ఈనాడు పత్రికను ప్రజలు బహిష్కరించలి: చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు
తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడు పత్రికను ప్రజలు బహిష్కరించాలని చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. పట్టాభి ఉదంతంలో పాత ఫోటోలతో ప్రజలను తప్పుదారి పట్టించాలని చూడడం శోచనీయమని పేర్కొన్నారు. గురువారం చిత్తూరు వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ప్రచురించిన వార్తకు సవరణ ద్వారా ఈనాడు పత్రిక తన నైజాన్ని చాటుకుందని విమర్శించారు. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా ఈనాడు పనిచేస్తోందని చెప్పారు. తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడుకు వంత పాడటమే ఈనాడు ధ్యేయంగా పేర్కొన్నారు. పట్టాభి వాహనంలో నుంచి పడిపోయిన ఫోటోలను ప్రచురించడం సరైంది కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పారు. ఇటువంటి చెడు సంప్రదాయాలను విడిచి పెట్టాలని కోరారు. అనంతరం పార్టీ కార్యాలయం ఆవరణలో ఈనాడు దినపత్రిక ప్రజలను దహనం చేశారు. నగర మేయర్ ఆముద, చూడా చైర్మన్ పురుషోత్తం రెడ్డి, త్యాగరాజులు పాల్గొన్నారు.