భూహక్కు పత్రాలు పంపిణీని పూర్తి చేయండి: జిల్లా జాయింట్ కలెక్టర్
భూహక్కు పత్రాలు పంపిణీని పూర్తి చేయండి: జిల్లా జాయింట్ కలెక్టర్
రీ సర్వే ప్రక్రియ ను మరియు స్టోన్ ప్లాంటేషన్ ప్రక్రియ ను వేగవంతం గా పూర్తి చేసేలా నిర్దిష్ట ప్రణాళికాతో పని చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జిల్లా లోని ఆర్డీఓలు, తహసిల్దార్లు, సర్వే అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అంశాల పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి విడత రీ సర్వేలో పూర్తయిన భూ హక్కు పత్రాల పంపిణీ ప్రక్రియ ను పూర్తి చేయాలని భూ రికార్డుల స్వచ్చీకరణ లో భాగంగా రీ సర్వే స్టోన్ ప్లాంటేషన్స్ త్వరితగతిన పూర్తి చేసేందుకు నిర్దిష్ట ప్రణాళికతో పని చేయాలన్నారు.
వివాదాలు లేని భూ రికార్డుల రూప కల్పన నిమిత్తం రీ సర్వే కార్యక్రమంలో ఖచ్చితత్వంతో కూడిన రికార్డులు సిద్ధంచేయాలన్నారుస్టోన్ ప్లాంటేషన్ పనులను వేగవంతం చేసేందుకు అను గుణంగా బృందాలు ఏర్పాటు చేసుకోవా లన్నారు.రీ సర్వే ప్రక్రియలో ఎటు వంటి తప్పులకు తావు లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.రీ సర్వే జరుగు తున్న మండలాల్లో గ్రౌండ్ వ్యాలిడేషన్, గ్రౌండ్ ట్రూతింగ్ తదితర అంశాలను సమీ క్షించారు.
ఈ వీడియో కాన్ఫ రెన్స్ కు డిఆర్ఓఎన్. రాజశేఖర్, ఆర్డీవోలు రేణుక, శివయ్య, సృజన, సర్వే శాఖ చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.