చిన్న పిల్లలు చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాలి
చిన్న పిల్లలు చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాలి
జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ. కరుణ కుమార్
చిన్న పిల్లలు తెలిసో తెలియకో చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాల్సి బాధ్యత పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమన్వయం చేసుకొని పని చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐ. కరుణ కుమార్ పేర్కొన్నారు.
జువెనైల్ జస్టిస్ బోర్డ్ సంక్షేమ అధికారి లక్ష్మీపతి, డి.ఎస్.పి తిప్పేస్వామిల తో కలిసి మంగళవారం సాయంత్రం స్థానిక జిల్లా కోర్టులోని న్యాయ సదన్ భవనము నందు బాలల న్యాయం (బాలల సంరక్షణ మరియు రక్షణ ) చట్టం 2015 పై పోలీస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ వెల్ఫేర్ అధికారుల కు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు బాలల న్యాయ సంరక్షణ మరియు రక్షణ చట్టం 2015 పై పూర్తి అవగాహన కలిగి వుండాలని తెలిపారు. చిన్న పిల్లలు తెలిసో తెలియకో చేసిన నేరాలు క్షుణ్ణంగా పరిశీలించి వారిలో మార్పులు తీసుకురావాల్సి బాధ్యత పోలీస్, చైల్డ్ వెల్ఫేర్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని చూచంచారు.
ప్రతి జిల్లాలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంటుందని, ఈ కమిటీ లో ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఒకరు, ఇద్దరినీ ప్రభుత్వం నామినేటెడ్ చేస్తుందని తెలిపారు. చిన్నపిల్లలు తెలుసో తెలియకో చట్ట నికి విరుద్ధంగా నేరారోపణలు చేసిన పిల్లను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందుకు 24 గంటల్లోగా హాజరపరచాలన్నారు. నేరారోపణలు చేసిన పిల్లలను కొట్టడం,మీడియా ముందు తీసుకురాకూడదని తెలిపారు, పిల్లలు ఏ కారణం చేత నేరారోపణ లు చేశారనే వివరాలను స్నేహపూర్వకంగా సైకాలజిస్ట్ తో వారి వివరాలను తెలుసుకొని వారి లో మార్పు వచ్చేవిదంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జువెనైల్ జస్టిస్ బాలల సంరక్షణ మరియు రక్షణ చటం 2015 లో ప్రవేశ పెట్టడం జరిగిందని, మనదేశంలో తెలిసో తెలియకో నేరారోపణలు చేసిన పిల్ల వాళ్ళని భారతదేశానికి అవసరమైన స్వచ్ఛమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అబ్జర్వేషన్ హోమ్ లో ఉంచడం జరుగుతుందని, జువెనైల్ జస్టిస్ చట్టంపై ఈరోజు పోలీసు అధికారులకు, చైల్డ్ వెల్ఫేర్ బోర్డ్ అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రొబేషన్ అధికారి కె.సుధాకర్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పరసన్ వసంత, తిరుపతి చిల్దేరేన్ హోమ్ సూపరింటెండెంట్ పి.వి. రాం మనోహర్, ప్రొబేషన్స్ ఆఫీసర్లు,న్యాయవాది వాసుమతి జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సూపరింటెండెంట్ ఆర్.ఎస్.ప్రతిమ,చిత్తూరు ఉమ్మడి జిల్లాలోని సబ్ ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.