25, ఫిబ్రవరి 2023, శనివారం

PDF అభ్యర్థులకు వామపక్షాల మద్దతు

PDF అభ్యర్థులకు వామపక్షాల మద్దతు
   ఉద్యమ నాయకులను గెలిపించండి
        వామపక్ష నాయకులు పిలుపు                 
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, కార్మికుల సమస్యలు పరిష్కారం చేయకుండా పోరాటాలను ఉక్కుపాదంతో అణిచివేయడం దారుణమని నిరంతరం ఉద్యోగ, కార్మికుల పక్షాన నిరంతరం పోరాటం చేస్తున్న ఉద్యమ నాయకులను పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని శనివారం సిపిఎం  కార్యాలయంలో జరిగిన సిపిఐ -సిపిఎం జిల్లా సమావేశం పిలుపునిచ్చింది .     ఈసందర్భంగా సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు,సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు లు మాట్లాడుతూ శాసనమండలిలో ప్రజా సమస్యలు ప్రస్తావిస్తున్న పిడిఎఫ్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా  ఉందని తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై దాడి చేస్తున్నదని దీనిని వ్యతిరేకించాలని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తామని అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమాలను అణిచివేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగిస్తున్నారని అలాంటి పాలకులకు బుద్ధి చెప్పాలన్నారు. మేధావులు ఎన్నికలలో కూడా రాజకీయ రంగు తీసుకువచ్చిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అని విమర్శించారు .మేధావుల సభకు మేధావులను ఉద్యమ నాయకులను పంపాలని పిలుపునిచ్చారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు నియోజకవర్గం లో పోటీ చేస్తున్న పిడిఎఫ్ పట్టభద్రుల అభ్యర్థి మీగడ వెంకటేశ్వర రెడ్డి, టీచర్ అభ్యర్థి పి.బాబురెడ్డి ల గెలుపు కోసం జిల్లాలో ఉన్న వామపక్ష కార్యకర్తలందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా నాయకులు గోపీనాథ్, సత్యమూర్తి, చంద్ర తదితరులు పాల్గొన్నారు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *