ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలి: BJP
ప్రజలకు త్రాగు నీటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని భాజపా నేతలు కోరారు. శనివారం చిత్తూరు నగర పాలక సంస్థ కమీషనర్ డాక్టర్ అరుణ భాజపా నేతలు కలిసి సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు త్రాగు నీటికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని, కేంద్ర ప్రభుత్వం ప్రజలకు శాశ్వత తాగునీటి పరిష్కారం కోసం ప్రవేశ పెట్టిన జలజీవన్ మిషన్ పథకాన్ని త్వరితగతిన పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.కమిషనర్ ను కలసిన వారిలో ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, యస్సీ మెర్చా జిల్లా అధ్యక్షులు కె.రవికుమార్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాధాకృష్ణన్, ఓబీసీ మెర్చా జిల్లా కార్యదర్శి ఏ.శ్రీనివాసన్, భాజపా మండల ప్రధాన కార్యదర్శి దొరబాబు, ఓబీసీ మండల అధ్యక్షులు యస్.కుమార్ ఉన్మారు.