చిత్తూరులో వీధికుక్కలకు స్టెరిలైజేషన్
చిత్తూరు నగరంలో వీధి కుక్కల సంరక్షణ, వాటి జనాభా నియంత్రణకు నగరపాలక సంస్థ చర్యలు చేపట్టింది. నగర కమిషనర్ డా.జె అరుణ ఆదేశాల మేరకు నగరపాలక ప్రజారోగ్య విభాగం అధికారులు, తిరుపతి పశుసంవర్ధక శాఖ పరిధిలోని ఏబిసి (అనిమల్ బర్త్ కంట్రోల్) విభాగం సిబ్బంది సాయంతో శనివారం నగర పరిధిలోని 38, 32వ వార్డుల పరిధిలో 40 వీధి కుక్కలను పట్టుకున్నారు. వీటిని ప్రత్యేక వాహనంలో తిరుపతి పశుసంవర్ధక శాఖ ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు వీటికి స్టెరిలైజేషన్ నిర్వహించి, యాంటీ రేబిస్ టీకాలు వేస్తారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అన్ని వార్డుల్లో పరిధిలో వీధికుక్కల స్టెరిలైజేషన్ కు చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ డా. జె అరుణ తెలిపారు. కార్యక్రమంలో ఎంహెచ్వో డా.పి.లోకేష్, శానిటరీ ఇన్స్పెక్టర్ చిన్నయ్య పాల్గొన్నారు.