మదనపల్లిలొ ఉపాధ్యాయిని ఛాయా అనుమానాస్పద స్థితిలో మృతి.
మదనపల్లిలొ ఉపాధ్యాయిని ఛాయా అనుమానాస్పద స్థితిలో మృతి.
మదనపల్లి పట్టణం ఎన్ వి ఆర్ లేఔట్ కి చెందిన ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయిని ఛాయా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భర్తే ఆమెను హత్య చేశారని మృతురాలి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఎన్విఆర్ లేఔట్ లో నివాసముండే నాగేంద్ర మరియు ఛాయాలకు గత 13 సంవత్సరాల క్రితం వివాహం అయింది. సోమవారం రాత్రి ఛాయా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడంతో చాయ కుటుంబ సభ్యులు మృతిపై భర్త నాగేంద్ర మీద కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భర్త నాగేంద్ర తో తరచు గొడవలు జరిగేవని కుటుంబ సభ్యుల ఆరోపించారు. నాగేంద్రకు మరొక మహిళతో వివాహేతర సంబంధం ఉందని, అనేకమార్లు ఛాయా కుటుంబ సభ్యులు నచ్చ చెప్పిన మారలేదని చాయ కుటుంబ సభ్యులు తెలిపారు. ఛాయా వంటిపై దెబ్బలు ఉన్నాయని, భర్త కొట్టి చంపేశాడు అని కుటుంబ సభ్యులు ఎద్దేవా చేశారు.
దృశ్యం 3 సినిమాను తలపించేలా.... నాగేంద్ర చిత్రీకరించాడు అని ఛాయా కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఉరి వేసుకున్న ఇంటిని ఛాయా బంధువులకు నాగేంద్ర చూపించలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లిదండ్రులకు వారంలో మూడు లేదా నాలుగు సార్లు గొడవ జరిగేదని మృతురాలు కొడుకు సాయి నితీష్ వెల్లడించాడు. ఛాయా తల్లి మంజుల ఫిర్యాదు మేరకు మదనపల్లి తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పంచనామా నిమిత్తం ఛాయ మృతదేహాన్ని మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.