భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నామినేషన్
భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థిగా సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నామినేషన్
చిత్తూరు తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో BJP Andhra Pradesh రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు
రాష్ట్ర జిల్లా బిజెపి నాయకులతో కలసి ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ర్యాలీ అనంతరం చిత్తూరు కలెక్టర్ కార్యాలయంలో మిత్రులు సన్న దయాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
చిత్తూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ సన్నాక దయాకర్ రెడ్డి తరపున ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ సందర్భంగా నగరి నియోజవర్గం బిజెపి మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు యం. నిషీధ రాజు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలో కలెక్టర్ కార్యాలయం ప్రదర్శనగా వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమాలలో పుత్తూరు మండలం ప్రధాన కార్యదర్శి మునస్వామి, BJYM అధ్యక్షుడు కిషోర్ , రూరల్ మండలం ప్రధాన కార్యదర్శి వెంకట్రాయలు , నారాయణ, నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా మరియు రాష్ట్ర నాయకుల్ని కలవడం జరిగింది. ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు పనిచేస్తామని తెలియజేయడం జరిగింది.