25, ఫిబ్రవరి 2023, శనివారం

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఓటర్ల తుది జాబితా విడుదల


 
ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది  జాబితా విడుదల

 జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి ఎం. నారాయణన్

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల ఓటర్ల తుది   జాబితాను జిల్లా కలెక్టర్ ఎం. నారాయణన్  ప్రటించారు. ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఎన్నికల రిటర్నింగ్ అధికారి యం.హరి నారాయణన్ తెలిపారు. 

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి 6  జిల్లాల పరిధిలో అన్నమయ్య,బాపట్ల, చిత్తూరు, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 320 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా మొత్తం  3,81,181 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు.

 జిల్లాల వారిగా.. 

1. చిత్తూరు జిల్లా 48 పోలింగ్ స్టేషన్ల పరిధి లో మొత్తం ఓటర్లు: 54,152 మంది...  ఇందులో 35,189 పురుషులు, 18,960 మంది మహిళలు, 3 మంది ఇతరులు...

2. తిరుపతి జిల్లా 62 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 86,941 ..ఇందులో 53,435 పురుషులు, 33,494 మంది మహిళలు, 12 మంది ఇతరులు.

3. అన్నమయ్య జిల్లా 21 పోలింగ్ స్టేషన్ల పరిధిలో  మొత్తం ఓటర్లు: 23,838 .. ఇందులో 15,490 పురుషులు, 8,345 మంది మహిళలు, 3 మంది ఇతరులు...

4. బాపట్ల జిల్లా 24 పోలింగ్ స్టేషన్ల పరిధిలో  మొత్తం ఓటర్లు: 26,390 మంది మొత్తం  ఉండగా ఇందులో 17,626 పురుషులు, 8,763 మంది మహిళలు, ఒక్కరు  ఇతరులు...

5. ప్రకాశం జిల్లా 86 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 82,225.. ఇందులో 55,703 పురుషులు, 26,517 మంది మహిళలు, 5 మంది ఇతరులు..

6. శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు)జిల్లాలో 79 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 1,07,635 ఇందులో 68,423 పురుషులు, 39,205 మంది మహిళలు, 7మంది ఇతరులుగా కలరన్నారు.

ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఉపాధ్యాయుల నియోజకవర్గ ఎం.ఎల్.సి ఓటర్లకు సంబందించి అన్నమయ్య, బాపట్ల, చిత్తూరు, ప్రకాశం,శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు), తిరుపతి జిల్లాల లో మొత్తం 175 పోలింగ్ స్టేషన్ల పరిధి లో 27,694  మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు.

 ఇందులో జిల్లాల వారిగా

1. చిత్తూరు జిల్లాలో  మొత్తం 31 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 3,887 మంది  ఉండగా.. ఇందులో 2,341 పురుషులు, 1,546 మంది మహిళలు, 

2. తిరుపతి జిల్లాలో  37 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 6,132  ఇందులో 3,604 పురుషులు, 2,528 మంది మహిళలు.

3. అన్నమయ్య జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 1,932  ఇందులో 1,180 పురుషులు, 752 మంది మహిళలు.

4. బాపట్ల జిల్లాలో 13 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం  1,789 మంది మొత్తం ఓటర్లు ఉండగా ఇందులో 1094 పురుషులు, 695 మంది మహిళలు

5. ప్రకాశం జిల్లాలో 40 పోలింగ్ స్టేషన్ల పరిధిలో  మొత్తం ఓటర్లు: 5,789  ఇందులో 3,691 పురుషులు, 2,098 మంది మహిళలు

6. శ్రీ పొట్టి శ్రీరాములు (నెల్లూరు)జిల్లాలో 39 పోలింగ్ స్టేషన్ల పరిధి లో  మొత్తం ఓటర్లు: 8,165   ఇందులో 4,915 పురుషులు, 3,250 మంది మహిళలు కలరన్నారు.

-

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *