సిట్ విచారణలో నారాయణస్వామి అసలు గుట్టు విప్పరా ?
అప్రూవల్ గా మారడానికి స్వామి అంగీకరించారా?
తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కోరినట్లు సమాచారం
నూతన ఎక్సైజ్ పాలసీ తయారీలో తన పాత్ర లేదని స్వస్టికరణ
నారాయణస్వామి ఇంట్లో విస్తృతంగా తనిఖీలు, డాక్యుమెంట్లు స్వాధీనం?
నారాయణస్వామిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన సిట్ బృందం
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం శుక్రవారం కీలక మలుపు జరిగింది ఉన్న బలంగా సిట్టాధికారులు పుత్తూరులోని మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఇంటికి చేరుకున్నారు ఆయనను అదుపులోకి తీసుకొని సుదీర్ఘంగా ప్రశ్నించారు ఆయన ఇంట్లో విస్తృతంగా తనిఖీలు చేశారు గత ప్రభుత్వంలో ఆయన ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేయడంతో ఆయన వాగ్మోలం వాగ్మోలం కీలకంగా మారింది గతంలో ఒకసారి సెట్ నోటీసులు ఇచ్చిన నారాయణస్వామి విచారణకు హాజరు కాలేదు దీంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించి కొంత సమాచారం రాబట్టారు మిగిలిన సమాచారం కోసం శుక్రవారం చిట్టి అధికారులు పుత్తూరు క వచ్చినట్లు తెలుస్తోంది విచారణలో నారాయణస్వామి మద్యం కుంభకోణానికి సంబంధించిన గుట్టు మొత్తం విప్పినట్లు తెలుస్తోంది తనకు ఏమాత్రం ప్రమేయం లేదని తాను అప్రూవల్ గా మారడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని సమాచారం తనకు తన కుటుంబానికి రక్షణ కల్పించాలని కూడా సెట్ అధికారులను కోరినట్లు తెలిసింది.
తాడేపల్లి ప్యాలెస్ ఒత్తిడితోనే మద్యం పాలసీపై సంతకాలు చేశారని అధికారులు అనుమానిస్తున్నారు. నూతన మద్యం పాలసీ సమయంలో నారాయణస్వామి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. వైకాపా హయాంలో మద్యం పాలసీలో మార్పులపై సిట్ నారాయణ స్వామి ని ప్రశ్నించనుంది. లిక్కర్ ఆర్డర్స్‌లో ఆన్‌లైన్ విధానం తొలగించి మాన్యువల్ విధానం తేవడంపైనా విచారించారు. ఈ విచారణలో మాజీ ఎక్సయిజ్ శాఖ మంత్రి, ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి లిక్కర్ స్కాం గుట్టు మొత్తం విప్పినట్లు తెలుస్తుంది. తాను కేవలం పేరుకు మాత్రమే ఎక్సయిజ్ శాఖ మంత్రినని, తన శాఖలో ఏమి జరుగుతోందో కూడా తనకు తెలియదని, అధికారులు ఎవ్వరూ కూడా తనని లెక్కచేసేవారు కాదని, లిక్కర్ స్కాంలోనే మాత్రమే కాకుండా మొత్తం ఎక్సైజ్ శాఖలో మొత్తం కథంతా వైఎస్ భారతీరెడ్డి, వైఎస్ జగన్మోహన రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, మిధున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కసిరెడ్డి రాజేంద్రరెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని, అంతా వాళ్ళు చెప్పినట్లే తాను చేశానని, నన్ను వాళ్ళు సంతకాలు పెట్టమన్నచోట తాను సంతకాలు పెట్టడమే తన పనని, వాళ్లు నాకు మంత్రి పదవి ఇచ్చి కుంభకోణాలు చేసి నన్ను బలిపశువును చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తన ప్రమేయం లేకున్నా ఇరికించారని, ఆ కుంభకోణంలో డబ్బంతా ఆ రెడ్లకు దక్కిందని, ఈ కేసులు మాత్రం దళితుడినైన నాకు దక్కాయని సిట్ అధికారులు సమక్షంలో నారాయణస్వామి మరియు అతని భార్య భోరుభోరున విలపించినట్లు సమాచారం. సిట్ అధికారులు ముందు ఇంకా అనేక విషయాలు గురించి మొత్తం చెప్పేసిన నారాయణస్వామి. తనకు తన కుటుంబ సభ్యులకు ఆ రెడ్ల నుండి ప్రాణహాని ప్రాణాలకి ముప్పు పొంచి ఉందని తీవ్ర భయాందోళన వ్యక్తం చేసి మాజీమంత్రి నారాయణస్వామి దంపతులు విలపించినట్లు తెలిసింది. తాను సాక్షి గా మారడానికి సిద్దంగా ఉన్నట్లు, ఈ విషయం బయటకు తెలిస్తే బతకనివ్వరని ఆందోళన చెందినట్లు సమాచారం. మద్యం కుంభకోణం ఇప్పటికే వైసీపీ ముఖ్యులు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారు కటకటాల పాలయ్యారు. వారికి బెయిల్ సైతం దొరకడం లేదు. మరోవైపు ఇప్పటివరకు ఈ కేసులో రెండు సార్లు ప్రత్యేక దర్యాప్తు బృందం చార్జ్ షీట్లు దాఖలు చేసింది. అందులో అంతిమ లబ్ధిదారుడు గురించి పరోక్ష ప్రస్తావన చేసింది. ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పేరును పలుమార్లు ప్రస్తావించింది. అయితే అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వర్తించిన ఓ నేత అరెస్టు తప్పదని ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు తాజాగా ఆయన చుట్టూ జరుగుతున్న పరిణామం ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెస్ హయాంలో ఎక్సైజ్ శాఖామంత్రిగా నారాయణస్వామి పనిచేశారు. మద్యం కుంభకోణం కేసు విచారణలో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం ఆయనకు నోటీసులు జారీ చేసింది. అయితే అనారోగ్య కారణాలతో తాను విచారణకు రాలేకపోతున్నానని ప్రత్యేక దర్యాప్తు బృందానికి నారాయణస్వామి సమాచారం అందించారు. గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినా, ఆయన ప్రమేయం లేకుండానే నూతన మద్యం పాలసీని రూపొందించినట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయన పాత్ర పై దర్యాప్తులో తేలలేదని సమాచారం. దీనికి కారణంగానే మద్యం కుంభకోణం కేసులో సాక్షిగానే నారాయణస్వామి స్టేట్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం నడిచింది. అందులో భాగంగానే ఆయనకు నోటీసులు అందించినట్లు తెలుస్తోంది. అయితే ఉన్న ఫలంగా శుక్రవారం నారాయణస్వామి ఇంటికి నేరుగా ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు రావడం సంచలనంగా మారుతోంది. అయితే నారాయణస్వామిని అరెస్టు చేస్తారా? లేకుంటే విచారణతో సరిపెడతారా అని ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం నారాయణ స్వామి ఇంట్లో సిట్ అధికారులు తనిఖీలు జరుపుతున్నారు. అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి ఇంట్లో తనిఖీలు జరుగుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిరోజులుగా దర్యాప్తుపై ఎటువంటి అప్డేట్ లేకపోవడంతో విచారణ తుది దశకు చేరిందని వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. నిందితుల జాబితాలో ఉన్నవారిలో కొందరిని అప్రూవర్లుగా మార్చుకోవాలని సిట్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు నిందితులుగా చెప్పని వారి అరెస్టుకు ప్రయత్నిస్తోందని తాజాగా ప్రచారం జరుగుతోంది. ప్రధానంగా గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎక్సైజ్ శాఖను పర్యవేక్షించిన వైసీపీ సీనియర్ నేత నారాయణస్వామిని సిట్ టార్గెట్ చేసిందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లిక్కర్ స్కాంలో ఇప్పటివరకు నారాయణస్వామి పేరు ఎక్కడా ప్రస్తావించలేదని అంటున్నారు. కానీ, గతంలో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసిన ఆయనను కూడా నిందితుడుగా చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే నారాయణస్వామిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన నారాయణస్వామి మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడిగా చెబుతారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లు మంత్రిగా ఉన్నవారిలో నారాయణస్వామి ఒకరు. గత ఎన్నికల్లో స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకున్న నారాయణస్వామి తన బదులుగా కుమార్తె కృపాలక్ష్మికి పోటీకి దింపారు. ఇక ఎన్నికల అనంతరం లిక్కర్ స్కాంపై విపతీరమైన ఆరోపణలు వచ్చినా, ఎక్కడా నారాయణస్వామి పాత్రపై చర్చ జరగలేదు. కానీ అనూహ్యంగా సిట్ ఆయనపై ఫోకస్ చేయడం ఆసక్తికరంగా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్ పాలసీని మార్చి ప్రభుత్వ దుకాణాల ద్వారా నాసిరకం మద్యం విక్రయించారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. సుమారు లక్ష కోట్ల విలువైన మద్యం విక్రయించారని, రూ. 3,500 కోట్లు కమీషన్ గా అందుకున్నారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ముందుగా ఏసీబీతో విచారణ చేయంచి అనంతరం ప్రత్యేక దర్యాప్తునకు సిట్ ను నియమించింది. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిట్ లో పలువురు సీనియర్ పోలీసులు అధికారులు సభ్యులుగా ఉన్నారు. సిట్ దర్యాప్తులో ఇప్పటివరకు వైసీపీ మాజీ ఎంపీ మిథున్ రెడ్డితోపాటు మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, గత సీఎంవోలో కీలకంగా పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయరెడ్డి, కృష్ణమోహనరెడ్డి, ఐటీ మాజీ సలహాదారు కేసిరెడ్డి రాజశేఖరరెడ్డిని అరెస్టు చేశారు. దీంతో లిక్కర్ కేసులో వైసీపీ ఆత్మరక్షణలో పడిపోయింది. అయితే ఇప్పుడు మంత్రి నారాయణస్వామి విచారణ తర్వాత సిట్ యాక్షన్ ఎలా ఉండబోతోందనేది చర్చనీయాంశంగా మారింది.
గంగ 2 నారాయణస్వామి

