ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ను దుర్వినియోగం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
CPM జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు
రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వమే ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి, అధికారాన్ని దుర్వినియోగం చేయడం దారుణం అని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టడానికి, అధికారాన్ని ఉపయోగించి బెదిరించడానికి పూనుకుంటోంది.
ఒక్కో పోలింగ్‌బూత్‌కు 10 మంది చొప్పున పాయింట్ ఆఫ్ కాంటాక్ట్సు (పి.ఒ.సి.)గా స్థానిక వైసిపి పార్టీ నాయకులను పనిచేయడానికి నియమిస్తున్నారు. వీరితో మంత్రులు, ఎమ్మెల్యేలు సమావేశమవుతున్నారు. పి.ఒ.సి కేంద్రంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో కుమ్మక్కై ప్రైవేటు టీచర్లను బెదిరించడం జరుగుతున్నది. పరిశ్రమలు, కంపెనీలను సందర్శించి యాజమాన్యంతో కలిసి ఓటర్లను ప్రలోభపెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రవాణా, లాజిస్టిక్స్, ఫలహారాలు అని చెప్పి ఓటర్లకు గాలం వేయడానికి ‘‘కోడ్’’ భాషను ఉపయోగిస్తున్నారు. ఇది పూర్తిగా ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించడమే. రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది. దీన్ని నివారించేందుకు ఎన్నికల కమిషన్ తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది. ఫిబ్రవరి 24,25 తేదీలలో రాష్ట్ర ప్రభుత్వం ‘‘సిటిజన్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’’ నిర్వహించి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించింది. నేడు మంత్రులు, ఎమ్మెల్యేలు పిఒసిల పేరుతో అధికార దుర్వినియోగానికి పూనుకుంటున్నారు. కాబట్టి ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకొని పోలింగ్ ముగింపు వరకు ఎన్నికల కోడ్ సక్రమంగా అమలు జరిగేట్లు, రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా తగు చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.