22, ఫిబ్రవరి 2023, బుధవారం

జిల్లా లో 205 ఏకోపాధ్యాయ పాఠశాలల మూసివేత.

విద్యను పూర్తిగా ప్రయివేటు పరం చేసే కుట్ర
 టిఎన్ఎస్ఎఫ్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షుడు ప్రభు తేజ

- జిల్లా లో 205 ఏకోపాధ్యాయ పాఠశాలల మూసివేత. 

- నాడు నేడు కింద మరమ్మత్తులు చేసాం అన్నారు. చేసుంటే ఎందుకు విలీనం చేసారు? ఒకవేళ చేసింది నిజం కాకపోతే కాంట్రాక్టర్లు దోచిపెట్టడం కోసమే చేసారా? 

- గత ఏడాది విలీనం పేరుతో జీవో నెంబర్ 84, 85, 117 తెచ్చి సుమారు 498 పాఠశాలను చిత్తూరు జిల్లాలో మూసివేసి విద్యార్థులు జీవితాలు ప్రశ్నార్థకంగా మారింది.

- దేశంలో నే ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో ఉంది. ప్రభుత్వం పాఠశాలల నుండి గత విద్యా సంవత్సరంలో 2.8 మంది వైదొలిగారు. దీన్ని బట్టి చూస్తే ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు ఒక బూటకమని తేలిపోయింది. 

- ప్రాథమిక పాఠశాలలు 1 కిలోమీటరు లో ఉండాలన్న నిర్దేసిత లక్ష్యానికి తూట్లు పొడిచి బడిని 3 నుండి 5 కిలోమీటర్ల దూరానికి చేర్చడం ద్వారా ఆ కుటుంబాల యొక్క సామాజిక, ఆర్థిక స్థితి గతులను తీవ్రంగా ప్రభావితం చేయడమే కాక ప్రైవేట్ స్కూళ్లకు ఆయా కుటుంబాలు ఆర్థిక వనరు గా మరి ప్రభుత్వ విద్యా వ్యవస్థను కోలుకోలేని దెబ్బ తీస్తున్నారు. 

- ప్రభుత్వ, ఎంపీపీ,జెడ్పి, పాఠశాలలు మూసివేసి ఆ పాఠశాల ఆస్తులు తాకట్టు పెట్టి ఎలక్షన్ ఫండ్ కి ఉపయోగించుకోవాలని అనుకున్నారా ?? 

-  విద్యార్థి-ఉపాధ్యాయ నిష్పత్తి లో ప్రాథమిక మరియు ఉన్నత ప్రాధమిక పాఠశాలలో 49 శాతం మరియు 17.96 శాతం తో అద్వాన్నంగా ఉంది అని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక లో నే ఉంది.

- అన్ని విద్యార్థి సంఘ నాయకులు, ఉపాధ్యాయ సంఘం నాయకులు ఏకమై కార్యాచరణ  ప్రకటిస్తాం.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *