రాత్రి నగర కమిషనర్ ఆకస్మిక తనిఖీలు విద్యుత్ దీపాలను పరిశీలన
కమిషనర్ డా. జె అరుణ
చిత్తూరు నగర సంస్థ పరిధిలో పూర్తిస్థాయిలో విద్యుత్ దీపాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ డా. జె అరుణ ఇంజనీరింగ్ విభాగం అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి కమిషనర్ నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ దీపాలను పరిశీలించారు. కొండారెడ్డిపల్లి పరిధిలో పుత్తూరు రోడ్డులో విద్యుత్ దీపాలను పరిశీలించి ఇంజనీరింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు కోసం సత్వరం సమగ్ర సర్వే నిర్వహించాలని, ఏ ప్రాంతాల్లో ఎన్ని విద్యుత్ దీపాలు అవసరమో నివేదికలు తయారు చేయాలన్నారు. పాడైన విద్యుత్ దీపాల మరమ్మతులను పూర్తిస్థాయిలో చేయించాలన్నారు. అనంతరం కమిషనర్ స్థానికంగా పలు హోటళ్లను తనిఖీ చేశారు. శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఫ్రిజ్ ల్లో నిల్వ చేసిన మాంసం, ఇతర ఆహార పదార్థాలను వినియోగించరాదన్నారు. కార్యక్రమంలో ఎంఈ ధనలక్ష్మీ, డీఈలు రమణ, వెంకట ప్రసాద్, ఏఈ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.