దళిత డప్పు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
దళిత డప్పు కళాకారులకు ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేయాలి
మార్చి నెల చివరి వారంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడి
ఆంధ్ర ప్రదేశ్ దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీనివాసులు పిలుపు
దళిత డప్పు కళాకారుల సమస్యల పరిష్కరానికి మార్చి నెల చివరి వారంలో కలెక్టర్ కార్యాలయం ముట్టడించనున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీనివాసులు వెల్లడించారు. ఆంధ్ర ప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం జిల్లా సమితి సమావేశం సోమవారం యస్ టి యు కార్యాలయంలో జగ్గయ్య అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారేళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలో దళిత డప్పు కళాకారుల సమస్యలను పరిష్కరించడంలో, గుర్తింపు కార్డు మంజూరు విషయంలో ప్రభుత్వం, సంబంధిత అధికారులు నిర్లక్ష్య వైఖరి అవలంబించడం తగదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత డప్పు కళాకారులపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నదని దీన్ని తీవ్రంగా ఖండించారు. 26 జిల్లాల్లో ప్రజలకు సంబంధించిన శుభ, అశుభ కార్యాలకు సేవ చేస్తున్న దళిత డప్పు కళాకారుల సమస్యలను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. దలిత డప్పు కళాకారు ల పై రాజకీయం వేధింపులు సరికాదన్నారు. దళిత డప్పు కళాకారుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం మార్చి చివరి వారంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమలు చేపట్టనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి జిల్లాల దళిత డప్పు కళాకారుల సంఘం ఉమ్మడి జిల్లాల గౌరవాధ్యక్షులు ఏ .కుమార్ రెడ్డి, సిపిఐ జిల్లా కార్యదర్శి, దళిత డప్పు కళాకారుల చిత్తూరు జిల్లా గౌరవ అధ్యక్షులు యస్ . నాగరాజు మాట్లాడుతూ దేశంలో ,రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను కార్యకర్తలకు వివరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు, పెన్షన్లు పేరుతో దళితులను ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు .పేద ప్రజలకు తెలియకుండా పన్నుల రూపంలో అన్ని వస్తువుల పైన విపరీతంగా పన్నులు వేస్తూ ప్రజలకు 10 రూపాయలు ఇస్తూ ప్రజల వద్ద పన్నుల రూపంలో వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. జిల్లాలో దళిత డప్పు కళాకారుల సంఘం బలోపేతానికి కళాకారులు ఐక్యంగా ఉంటూ పోరాటం చేస్తే తప్ప సమస్యల పరిష్కారం కాదని పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దళిత డప్పు కళాకారుల సంఘం కార్యకర్తలు పోరాటానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
సమావేశంలో దళిత డప్పు కళాకారుల సంఘం జిల్లా నాయకులు జగ్గయ్య, హరి, సీతాపతి, గోవింద స్వామి , వినాయగం , చిత్తూరు నగరo సిపిఐ కార్యదర్శి వి సి గోపీనాథ్ పాల్గొన్నారు.