28, ఫిబ్రవరి 2023, మంగళవారం

ఎమ్మెల్సీ ఎన్నికలలో తహశీల్దార్లు,ఎంపీడీఓ ల పాత్ర చాలా ముఖ్యమైనది: జిల్లా కలెక్టర్

 

                     ఎమ్మెల్సీ ఎన్నికలలో తహశీల్దార్లు,ఎంపీడీఓ ల పాత్ర చాలా ముఖ్యమైనది.

మార్చి 8 లోపల ఓటర్ స్లిప్పుల పంపిణీ పూర్తి చేయాలి

ప్రతి పోలింగ్ కేంద్రం ను మండల స్థాయి అధికారులు  తప్పని సరిగా తనిఖీ చేయాలి:

 జిల్లా కలెక్టర్,  ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ 

         ప్రకాశం- నెల్లూరు- చిత్తూరు జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మరియు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయని,ఈ ఎన్నికల నిర్వ హణ లో తహసిల్దా రులు, ఎంపీడీఓలు, పోలీస్ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ తెలిపారు.. 

        మంగళవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఎంపీడీఓలు, తహసిల్దారులతో జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ...  ఎం ఎల్ సి ఎన్నికలకు సంబంధించి మార్చి 8వ తేదీ లోపల ఓటర్ స్లిప్పులను పంపిణీ చేయాలని వాటితోపాటు ఓటు వేసే విధానానికి సంబంధించి అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను మండల స్థాయి   అధికారులు పరిశీలించి అక్కడ ఉన్న ఏర్పాట్లను చూసుకోవాలని, ఆర్డీఓ లు వారి పరిధి లో గల పోలింగ్ స్టేషన్ లో గల ఏర్పాట్లు ను పరిశీలించాలని,ఏర్పాట్లు చేయాలన్నారు.. పోలింగ్ పూర్తి అయ్యాక సెక్టోరియల్ అధికారులతో సంప్రదిస్తూ బ్యాలెట్ బాక్స్ లను రిసెప్షన్ సెంటర్ కు చేర్చాలనన్నారు.ఎన్నికలకు సంబంధించి సామాగ్రిని భద్రంగా ఉంచాలనన్నారు. మూడు జిల్లాలకు సంబంధించిన ఎన్నిక కాబట్టి బ్యాలెట్ పత్రాల లెక్కింపుకు  రోజు కు మూడు షిఫ్టుల వారీగా విధులు నిర్వర్తించేలా సిబ్బంది  కేటాయింపు ఉంటుందనన్నారు. 

       ఈ వీడియో కాన్ఫరెన్స్ లోడిఆర్ఓ ఎన్. రాజశేఖర్, జడ్పీ  సిఈ ఓ ప్రభాకర్ రెడ్డి, ఆర్డీఓలు రేణుక, సృజన, శివయ్య లతోపాటు మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *