24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

రాష్ట్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు రద్దు చేయాచేయాలి: CPM డిమాండ్

రాష్ట్ర ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలు రద్దు చేయాచేయాలి         
 సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా  ‘సిటిజన్‌ అవుట్‌ రీచ్‌ ప్రోగ్రాం’ నిర్వహణకు  సచివాలయ శాఖ జిల్లా అధికారులకు ఆదేశాలిచ్చింది. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధం.ఈ కార్యక్రమాన్ని వెంటనే నిలిపివేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 9 నుండి ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. కానీ ప్రభుత్వం తన పధకాలపై ప్రచారం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ఫిబ్రవరి 24, 25 తేదీలలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సచివాలయ  ఉద్యోగులు వలంటీర్లతో కలిసి ఇంటింటికి వెళ్ళి సంక్షేమ పథకాల అమలుపై అభిప్రాయాలను సేకరిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల చేర్పింపులో వలంటీర్ల పాత్రపై సర్వత్రా విమర్శలు వచ్చాయి. అధికార పార్టీ తరపున ఎన్నికలతో సంబంధంలేని శాఖల  అధికారులు ఓటర్లను ఎన్ని రకాలుగా ప్రలోభాలకు గురిచేస్తున్నారో ఇటీవల జరిగిన ఉదంతాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రచార కార్యక్రమంలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులను భాగస్వాములను చేసి నిర్వహించాలని సచివాలయ శాఖ ఆదేశించింది. అంటే పూర్తి స్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయడానికే దీన్ని తీసుకొచ్చారని అర్ధమవుతోంది.
కనుక మీరు జోక్యం చేసుకొని పోలింగ్‌ ముగింపు తేది మార్చి 13 వరకు ఎన్నికల కోడ్‌కు విరుద్ధంగా ఎటువంటి ప్రచార కార్యక్రమాలు చేపట్టకుండా ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తున్నది.. ఎన్నికలు సజావుగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *