23, ఫిబ్రవరి 2023, గురువారం

భారీగా పెరిగిన కాణిపాకం ఆదాయం

20 రోజుల కాణిపాకం హుండీ ఆదాయం రూ. 1.36 కోట్లు

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు శ్రీ స్వామివారి హుండీ లెక్కింపు ద్వారా 20 రోజులకు  ఆదాయం 1,36,52,181/- రూపాయలు వచ్చింది. బంగారం 45 గ్రాములు, వెండి 1 కిలో 700 గ్రాములు, యూఎస్ఏ   4,037 డాలర్స్ , ఆస్ట్రేలియా  235 డాలర్స్, కెనడా 35 డాలర్స్ ,  ఇంగ్లాండు 15 పౌండ్స్ ,  సింగపూర్ 12 డాలర్స్, మలేషియా 1 రింగ్గిట్స్ ఆదాయం వచ్చినట్లు దేవస్థానం పాలకమండలి చైర్మన్ మోహన్ రెడ్డి,  దేవస్థానం ఈవో తెలిపారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయ ఏఈవోలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాసాగర్ రెడ్డి, హరి మాధవరెడ్డి, హేమమాలిని, ఆలయ పర్యవేక్షకులు శ్రీధర్ బాబు, కోదండపాణి,  శ్రీనివాస్,  రవి, అర్ధగిరి ఆలయ ఈవో సుబ్బారెడ్డి, యూనియన్ బ్యాంక్ కాణిపాకం శాఖ మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *