18, ఆగస్టు 2025, సోమవారం

ప్రత్యామ్నాయ పంటకు విత్తనం కొరత

అదును పోతున్నా, సరఫరా కాని ఉలవలు 

నిస్సహాయ స్థితిలో జిల్లా యంత్రాంగం 


(చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ)

వర్షాభవ పరిస్థితుల కారణంగా చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ పంటల విస్తీర్ణం గణనయంగా తగ్గింది. జిల్లాలో 8 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. ప్రస్తుత జిల్లాలో వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలకు ఉలవలను ప్రత్యామ్నాయ పంటగా వేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదించారు. ఉలవలు కూడా ఆగస్టు 31వ తేదీ లోపు వేయాలని, అలా వేస్తేనే పంట చేతికి వస్తుందని  పేర్కొన్నారు. ఇందుకు 4,843 క్వింటాళ్ల ఉలవలు విత్తనంగా కావాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలో పొందుపరిచారు. ఈ విత్తనముతో 19,446 హెక్టార్లలో సాగు చేయవచ్చని పేర్కొన్నారు. ఉలవల్ల సాగు కూడా జూలై మొదటి వారం నుంచి ఆగస్టు నెలాఖరు వరకు చేపట్టాలని ఈ ప్రత్యామ్నాయ ప్రణాళికలు పేర్కొన్నారు. అయితే ఇప్పటివరకు ఒక క్వింటాలు కూడా చిత్తూరు జిల్లాకు చేరలేదు. ప్రత్యామ్నాయ పంటలుగా ఏమి సాగు చేయాలో జిల్లాలోని రైతులకు దిక్కుతోచడం లేదు.


 చిత్తూరు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ కు 71,305 హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగు కావలసి ఉన్నాయి. అయితే ఇప్పటివరకు వర్షాభావ పరిస్థితుల్లో కారణంగా 6,432 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. జిల్లాలో వరి 11,204 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు  821 హెక్టార్లలో మాత్రమే సాగయింది. అలాగే వేరుశనగ 35,238 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా, ఇప్పటివరకు 1,475 హెక్టార్లలో మాత్రమే సాగయింది. రాగులు 2,369 హెక్టార్లకు కాను 28 హెక్టార్లలో మాత్రమే సాగయింది. ఇతర పప్పు ధాన్యాలు 3,726 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 306  హెక్టార్లలో మాత్రమే సాగయింది. అలాగే కందులు 2,565 హెక్టార్లకి కాను 52 హెక్టార్లలో, పెసలు 113 హెక్టార్లకు కాను రెండు హెక్టార్లలో, ఉద్ధులు 100 హెక్టార్లకు మూడు హెక్టార్లలో, ఉలవలు 1,693 హెక్టార్లకు గాను ఒక హెక్టరలో, అనుములు 532 హెక్టార్లకు గాను ఒక హెక్టారు సాగయింది. మొత్తం మీద పప్పు ధాన్యాలు 5,467 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 65 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఆహార ధాన్యాలు మొత్తం మీద 20,397 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1,192 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో మేజర్ గా వేరుశనగ పంటను జిల్లా రైతులు వర్షాధారంగా వేస్తారు. జిల్లాలో వేరుశెనగ పంట 35,238 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1,475 హెక్టార్లలో మాత్రమే సాగయింది. మొత్తం మీద వంట నూనెలకు సంబంధించిన పంటలు 35,246 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 1476 హెక్టార్లలో మాత్రమే సాగయ్యాయి. జిల్లాలో మొత్తం ఖరీఫ్ పంటలు 63,147 హెక్టార్లలో సాగు కావలసి ఉండగా ఇప్పటివరకు 4,918 హెక్టార్లలో సాగయింది. జిల్లాలో పశుగ్రాసం మాత్రం ఆ 11, 573 యాక్టర్లలో సాగయింది. మొత్తం మీద ఖరీఫ్ సీజన్లో 7.8 శాతం పంటలు మాత్రమే సాగు అయ్యాయి. మిగిలిన భూములు బీడు భూములుగా మిగిలాయి. దీంతో వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను రూపొందించారు. జిల్లాలో ఉలవలు మాత్రమే ప్రత్యామ్నాయ పంటగా వేయడానికి అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు. ఉలవలు సరఫరా చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు జిల్లాకు ఒక క్వింటాల్  ఉలవలను కూడా సరఫరా చేయలేదు. అయితే చిత్తూరు జిల్లాకు తొలి విడతగా 1,720 క్వింటాళ్ల ఉలవలను కేటాయించినట్లు పేర్కొన్నారు. మార్కెట్లో ఉలవలు కిలో ధర 56 రూపాయలు కాగా, రాయితీ మీద రైతులకు 28 రూపాయలకు అంటే 50 శాతానికి రాయితీతో అందజేస్తామని తెలిపారు. ఈ వర్షాలు మరో రెండు మూడు రోజులు కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు పూర్తయిన తర్వాత ఉలవ విత్తనాలు జిల్లాకు చేరినా, పెద్దగా ఉపయోగము ఉండదు. వాటిని నాయకుల, అధికారులు వంట ఇంట్లో ఉపయోగించుకోవడం తప్ప, విత్తేఅవకాశము లేదు. ఒకవేళ విత్తినా, సకాలంలో వర్షాలు పడి పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాకు  ఉలవ విత్తనాలు సరఫరా కాకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల నినాదాన్ని వ్యవసాయ శాఖ అధికారులు పక్కన పెట్టారు. ఉలవలు వచ్చిన తర్వాత రైతులకు రైతు భరోసా కేంద్రం ద్వారా సరఫరా చేద్దామని ఊరుకున్నారు. వ్యవసాయ శాఖ వైఖరి కారణంగా చిత్తూరు జిల్లాలోని రైతులు రెండిటికీ చెడ్డ రేవడిలా తయారయ్యారు. ఖరీఫ్ సీజన్లో వేరుశనగ విత్తనం వేసే సమయము గడిచిన తర్వాత చిత్తూరు జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఏం చేయాలో రైతులకు దిక్కుతోచడం లేదు. సాధారణంగా ఖరీఫ్ సీజన్ జూన్ నెలతో ప్రారంభమవుతుంది. చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ఎక్కువగా వేరుశనగ పంటను సాగు చేస్తారు. ఈ పంట పూర్తిగా వర్షాధారంగా పండిస్తారు. ఇప్పటికే జిల్లాలో వేరుశనగ విత్తి, పూత దశలో ఉండాలి. అయితే వర్షాలు లేని కారణంగా జిల్లాలో వేరుశనగ పంట సాగు కాలేదు. మిగిలిన ఖరీఫ్ పంటలు కూడా అంతంత మాత్రమే. అదును పోయిన తర్వాత  పడుతున్న ఈ వర్షాలు వల్ల ఉపయోగంలేదని వ్యవసాయ శాఖ అధికారులు సైతం చెబుతున్నారు. రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రయత్నం చేద్దామని రైతులు భావించారు.  ఇప్పుడు వర్షాలు పడుతున్న వేయడానికి విత్తనాలు లేవు. సత్వరం ఉలవ విత్తనాలను తెప్పించి రైతులకు సరఫరా చేయాల్సిందిగా కోరుతున్నారు.






 సీజన్ కూడా రైతులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మామిడికి గిట్టుబాటు ధర లభించక, సకాలంలో మామిడికాయలు కోయలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఖరీఫ్ సీజన్ అయినా బాగుంటుందని రైతులు ఆశాభావంతో ఉన్నారు. అయితే ఖరీఫ్ సీజన్లో జిల్లాలో పడాల్సిన వర్షాలు పడలేదు. దీంతో జిల్లాలో పంటలు సాగు కాలేదు. పంటలు సాగుకాక రైతన్న తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.



అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *