27, ఫిబ్రవరి 2023, సోమవారం

సులభతరంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ

సులభతరంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీ 

జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ డా.ఐ.కరుణ కుమార్ 


 ప్రజలకు మరింత సులభతరంగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జ్ డా.ఐ.కరుణ కుమార్ ఆదేశించారు. జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల జారీ అంశాలపై సోమవారం చిత్తూరు నగరపాలక కార్యాలయంలో నగరపాలక సంస్థ, పంచాయతీరాజ్, జిల్లా రిజిస్ట్రార్ శాఖల అధికారులు, ఉద్యోగులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రజలు జనన, మరణ, వివాహ రిజిస్ట్రేషన్ ధ్రువపత్రాల కోసం ఇబ్బందులు పడుతున్నారని... ఇబ్బందులను తొలగిస్తూ ధ్రువపత్రాలను ఆన్లైన్ పోర్టల్ ద్వారా సులభంగా పొందడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో ధృపత్రాల జారీ ప్రక్రియలో చట్టానికి లోబడి వ్యవహరించాలన్నారు. బాల్యవివాహాలను అరికట్టాలని, ఇందుకోసం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు మరింతగా చేపట్టాలన్నారు. చిన్న వయసులోనే గర్భవతులు కావడం ద్వారా కలిగే అనర్ధాలను వివరించాలని చెప్పారు. ప్రతి ఒక్క వివాహాన్ని చట్ట ప్రకారం రిజిస్ట్రేషన్ చేయించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా నగరపాలక కార్యాలయంలో జరిగే జనన, మరణ ధ్రువపత్రాల జారీ విధానాన్ని, రికార్డులను పరిశీలించారు.  ధ్రుపత్రాల జారీ విషయంలో ఎదురయ్యే సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా నగర కమిషనర్ డా.జె అరుణ మాట్లాడుతూ... న్యాయమూర్తి గారు ఆదేశించిన విధంగా జనన, మరణ ధ్రువపత్రాలను ప్రజలకు సులభంగా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో పంచాయతీరాజ్, రిజిస్ట్రేషన్ శాఖల పరిధిలో జరుగుతున్న దృపత్రాల జారీ అంశాలపై డీపీవో లక్ష్మీ, జిల్లా రిజిస్ట్రార్ శ్రీనివాసరావు లు వివరించారు. సమావేశంలో సహాయ కమిషనర్ గోవర్థన్, ఎంహెచ్వో డా.లోకేష్, ఎంఈ ధనలక్ష్మి, ఎసీపీ రామకృష్ణుడు, ఏఎస్వో నరసింహ, ఇతర అధికారులు పాల్గొన్నారు.





అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *