12, ఆగస్టు 2025, మంగళవారం

ఆడుదాం ఆంధ్ర కేసులో రోజా అరెస్టు తప్పదా ?

రోజా సోదరుని పాత్ర మీద కూడా అధరాలు 

రూ. 40 కోట్లకు పైగా నిధుల దుర్వినియోగం

నాసిరకం అట వస్తువుల కొనుగోలు 

ప్రభుత్వం మారగానే కంపూటర్ల నుండి పద్దుల డిలిట్

(ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.) 

మాజీ మంత్రి, వైసిపి అధికార ప్రతినిధి ఆర్ కె రోజా ఆడుదాం ఆంధ్ర వ్యవహారంలో అరెస్టు కాక తప్పదని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి రోజాకు జైలు తప్పదని కూటమి నేతలు హెచ్చరికలు చేస్తున్నారు. సోమవారం విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో రోజా పాత్ర గూర్చి పేర్కొన్నట్టు తెలిసింది. ఈ వ్యవహారంలో 40 కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు విజిలెన్స్ తేల్చినట్లు సమాచారం. నాసిరకం క్రీడా సామాగ్రిని కొనుగోలు చేశారని, గ్రామీణ క్రీడలకు  కొంత మొత్తం ఇచ్చి, మరి కొంత మొత్తాన్ని జేబులో వేసుకున్నారని అధికారులు గుర్తించారు. ప్రభుత్వం మారిన వెంటనే ఈ వ్యవహారానికి సంబంధించిన పద్దులను కంప్యూటర్లో నుంచి డిలీట్ చేసినట్లు కూడా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మిగింపు ఉత్సవం పేరుతో కూడా భారీగా నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించారు. దీనితో త్వరలో రోజా అరెస్టు తప్పదని టిడిపి వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది.

వైసిపి పాలనలో చోటు చేసుకున్న అవినీతి పైన కూటమి ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేయించింది. ఆడుదాం ఆంధ్ర అవినీతి పైన విచారణ చేసిన విజిలెన్స్ అధికారాలు ప్రభుత్వానికి సోమవార నివేదిక సమర్పించారు. ఇందులో మాజీ మంత్రి రోజా, అమె సోదరుడితో పాటుగా బైరెడ్డి సిద్ధార్ద్ రెడ్డి పాత్ర పైన ఆరోపణలు ఉన్నాయి.  'ఆడుదాం ఆంధ్రా'లో రూ.40 కోట్ల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిసింది. అప్పటి ప్రభుత్వం  'ఆడుదాం ఆంధ్రా'కు రూ.125 కోట్లు కేటాయించింది. క్రీడా పోటీల కోసం కొన్ని జిల్లాల్లో కలెక్టర్లు అదనపు నిధులు కేటాయించినట్లుగా విజిలెన్స్ నివేదిక తేల్చినట్లు సమాచారం. అదే విధంగా విజేతలుగా వైసిపి కార్యకర్తలనే ఎంపిక చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. కేవలం 47 రోజుల్లోనే భారీ మొత్తంలో ఖర్చు చేసినట్లుగా విచారణలో ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. పార్టీ ప్రచారం కోసం  క్రీడా సామగ్రిపై వైసిపి స్టిక్కర్లు అంటించినట్టు తేలింది. క్రీడాకారులకు నాసిరకం కిట్లు సరఫరా చేసినట్లు విజిలెన్స్ గుర్తించినట్లు సమాచారం. అధికారం పోగానే  వివరాలను కంప్యూటర్లో డిలీట్ చేసినట్లు గుర్తించారు. మొత్తం రూ.40 కోట్ల మేరకు నిధులు దుర్వినియోగం అయినట్లు నిర్ధారించినట్లు తెలిసింది. విజిలెన్స్‌ విచారణలో కీలకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. గ్రామస్థాయిలో క్రీడలకు రూ.10 వేలు కేటాయించి, మరో రూ. 10 వేలు జేబులో వేసుకున్నారని గుర్తించారు. అయితే ఖర్చు రూ. 20 వేలు చూపించినట్లు ఫిర్యాదులు ఉన్నాయి. 2023 డిసెంబర్‌ నెలలో ప్రారంభమైన 'ఆడుదాం ఆంధ్రా' ద్వారా ఎన్నికల పబ్లిసిటీ కోసం ఆయా వస్తువులపై జగన్‌ స్టికర్లను భారీగా అంటించారని అధికారులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే వివరాలను డిలీట్‌ చేశారని విజిలెన్స్‌ తన నివేదికలో తెలిపినట్టు తెలిసింది. కాగా, ఈ అవినీతి సాగిన కాలంలో కీలకంగా వ్యవహరించిన అప్పటి మంత్రి రోజా, ఆమె సోదరుడితో పాటుగా శాప్ మాజీ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్ద్ రెడ్డి పాత్ర పైన ఫిర్యాదులు రావటంతో విజిలెన్స్ లోతుగా విచారణ చేసింది. పలు కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. తమ నివేదికలో వారి పాత్రనూ విజిలెన్స్‌ అధికారులు తమ నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. మరో వైపు క్రీడా పరికరాల నాణ్యతపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక మిగిలిపోయిన క్రీడా కిట్లు ఏమయ్యాయనేదానిపై విచారణ జరుగుతంది.  ఒక ఆటలో ఆడిన కిడ్స్ మరో ఆటకే పనికిరాకుండా పోయాయని కొందరు ఆటగాళ్లు అధికారులు దృష్టికి తీసుకుని వెళ్లారు. పరికరాల కొనుగోలు, ముగింపు ఉత్సవాల పేరుతో భారీగా ఒకదాకలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి  ఇక రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహించి, విజేతలకు నగదు బహుమతులు, క్రీడా పరికరాలు, టీ షర్టులు పంపిణీ చేసింది అప్పటి ప్రభుత్వం. ఇక విశాఖపట్నంలో జరిగిన ముగింపు ఉత్సవం కోసం దాదాపు 2.7 కోట్లు, క్రీడా పరికరాల కొనుగోలుకు 37.5 కోట్లు, పోటీల నిర్వహణకు 14.99 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. కాగా ప్రస్తుతం విజిలెన్స్ దర్యాప్తులో మాత్రం.. దాదాపు రూ. 40 కోట్లకు పైగా నగదు దుర్వినియోగం అయినట్లు గుర్తించారు. దీంతో నివేదిక ఆధారంగా ఈ ఇద్దరి నేతలు  క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త అధికారులు, మంత్రులు బాధ్యతలు తీసుకునే లోపలే గత ప్రభుత్వపు అధికారులు ఇందుకు సంబంధించిన వివరాలను డిలీట్‌ చేశారని విజిలెన్స్‌ తన నివేదికలో తెలిపినట్టు సమాచారం. దీంతో వైసీపీ మాజీ మంత్రి ఆర్‌కే రోజా అరెస్ట్‌ దాదాపు ఖాయం అన్న ఊహాగానాలు రాజకీయ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. కాగా ప్రస్తుతం వీరి పైన ఎలాంటి చర్యలు ఉంటాయనేది రాజకీయంగా ఉత్కంఠ పెంచుతోంది. ఇక కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే.. ఆడుదాం ఆంధ్ర ఆటగాళ్ల కు బేడీలు పడక తప్పదు. ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదిక అందిన తర్వాత.. మాజీ మంత్రి రోజా, శాప్ మాజీ చైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్‌ రెడ్డితో పాటు మరికొందరు అధికారులపై కేసులు నమోదు కావచ్చని.. అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఊహాగానాలు ఊపందుకున్నాయ్‌. ఆడుదాం ఆంధ్రా కార్యక్రమం క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే లక్ష్యంతో మొదలైనా.. అవినీతి ఆరోపణలతో వివాదాస్పదంగా మారింది. ఇక అటు విజిలెన్స్ విచారణ ముగియడంతో.. కొందరు అధికారుల్లో ఆందోళన మొదలైందనే ప్రచారం జరుగుతోంది. లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలోనూ అదే జరగబోతుందా అనే టెన్షన్ కొందరిలో కనిపిస్తోంది. ఏమైనా విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటే… ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారే అవకాశం ఉంది.

 



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *