్.
శాసనసభ్యులు ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంగించడమేనని వాటిని వెంటనే రద్దు చేయాలని చిత్తూరు జిల్లా సిపిఎం (CPM) జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గర పడుతున్న పడుతుండడంతో అధికార పార్టీ రకరకాల ప్రలోభాలకు గురి చేయడానికి ఉపాధ్యాయులతోనూ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగస్తులతోనూ ఎన్నికలకు పని చేయించుకోవడానికి రకరకాల పద్ధతుల్లో సమీక్షలు పేరుతో సమావేశాలు నిర్వహించడం సరైనది కాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు కోడ్ అమల్లో ఉన్నందున ఇలాంటి సమావేశాలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఎన్నికల అధికారులు వెంటనే ఇలాంటి సమావేశాలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను ఇతర పనులకు ఉపయోగించకూడదని స్పష్టంగా ఆదేశాలిస్తున్న శాసన సభ్యులు మాత్రం ఎలా సమావేశాలు పెడతారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం చేయడంలో పూర్తిగా విఫలమైన ప్రభుత్వం వారి శాసనసభ్యులు వాటిని ఎందుకు మాట్లాడరని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలు పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ఎన్నికలకు కూడా ఉపాధ్యాయులని పక్కన పెట్టిన ప్రభుత్వం మరి ఇప్పుడు ఉపాధ్యాయులను ఎలా ఉపయోగించుకుంటారని ప్రశ్నించారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు