జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీగా సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం
ఆంద్రప్రదేశ్ శాసన మండలి నందలి ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీగా సిపాయి సుబ్రహ్మణ్యం (Cipai Subramanyam) ఏక గ్రీవంగా ఎన్నిక అయ్యారని చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గం,రిటర్నింగ్ అధికారి, జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తెలిపారు.
కేంద్ర ఎన్నికల కమిషన్ ఉత్తర్వుల మేరకు ఆంద్రప్రదేశ్ శాసన మండలి నందలి చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఎమ్మెల్సీ ఎన్నికల కు ఈ నెల 16 న నోటిఫికేషన్ విడుదల చేయడమైనది. 23 న వైఎస్సార్సీపీ అభ్యర్థిగా సిపాయి సుబ్రమణ్యం (Cipai Subramanyam) నాలుగు సెట్లు నామినేషన్లు, ఇండిపెండెంట్ అభ్యర్థి గా సి.ధనంజేయులు రెండు సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది.
అభ్యర్థులు నామినేషన్లు ఈ నెల 24 న పరిశీలించగా అందులో ఇండిపెండెంట్ అభ్యర్థి సి.ధనంజేయులు నామినేషన్లు సాంకేతిక లోపం ఉండడంతో తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం ఏకగ్రీవం ఎన్నికైనట్లు ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వుల మేరకు సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి చాంబర్ లో చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు బి. శ్రీధర్, రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ డిక్ల రేషన్ ఫారం అందజేశారు.