జిల్లాలో 32 సింగల్ విండోలకు త్రీమెన్ కమిటీల ఏర్పాటు
(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.)
చిత్తూరు జిల్లాలోని 32 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు త్రీ మెన్ కమిటీలను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో మొత్తం 37 సింగిల్ విండోలు ఉన్నాయి. ఇందులో 32 సింగల్ విండోలకు త్రీమెన్ కమిటీలను నియమించింది. మరో అయిదు సింగల్ విండోలకు నియమించాల్సి ఉంది. సంబంధిత శాసనసభ్యుల నుండి ప్రతిపాదనలు అందిన తర్వాత మిగిలిన వాటికి కూడా త్రీ మెన్ కమిటీలను నియమించే అవకాశం ఉంది. మొదట త్రీ మెన్ కమిటీలను నియమించి, ఆరు నెలల తర్వాత వాటికి ఎన్నికలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఈ కమిటీల ద్వారా ఓటర్ల జాబితా తయారీ, సవరణ తదితర కార్యక్రమాలను చేపట్టనున్నారు.
చంద్రశేఖరపురం సింగల్ విండో చైర్మన్ గా హేమచంద్ర నాయుడు, సభ్యులుగా దేవని, హరిప్రసాద్; వీ.కోట సింగల్ విండో చైర్మన్ గా నారాయణస్వామి సభ్యులుగా జయప్ప, మూర్తి; ముధురం దొడ్డి సింగల్ విండో చైర్మన్ గా హరినాథ్ రెడ్డి సభ్యులుగా రాధాకృష్ణ, చెన్నప్ప; గంగవరం సింగిల్ విండో చైర్మన్ గా ప్రసాద్ నాయుడు, సభ్యులుగా శివరామిరెడ్డి, హరిబాబు; పెద్దపంజాణి సింగిల్ విండో చైర్మన్ గా శ్రీరాములు సభ్యులుగా గంగప్ప, హరినాథ్ నియమితులయ్యారు. సోమల సింగల్ విండో చైర్మన్ గా శివశంకర్, సభ్యులుగా అశ్రఫ్ అలీ, సతీష్; చౌడేపల్లి సింగల్ విండో చైర్మన్ గా హరిప్రసాద్ సభ్యులుగా వెంకటమ్మ, సుబ్రహ్మణ్యం రాజు; చిత్తూరు సింగిల్ విండో చైర్మన్ గా బి ఎన్ రాజసింహులు అలియాస్ దొరబాబు సభ్యులుగా వెంకటేశ్వర నాయుడు, డి మోహన్; గుడిపాల సింగల్ విండో చైర్మన్ గా ప్రతాప్ నాయుడు సభ్యులుగా హరిప్రసాద్, సెల్వి నాదన్; యాదమరి సింగిల్ విండో చైర్మన్ గా చిత్ర సభ్యులుగా మహబూబ్ బాషా, ప్రభాకర్ నియమితులయ్యారు. ఐరాల సింగిల్ విండో చైర్మన్ గా పులిగుండ్ల చంద్రశేఖర్ నాయుడు సభ్యులుగా సూరినేని శ్రీనివాసులు, నాంపల్లి సుబ్రహ్మణ్యం; పూతలపట్టు సింగిల్ విండో చైర్మన్ గా జగన్నాథం సభ్యులుగా గుణశేఖర్ రెడ్డి, ఎల్ల వెంకటేశ్వర్లు నాయుడు; ఈసీ పల్లి సింగల్ విండో చైర్మన్ గా ఇంద్రసేన నాయుడు సభ్యులుగా పాటూరు సుబ్రహ్మణ్యం, కిషోర్; నగరి సింగల్ విండో చైర్మన్ గా బాలాజీ సభ్యులుగా జవహర్లాల్, వెంకటేశ్వర్లు; రామకుప్పం సింగల్ విండో చైర్మన్ గా మహమ్మద్ రఫీ సభ్యుడిగా జల్దిగారిని పల్లి సురేష్, అంజప్ప నియమితులయ్యారు. కుప్పం సింగల్ విండో అధ్యక్షుడిగా కృష్ణమూర్తి సభ్యులుగా కృష్ణవేణి, అన్నాదొరై; గుడిపల్లి సింగల్ విండో చైర్మన్ గా రమేష్ సభ్యులుగా వెంకటేశు, కృష్ణప్ప; శాంతిపురం సింగల్ విండో చైర్మన్ గా గోపాల్ సభ్యులుగా హరికుమార్, దామోదర; గంగాధర నెల్లూరు సింగిల్ విండో చైర్మన్ గా మోహన్ నాయుడు సభ్యులుగా ఇమ్మాన్యువల్, జ్యోతి యాదవ్ మందడి; చవటగుంట సింగిల్ విండో చైర్మన్ గా బైరెడ్డి సుధాకర్ రెడ్డి సభ్యులుగా రవి, మనోహర్ నియమితులయ్యారు. పలమనేరు సింగిల్ విండో చైర్మన్ గా వెంకటరమణ సభ్యులుగా పాపిరెడ్డి, రమేష్; రొంపిచర్ల సింగిల్ విండో చైర్మన్ గా రఘునాథరెడ్డి సభ్యులుగా శివారెడ్డి, సురేంద్ర; కోసల నగరం సింగల్ విండో చైర్మన్ గా మందటి బాబు యాదవ్ సభ్యులుగా వరదరాజులు, మురళి; అగరం రామకృష్ణ సింగల్ విండో చైర్మన్ గా వీర రాఘవులు సభ్యులుగా రవి నాయుడు, వెంకటేశ్వరరావు; నిండ్ర సింగిల్ విండో చైర్మన్ గా వెంకటేశ్వరరావు సభ్యులుగా పెరుమాళ్ రెడ్డి, శివలింగం నియమితులయ్యారు. అయ్యప్ప గారి పల్లి సింగల్ విండో చైర్మన్ గా వెంకట మునిరెడ్డి సభ్యులుగా భాస్కర్, వెంకట్రామయ్య; బైరెడ్డిపల్లి సింగల్ విండో చైర్మన్ గా నాగరాజ నాయుడు సభ్యులుగా దివాకర్ రెడ్డి, విశ్వనాథ్; పుంగనూరు సింగల్ విండో చైర్మన్ గా పగడాల రమణ సభ్యులుగా కోలాట వెంకటరమణ, సునీల్ కుమార్ రెడ్డి; సదం సింగల్ విండో చైర్మన్ గా సునీల్ కుమార్ రెడ్డి సభ్యులుగా నాగరాజ, కృష్ణయ్య; పులిచెర్ల సింగల్ విండో చైర్మన్ గా ధనుంజయ నాయుడు సభ్యులుగా విజయ్ కుమార్, గుర్రప్ప నియమితులయ్యారు. అరగొండ సింగల్ విండో చైర్మన్ గా రంజిత్ రెడ్డి సభ్యులుగా విజయకుమార్, వెంకటేశ్వర్లు; తవణంపల్లి సింగల్ విండో చైర్మన్ గా అమరేంద్ర నాయుడు సభ్యులుగా మునీంద్ర, భూపతి నాయుడులు నియమితులయ్యారు.

