28, ఫిబ్రవరి 2023, మంగళవారం

జగనన్న కాలనీ లబ్ధిదారులకు రూ. 5 లక్షల రూపాయలు ఇవ్వాలి: CPI

 జగనన్న కాలనీ లబ్ధిదారులకు రూ.   5 లక్షల రూపాయలు ఇవ్వాలి

 టిడ్కో  గృహాలను  డిపాజిట్ చెలించిన  లబ్ధి దారులకు స్వాధీనం చేయాలి

          గ్రామీణ ప్రాంతంలో కనీసం ఇంటికి రెండు సెంట్లు, పట్టణ ప్రాంతంలో ఒకటిన్నర సెంటు ఇవ్వాలని కోరుతూ  మార్చి నెల 2 వ తారీఖున విజయవాడలో జరిగే మహాధర్నాను  జయప్రదం చేయాలని  కోరుతూ  సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు గోడ పత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీలో నిరుపేదల ఇండ్లు నిర్మాణాo చేపట్టడాన్ని సిపిఐ పార్టీగా అభినందిస్తున్నాం. కానీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న 1,80,000 చాలడం లేదని ప్రస్తుతం పెరిగిన సిమెంటు, స్టీలు, ఇసుక, ఇటుక, చివరికి నీళ్లు కూడా కొనే పరిస్థితుల్లో ఉందని ఇలాంటి అప్పుడు ప్రభుత్వం ఇచ్చే లక్షా ఎనభై వేల రూపాయలు ఎక్కడికి చాలుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు.

       గతంలోని ప్రభుత్వాలు మూడు సెంట్లు, రెండు సెంట్లు ఇస్తూ ఉంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  గ్రామీణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్లు భూమి, పట్టణ ప్రాంతాల్లో ఒక సెంటు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు.  అలాగే గత ప్రభుత్వంలో అర్హత గల లబ్ధిదారుల వద్ద డిపాజిట్లు వసూలు చేసి గృహాలు ప్రభుత్వం నిర్మించింది అని డిపాజిట్లు చెల్లించిన లబ్ధిదారులకు టిడ్కో గృహాలను స్వాధీనం చేయాలని, జగనన్న కాలనీలో మౌలిక వసతులు అయిన సిసి రోడ్లు, మురికి కాలువలు, నీటి కొళాయిలు, వీధిలైట్లు, యుద్ధ ప్రాతిపదిక పైన ఏర్పాటు చేయాలని కోరుతూ  భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపుమేరకు మార్చి 2 వ తారీఖున విజయవాడ మహానగరంలో మహా ధర్నా చేపట్టినట్లు తెలిపారు. ఈ ధర్నాకు చిత్తూరు జిల్లాలోని జగనన్న కాలనీ లబ్ధిదారులు పార్టీ కార్యకర్తలు 1 వ తేదీ న తరలిరావాలని పిలుపునిచ్చారు.

          ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి వి సి గోపీనాథ్, సిపిఐ నాయకులు దాసరి చంద్ర ,విజయ గౌరీ ,జమీలాభి, కుమారి, రమాదేవి,  కోమల, గజేంద్ర బాబు, నాగరాజా, బాలాజీ రావు తదితరులు పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *