ఫైరింగ్ ప్రాక్టీసురేంజ్ ను ఆకస్మిక తనిఖీ చేసిన చిత్తూరు జిల్లా ఎస్పీ
ఏ.ఆర్. మొబిలైజేషన్ లో బాగంగా జరుగుతున్న ఫైరింగ్ ప్రాక్టీసులో భాగంగా శనివారం గంగాధర్ నెల్లూరు వద్ద గల చిత్తూరు పోలీస్ డిపార్టుమెంటుకు చెందిన ఫైరింగ్ రేంజ్ ను జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఏ.ఆర్. సిబ్బంది, అధికారులు ఫైరింగ్ ప్రాక్టీసు నిర్వహిస్తుండగా పర్యవేక్షించారు. ఎస్పీ కూడా స్వయంగా పలు రకాల తుపాకులతో నీల్ పోజిషన్, స్టాండింగ్ పొజిషన్, లయింగ్ పొజిషన్ లో అత్యాధునిక ఆయుధాలతో ఫైరింగ్ ప్రాక్టీస్ చేసి సిబ్బందిలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఈ సందర్బముగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సాయుధ దళ పోలీసుల సేవలు చాలా కీలకం అన్నారు. అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని పిలుపునిచ్చారు. ఫైరింగ్ లో ప్రతి ఒక్కరు పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని, ఫైరింగ్ నందు ఉన్న అనుమానాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందన్నారు. కావున ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు ఫైరింగ్ ప్రాక్టీసెస్ ను జాగ్రత్తగా చేయవలెనని ఆదేశించారు. అనంతరం AR పోలీసు అధికారులు, సిబ్బందికి ఫైరింగ్ ప్రక్రియ గూర్చి ఎస్పీ పలు సూచనలు తెలియజేశారు. ప్రతి ఒక్క బుల్లెట్టు టార్గెట్ (లక్ష్యం) వైపే బుల్ పడే విధంగా తర్పీదు పొందాలని సూచించారు. అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ ఉన్నతి కోసం ముందడుగు వేయాలని కోరారు.
ఈ ఫైరింగ్ ప్రాక్టీసు నందు ఏ.ఆర్. అడిషనల్ ఎస్పీ జి.నాగేశ్వర రావు, ఎస్.బి. డి.ఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏ.ఆర్. డి.ఎస్పీ మురళి, చిత్తూరు ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగి రెడ్డి, ఆర్.ఐ. అడ్మిన్ నీలకంటేశ్వర రెడ్డి, గంగాధర నెల్లూరు ఎస్.ఐ. శ్రీ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.