27, ఫిబ్రవరి 2023, సోమవారం

వంగవీటి రాధా జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు

వంగవీటి రాధా (Vangaveeti Radha) జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు

ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్య నేతలు ఎన్నికల ముందు తమ ఆలోచనలపైన స్పష్టత ఇస్తున్నారు. ఇప్పటికే వైసీపీ, టీడీపీల్లో చేరికలు మొదలయ్యాయి. ఇదే సమయంలో ప్రస్తుతం టీడీపీలో ఉన్నా పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్న వంగవీటి రాధా (Vangaveeti Radha Krishna) పార్టీ మారేందుకు రంగం సిద్దం అయినట్లు తెలుస్తోంది...

సన్నిహితుల నుంచి వస్తున్న ఒత్తిడితో రాధా టీడీపీ వీడి జనసేనలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం, ఇందుకు ముహూర్తం కూడా ఖరారైంది...

టీడీపీ - జనసేన పొత్తు ఖాయంగా కనిపిస్తున్న వేళ వంగవీటి రాధా నిర్ణయం విజయవాడ రాజకీయాల్లో ఆసక్తి కరంగా మారుతోంది. నగర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు కారణమవుతోంది...

రాధా గతంలో ప్రజారాజ్యంలోనూ పని చేసారు. జనసేనాని పవన్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలోనే రాధా జనసేనలో చేరుతారనే వార్తలు వచ్చినా.. టీడీపీ - జనసేన పొత్తు విషయంలో నిర్ణయం కోసం వేచి చూసినట్లుగా చెబుతున్నారు...

కొద్ది నెలల క్రితం జనసేన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ విజయవాడలో వంగవీటి రాధాతో భేటీ అయ్యారు. ఆ సమయంలోనే పార్టీలోకి రాధాను ఆహ్వానించినట్లు ప్రచారం సాగింది...

రంగా 2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధినాయకత్వంతో విభేదించి టీడీపీలో చేరారు. కానీ, ఆయనకు గత ఎన్నికల్లో సీటు దక్కలేదు, ఎమ్మెల్సీగా ఇస్తారని భావించినా సాధ్యపడలేదు...

టీడీపీలోనే రాధా కొనసాగుతున్నా.. రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ఇక, ఇప్పుడు ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలని రాధా నిర్ణయించారు...

అందులో భాగంగా జనసేనలో చేరికకు నిర్ణయించినట్లు సమాచారం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *