శ్రీకాళహస్తి BJP నుండి YSR కాంగ్రెస్ పార్టీలో వలసల జోరు
శ్రీకాళహస్తి పట్టణం 14వ వార్డుకు చెందిన బిజెపి యువత ఈరోజు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి సమక్షంలో వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేరిన వారిలో శ్యామ్ ప్రసాద్,సుమన్, నాగార్జున,నితీష్ ప్రసాద్,హరి, కాంత,కేశవ,సదా తదితరులు చేరారు.
ఈ కార్యక్రమంలో దేవస్థానం బోర్డు మెంబర్ చింతామణి పాండు, సర్పంచ్ ముద్దుమూడి రవి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.