28, ఫిబ్రవరి 2023, మంగళవారం

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా : జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి

 


సైబర్ క్రైమ్ నేరగాళ్ళ ఉచ్చులో పడకుండా ప్రజలను అవగాహన పరచాలి. 

సైబర్ క్రైమ్ నేరాలలో  డబ్బును అతిత్వరగా రికవరీ జేయాలి. 

నెలవారీ నేరసమీక్ష కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎస్పీ  వై.రిశాంత్ రెడ్డి

       పోలీసింగ్ స్కిల్ల్స్, విజిబుల్ పోలీసింగ్ పెంచే విధంగా పని చేయండి... ప్రజలతో సామరస్యంగా, సఖ్యతతో చట్టం పై గౌరవం పెంపొందేటట్లు మెలగండి…. ఎర్రచందనం, నాటుసారా, ఇసుక అక్రమ రవాణ నేరస్తుల పై ఉక్కు పాదం మోపండి.. పి.డి. యాక్ట్ లు ప్రయోగించండి జిల్లా ఎస్పీ వై.రిశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం చిత్తూరులో నెలవారీ నేరసమీక్ష కార్యక్రమం జరిగింది.  ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ... 

         పెండింగ్ కేసులపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరితగతిన పరిష్కరించాలి.  

రోడ్డు ప్రమాదాలు మరింత తగ్గే విధంగా నివారణకు మెరుగైన చర్యలు చేపట్టాలి.

ఎన్ఫోర్స్మెంట్ పెంచి చట్ట వ్యతిరేక/అసాంఘీక కార్యక్రమాల అడ్డుకట్ట వెయ్యాలి.

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలి.

మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల కలిగే దుష్ప్రభావాలు, చట్టపరమైన చర్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి.

పెండింగ్ లో ఉన్న వాహనాలను త్వరితగతిన వేలం వేయండి.

మహిళా పోలీసులచే మహిళలకు మరియు విధ్యార్దినులకు సమాజంలో జరిగే నేరాలపట్ల మరియు సైబర్ క్రైమ్ పై అవగాహన సదస్సులు నిర్వహించి వారిని చైతన్య పరచాలి.

        జిల్లాలోని డిఎస్పీలు, సిఐలు, ఎస్సైలతో ఈ రోజు ఎస్పీ గారు జిల్లా పోలీసు ట్రైనింగ్ సెంటర్ కాన్ఫరెన్స్ హాల్ నందు నెలవారీ నేరసమీక్షా సమావేశమును నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ గారు పెండింగ్ లో ఉన్న  గ్రేవ్ & నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, డెకాయిటి, రాబరీ,  ప్రాపర్టీ, వాహనాలు దొంగతనం, మిస్సింగ్, చీటింగ్, 102 Cr.P.C, IT act కేసులు, సైబర్ నేరాలు మరియు ఇతర కేసులను సమీక్షించారు.

         పోలీస్ స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల వివరాలు, ప్రస్తుత కేసుల స్థితిగతులు, నమోదైన కేసుల్లో నేరస్తుల అరెస్టు, కేసు దర్యాప్తు తీరుతెన్నులపై సంబంధిత పోలీస్ అధికారులతో ఆరా తీసి కేసుల ఫైల్స్, రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల ఛేదింపునకు మరియు పరిష్కారానికి, నేర నియంత్రణకు దోహదం చేసే పలు సూచనలు మరియు మెళకువలను అధికారులకు దిశా నిర్దేశాలు చేశారు.

         ఇతర క్రైమ్ లతో పోలిస్తే సైబర్ క్రైమ్ నేరాలు ప్రతి ఏటా 14 శాతం పెరుగుతున్నాయని, ఇంకా చాలా సైబర్ నేరాలు పోలీసు స్టేషన్ లో నమోదు కావడం లేదని, దానికి కారణం చాలా ఉన్నాయని, నగదు తక్కువ పోవడం వల్ల అనవసరంగా ఎందుకు దానికి కేసు పెట్టడం అని ఆలోచించి ముందుకు రావడం లేదని తెలిపారు, సైబర్ క్రైమ్ ద్వారా ఎక్కువ నగదు పోగొట్టుకున్నప్పుడే కేసు నమోదు చేస్తున్నారని తెలిపారు. తక్కువ డబ్బు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ మొతం వస్తుందనే ఆశ చూపించడం, డబ్బులు కడితే ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి పలు దఫాలుగా ఎక్కువ నగదు తీసుకోవడం, పార్ట్ టైం ఉద్యోగాలు ఇప్పిస్తామని వాట్సప్ గ్రూప్ లలో మెసేజ్ లు పంపించడం, ఇలా చాలా రకాలుగా సైబర్ మోసాలకు లోనవుతున్నారని, సులువుగా ఎవరు నగదు ఇవ్వరు – సులువుగా డబ్బు వస్తుంది అంటే దాని వెనుక మోసం ఉందని గ్రహించండి. 100 శాతం రెట్టింపు డబ్బుని పొందండి అంటూ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ ల కు సంబంధించి లింక్ ద్వారా మోసం చేయడం జరుగుతోంది. బలమైన ఆర్థిక సైబర్ మోసాల యంత్రాంగాన్ని సృష్టించడం కొరకు SMS లు, టెలిగ్రామ్ మెసేజింగ్, వాట్సాప్ మెసేజింగ్, వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు, చెల్లింపు గేట్‌వేలు, UPI, కంపెనీలు, బ్యాంక్ ఖాతాలు, క్రిప్టోకరెన్సీ మొదలైనవి ఉపయోగించబదుతున్నాయి.

       మీకు ఏవైనా ఎవరిమీదైనా ఇలా జరిగిన లేదా భాదితులే కాకుండా భాదితుల బందువులు లేదా తెలిసిన వారు కూడా మౌనం వీడి మోసపోయాం అని గ్రహించిన తక్షణమే Cyber Helpline 1930 కు గాని సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ http://cybercrime.gov.in/ కు గాని జిల్లా పోలీస్ వాట్సప్ప్ నెంబర్ 9440900005 కు గాని, సైబర్ మిత్ర 9121211100 కు వెంటనే తెలపండి. 

         ఎర్రచందనం కేసులపై ఎర్రచందనం అక్రమ రవాణ అరికట్టడంలో మరియు నాన్ బైలబుల్ వారంట్స్ (N.B.W) ను జారీ చేయడంలో చిత్త శుద్ధితో పనిచేయాలని. పక్క రాష్ట్రాల నుండి మద్యం రవాణాపై ప్రతేక బృందాలతో నిఘా పెట్టామని, జిల్లాలోని నాటుసారా తయారీ స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యురో మరియు పోలీసు బృందాలతో మెరుపు దాడులు చేసి మూలాలతో పెకిలించే ప్రయత్నం చేయాలని, నిఘా, సమాచార వ్యవస్థ ను పటిష్ట పరిచి, వాహనాల తనిఖీలు ఉదృతం చేయాలని, జిల్లాలో ఎక్కువ ఎర్రచందనం, మద్యం, ఇసుక అక్రమ రవాణా కేసులున్న వారిపై PD యాక్టు ప్రయోగించాలని ఆదేశించినారు.

ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని పాటిస్తూ పొలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలిగి వారి ఫిర్యాదులను స్వీకరించి జవాబుదారీగా ఉండాలని, మహిళలు/చిన్నారుల సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పదించాలని, పోలీస్ శాఖపై నమ్మకం పెంపొందించేలా సేవలు అందించాలని సూచించారు.

         ఈ క్రైమ్ మీటింగ్ నందు అడిషనల్ ఎస్.పి. అడ్మిన్ శ్రీ పి.జగదీష్, IPS, ఏ.ఆర్. అడిషనల్ ఎస్.పి. శ్రీ జి.నాగేశ్వర రావు, ఎస్.బి. డి.ఎస్.పి. శ్రీ శ్రీనివాస రెడ్డి, 3 సబ్ డివిజన్ పోలీసు అధికారులు, జిల్లా నందు గల అందరూ డిఎస్పీ లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ లు మరియు ఎస్.ఐ.లు అందరూ పాల్గొన్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *