ఈ వారంలోనే పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాలకు నీళ్లు
రూ.3,890 కోట్లతో హంద్రీనీవా సుజల స్రవంతి పనులు
వంద రోజుల్లో కలువ విస్తరణ పనులు పూర్తి
3850 క్యూసెక్కులకు పెరిగిన కాలువ ప్రవాహ సామర్ధ్యం
జీడిపల్లి రిజర్వాయర్ నుండి చిత్తూరుకు తాగు, సాగు నీరు
ఆంధ్రప్రభ బ్యూరో, చిత్తూరు.
కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టు మొదటి, రెండో దశల కింద కూటమి ప్రభుత్వం రూ.3,890 కోట్లు వెచ్చిస్తోంది. వంద రోజుల్లో రూ.696 కోట్లతో చేపట్టిన ఈ కాలువ విస్తరణ పనుల లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ విస్తరణ పనులతో హంద్రీనీవా ఫేజ్ 1 కాలువ ప్రవాహ సామర్ధ్యం 3850 క్యూసెక్కులకు పెరిగింది. ప్రస్తుతం ఫేజ్ 1 కాలువ విస్తరణ పనులతో అదనంగా 1600 క్యూసెక్కుల మేర నీటిని తరలించేందుకు అవకాశం కలిగింది. దీంతో జీడిపల్లి రిజర్వాయర్‌ను పూర్తి సామర్ధ్యంతో నీటిని నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. తద్వారా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఆయకట్టుకు సాగునీరు, 33 లక్షల మంది ప్రజలకు దాహార్తిని తీర్చేలా కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ వారంలోనే హంద్రీనీవా రెండవ దశ కింద పుంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ కు నీళ్లు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది.
మల్యాల నుంచి జీడిపల్లి వరకూ 216 కిలోమీటర్ల మేర హంద్రీనీవా కాలువ విస్తరణ పనులు పూర్తి కావటంతో జీడిపల్లి, కృష్ణగిరి, పత్తికొండ, గాజులదిన్నె సహా స్థానికంగా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను కూడా నీటితో నింపనున్నారు. దీంతో సీమ జిల్లాల్లో భూగర్భజలాలు గణనీయంగా పెరిగేందుకు ఆస్కారం కలిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు శరవేగంగా హంద్రీనీవా కాలువ ఫేజ్ 1 విస్తరణ పనుల్ని జలవనరుల శాఖ పూర్తి చేసింది. నెలకు దాదాపు 4.27 టీఎంసీల చొప్పున నాలుగు నెలల వరద కాలంలో అదనంగా 17.10 టీఎంసీల నీటిని తీసుకునేందుకు అవకాశం ఈ విస్తరణ పనుల ద్వారా కలిగింది. దీంతో హెచ్ఎన్ఎస్ఎస్ ప్రాజెక్టుకు కేటాయించిన 40 టీఎంసీల నీరు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల తాగు, సాగునీటి కష్టాల్ని తీర్చనున్నాయి. హెచ్ఎన్ఎస్ఎస్ ఫేజ్ 1 ద్వారా నంద్యాల జిల్లాలో 2906 ఎకరాలు, కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, అనంతపురం జిల్లాలో 1,18,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందనుంది. ఫేజ్ 2 ప్రాజెక్టులో భాగంగా అనంతపురం జిల్లాలో మరో 2.27 లక్షల ఎకరాలు, కడప జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరు జిల్లాలో 1.40 లక్షల ఎకరాల మేర ఆయకట్టుకు నీరు అందనుంది. మొత్తంగా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా 6 లక్షల పైచిలుకు ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి తాగునీరు అందనుంది. 2025 ఏప్రిల్ లో మొదలైన విస్తరణ పనులు కేవలం వంద రోజుల్లో పూర్తి అయ్యాయి. తదుపరి ఫేజ్- 2 పనుల్ని కూడా ఈ నెలాఖరుకు పూర్తి చేసి పుంగనూరు, కుప్పంలోని చివరి ఆయకట్టుకూ నీళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మొత్తం రూ.3,890 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోంది.
టెండర్లకే పరిమితమైన వైసిపి
హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కుల విస్తరణకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలో ఎక్కువ కృష్ణా వరద జలాలు సీమ జిల్లాలకు మళ్లిస్తామంటూ మాయమాటలతో మభ్యపెట్టారు. అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గంపెడు మట్టి తీయకుండానే రైతులను మాయ చేశారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ విస్తరణ పనులకు మోక్షం వచ్చింది. 120 రోజుల్లో 3,850 క్యూసెక్కులకు విస్తరణ పనులు 90 శాతానికి పైగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు విడుదల చేసిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అడుగు ముందుకేశారు. గత ప్రభుత్వంలో టెండర్లతో ఆపేసిన 6,300 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరణ పనులు కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ శుక్రవారం జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం శ్రీశైలం ఎగునవ 40 టీఎంసీలు ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలన్నది పాలకుల లక్ష్యం. తొలి దశ (ఫేజ్-1)లో మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి.మీలు ప్రధాన కాలువ, 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. హైడ్రాలికల్ గణాంకాల ప్రకారం 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా మెయిన్ కెనాల్ బెడ్ విడ్త్ (కాలువ అడుగు భాగం వెడల్పు) 9.5 మీటర్లు నిర్మించారు. లైనింగ్ చేస్తే 12 పంపుల ద్వారా 3,850 క్యూసెక్కులు (ఒక్కో పంపు 330 క్యూసెక్కులు) లిఫ్ట్ చేసేలా డిజైన్ చేస్తే, 5-6 పంపుల ద్వారా 1,940 క్యూసెక్కులకు మించి ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి రూ.1,030 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం పనులు ఆపేసింది. 6,300 క్యూసెక్కులకు విస్తరిస్తాం.. అంటూ ఆర్భాటం చేసి రూ.6,182.19 కోట్లతో టెండర్లు పిలిచారు. గంపెడు మట్టి కూడా తీయకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. పైగా అసంపూర్తిగా ఉన్న పత్తికొండ (పందికోన) రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు, పంట కాలువలు పూర్తి చేస్తే 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా పైసా ఇవ్వలేదు.
నాటి టెండర్లు కొనసాగించేలా ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ హంద్రీనీవా కాలువ విస్తరణ పనులపై దృష్టి పెట్టింది. మల్యాల వద్ద నుంచి 400.50 కి.మీలు కుప్పం వరకు ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచి కెనాల్స్ లైనింగ్‌కు రూ.1,970 కోట్లతో శ్రీకారం చుట్టారు. 120 రోజుల్లో 1.75 కోట్లు క్యూబిక్ మీటర్లు మట్టి పనులు, 45 లక్షల స్క్వేయర్ మీటర్లు సీసీ లైనింగ్, షాట్‌క్రెటింగ్ పనులు పూర్తి చేసి ఇంజనీరింగ్ చరిత్రలో రికార్డు నెలకొల్పారు. అయితే సీమ జిల్లాల్లో 60 టీఎంసీల నీటి అవసరాలు ఉండడంతో, గత ప్రభుత్వం హయాంలో 6,300 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా టెండర్లు పూర్తి చేసిన విస్తరణ పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ అప్రోచ్ ఛానల్ 4.806 కిలోమీటర్లు, 0/00 నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు 216.300 కి.