14, ఆగస్టు 2025, గురువారం

జిల్లాలో 4,966 పింఛన్ల రద్దు

1,395 మందికి కేటగిరి మార్పు
వైద్య పరీక్షలకు 12,953 మంది డుమ్మా
 37,277 పింఛన్లలో 18,429 మాత్రమే సక్రమం 
మిగిలిన 18,429 మంది అక్రమార్కులే

చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ.

జిల్లాలో  ప్రభుత్వం అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో 4,966 పింఛన్లను రద్దుచేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మరో 1,395 పింఛన్లను అనర్హులు గుర్తించి వారికి కేటగిరి మార్పు చేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య పరీక్షలకు 12,953 మంది డుమ్మా కొట్టారు. వీరికి కూడా పింఛన్లను నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో ఇప్పటివరకు 37,277 పింఛన్లను పరిశీలన చేయగా ఇందులో 18,429 మాత్రమే సక్రమంగా ఉన్నట్లు నిర్ధారించింది. మిగిలిన 18,429 మంది అక్రమార్కులుగా తేల్చింది. అర్హులకు మాత్రమే  యధావిధిగా పింఛన్లను కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. 

 నడవలేక మంచానికే పరిమితమైన వ్యక్తులు చిత్తూరు జిల్లాలో 1,936 మంది గత ప్రభుత్వంలో నెలకు పదిహేను వేల రూపాయల వంతున పింఛన్లను తీసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పింఛన్లను పునః పరిశీలించాలని నిర్ణయించింది. ఇందుకు డాక్టర్ల బృందాలను ఏర్పాటు చేసి, ఇంటింటికి వెళ్లి పింఛన్ లబ్ధిదారులను పరీక్ష చేశారు. ఈ డాక్టర్ల బృందం మొత్తం 1,911 మంది రోగుల ఇండ్లకు వెళ్లి వారిని పరిశీలించారు. వారిలో 11 మంది మృతి చెందారు. 783 మంది సాధారణ వికలాంగులుగా భావించి వారి పింఛను 15 వేల రూపాయల నుంచి 6 వేల రూపాయలకు మార్పు చేశారు. మరో 70 మందిని అనర్హులుగా నిర్ధారించారు. అయితే వారికి 60 సంవత్సరాల వయసు నిండిన కారణంగా వారికి 4 వేల రూపాయల వృద్ధాప్య పింఛనుగా మార్పు చేశారు. వైద్యాధికారుల పరీక్షలకు 14 మంది హాజరు కాలేదు. మొత్తం మీద జిల్లాలో 15 వేల రూపాయల పింఛన్లకు 824 మంది మాత్రమే అర్హులని తేల్చారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నెలకు పదిహేను వేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న 234 మందికి ఈ పింఛన్లను రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

అలాగే వికలాంగుల కోటా కింద నెలకు 6000 రూపాయలు పింఛన్ తీసుకుంటున్న వారిలో  4,732 మంది పింఛన్లను రద్దుచేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికలాంగుల కింద నెలకు 6000 రూపాయలు వంతున పెన్షన్లు తీసుకుంటున్న లబ్ధిదారులు చిత్తూరు జిల్లాలో 35,277 మంది ఉన్నారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం పిలువగా 22,338 మాత్రం హాజరయ్యారు. మిగిలిన 12,939 మంది ఈ పరీక్షలకు హాజరు కాలేదు. దీంట్లో 4,732 మంది 6000 రూపాయల పింఛన్లకు అనర్హులుగా వైద్యాధికారులు నివేదిక అందజేయడంతో ప్రభుత్వం వారి పింఛన్లను రద్దు చేసింది. అలాగే వైద్య పరీక్షలకు హాజరు కాని 12,939 మంది పింఛన్లను హోల్డ్ లో పెట్టింది. ఇందులో 17064 మంది మాత్రమే అర్హులుగా నిర్ణయించారు. వికలాంగులు కాకుండా ఆరువేల రూపాయలు పింఛన్ తీసుకుంటున్న 542 మందికి 60 సంవత్సరాల వయసు వయస్సు నిండడంతో వారిని పింఛన్ల వృద్ధాప్య పింఛన్ కింద మార్పు చేసి నెలకు 4 వేల రూపాయలను అందజేయనున్నారు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *