ఆలయ నిర్వహకులు, గ్రామస్తులచే పాత్రికేయులకు ఘన సన్మానం
ఆలయ నిర్వహకులు, గ్రామస్తులచే పాత్రికేయులకు ఘన సన్మానం
మండల కేంద్రమైన తవణంపల్లి లో వెలసిన శ్రీ కాలభైరేశ్వర స్వామి దేవస్థానంలో జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు సహకరించిన పాత్రికేయులను ఆలయ నిర్వహకులు, గ్రామస్తులు మంగళవారం ఘనంగా సత్కరించారు. ఆలయంలో ఈనెల 16 నుంచి 22 వరకు అంగరంగ వైభవంగా స్వామివారి మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల నిర్వహణలో సహకరించిన పాత్రికేయులు కేశవులు, చంద్ర యాదవ్ లను ఘనంగా సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మురగ చంద్రమోహన్, భాస్కర్, జగదీశ్వర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.