మీల వరకు ప్రధాన కాలువ విస్తరణ, 8 పంపింగ్ స్టేషన్ల దగ్గర అదనంగా 2,450 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు అదనపు పంపులు ఏర్పాటుకు రూ.6,182.19 కోట్ల మంజూరు చేస్తూ 2021 సెప్టెంబరు 15న అప్పటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అనుమతులు ఇచ్చింది. ప్యాకేజీ-1 కింద రూ.3,278.18 కోట్లతో చేపట్టిన అప్రోచ్ ఛానల్ 4.806 కి.మీలు, 0 నుంచి 88.000 కి.మీల వరకు కాలువ విస్తరణ, పిఎస్ -1 నుంచి 5 వరకు పంపింగ్ స్టేషన్ల దగ్గర అదనపు పంపులు ఏర్పాటు పనులు రూ.2,484 కోట్లకు చేస్తామని హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది. ప్యాకేజీ-2 కింద రూ.2,904.01 కోట్లతో చేపట్టే 88.000 కి.మీల నుంచి 216.300 కి.మీల వరకు ప్రధాన కాలువ విస్తరణ, పీఎస్-6 నుంచి 8 (3 లిప్టులు) వద్ద అదనపు పంపులు ఏర్పాటు పనులు రూ.2,163.15 కోట్లకు చేస్తామని హైదరాబాదుకు చెందిన డీఎస్‌ఆర్ - వీపీఆర్ జాయింట్ వెంచర్‌గా పనులు దక్కించుకుని 2021 డిసెంబరు 31న ఒప్పందం చేసుకున్నారు. ఏమాత్రం పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని రద్దు చేసింది. అయితే రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటికి 60 టీఎంసీలకు పైగా అవసరాలు ఉండడంతో ఈ పనులు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రాజెక్టుల వివరాలు (రూ.కోట్లల్లో)
ప్రాజెక్టు నిధులు కాంట్రాక్ట్ సంస్థ
గోరుకల్లు (జీబీఆర్) వద్ద 36.90 ఆర్‌ఆర్ ఎడిఫీసే
అదనపు రెగ్యూలేటర్ ప్రైవేట్ లిమిటెడ్
శ్రీశైలం ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్లు 1.59 ఎస్‌వీ
ప్రత్యేక మరమ్మతులు ఇంజనీరింగ్ సంస్థ
శ్రీశైలం డ్యాం వద్ద 1,000 1.00 ఆర్. పాండురంగం ్థ
కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫారం అండ్ సన్స్ సంస
టీజీపీ సర్కిల్, ఎస్‌ఆర్‌బీసీ 5.25 కాంట్రాక్టర్
సర్కిల్ కార్యాలయ భవనాలు కానాల గోపాల్‌రెడ్డి
వేదావతి ఎత్తిపోతల 1,942.80 మెఘా ఇంజనీరింగ్
పథకం ప్రాజెక్టు అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్
ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు 1,985.42 ఎస్‌సీసీ లిమిటెడ్ సంస్థ
రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,825 ఎస్‌పీఎంఎల్-ఎన్‌సీసీ-మెఘా
ఇంజనీరింగ్ అండ్
ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్
మొత్తం 7,797.96
నంద్యాల జిల్లాలోని పంపింగ్ స్టేషన్-1 నుంచి హంద్రీనీవా సుజల స్రవంతి (హెచ్ఎన్ఎస్ఎస్) కాలువలోకి గురువారం సీఎం చంద్రబాబు కృష్ణా జలాలను విడుదల చేశారు. నీటి విడుదల అనంతరం… ముఖ్యమంత్రి హంద్రీనీవా జలాలకు పూజలు చేశారు.
హెచ్ఎన్ఎస్ఎస్ పంపింగ్ స్టేషన్-1 ద్వారా హంద్రీనీవా సుజల స్రవంతి కాలువలోకి కృష్ణా జలాలను విడుదల చేశారు. రూ.696 కోట్లతో చేపట్టిన హంద్రీనీవా ఫేజ్-1 కాలువ పనులు పూర్తికావడంలో నీటి విడుదల కీలక మైలురాయిగా నిలిచింది. కాలువ వెడల్పుతో ప్రవాహ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరిగినట్లు అధికారులు తెలిపారు.

