9, సెప్టెంబర్ 2024, సోమవారం

రాజకీయంగా క్రియాశీలకం అవుతున్నా రోజా

కూటమి ప్రభుత్వం మీద విమర్శలతో దాడి

పార్టీ నేతలు కార్యకర్తలలో ఆత్మవిశ్వాసం 

 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

రాజకీయంగా మాజీ మంత్రి, నగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే రోజా మళ్లీ క్రియాశీలకమవుతున్నారు. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న రోజా మళ్లీ అధికార పక్షం మీద విమర్శలను ఎక్కుపెట్టారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లు సూపర్ సిక్స్ పథకాలను కోటమి ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని రోజా నిలదీస్తున్నారు. అలాగే వరదల విషయంలో కూడా ప్రభుత్వం విఫలమైందని, భారీ వర్షాలను ముందుగా ఊహించి ప్రజలని అప్రమత్తం చేయలేదని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని విమర్శిస్తున్నారు. మంత్రులు అధికారులు షో చేస్తున్నారని, వాస్తవంగా వరద బాధితులకు సహాయం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా రోజా రాజకీయంగా ఆక్టివ్ కావడంతో ఆ పార్టీ నాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు చిత్తూరు జిల్లాలో వైసీపీ తరఫున ప్రభుత్వం మీద ఎవరు విమర్శలు గుప్పించడం లేదు. రోజా తన విమర్శలకు పదును పెట్టడంతో వైసిపికి మళ్లీ మంచి రోజులు వస్తాయని నాయకులు కార్యకర్తలు ఆశిస్తున్నాను. 


సినీ పరిశ్రమలో విజయవంతమైన హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రోజా రాజకీయాల్లో కూడా విజయవంతమయ్యారు. తొలుత  తెలుగుదేశం పార్టీ తరఫున రాజకీయ ఆరంగ్రేటం చేశారు. తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేశారు. ఒకసారి నగిరి నియోజవర్గం నుంచి, మరోసారి చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిని చెవిచూశారు. దీంతో తెలుగుదేశం పార్టీ మీద అసంతృప్తితో  కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించారు. వైసిపి తరఫున నగరి నియోజకవర్గం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షాన్ని తన పదునైన మాటలతో ఇరుకున పెడుతూ వైసీపీకి స్టార్ క్యాంపైనర్  పని చేశారు. ఇందుకు మెచ్చిన జగన్ తో ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ఇచ్చారు. అనంతరం ఆమెకు మంత్రి పదవి ఇచ్చి సత్కరించారు. ఆమెకు మంత్రి పదవి రాకుండా జిల్లాకు చెందిన కొందరు శాసనసభ్యులు అడ్డుపడినా, పట్టుబట్టి మరీ సాధించారు. ఎన్నికలలో నగిరి టికెట్ రాకుండా వైసిపికి చెందిన పలువురు నాయకులు అడ్డుపడ్డారు. సొంత నియోజకవర్గంలోని వైసిపి నేతలు తిరుగుబాటుబావట ఎగురవేశారు. జిల్లాకు చెందిన ఒక ముఖ్య నేత కూడా రోజాకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారు. అయినా, రోజా తనకు ఉన్న పలుకుబడిన ఉపయోగించి తిరిగి నగరి టిక్కెట్లు సాధించారు. ఒక దశలో రోజాను శ్రీకాళహస్తికి పంపుతారన్న ప్రచారం కూడా జరిగింది. అయితే ఎన్నికలలో సొంత పార్టీ నాయకులు వెన్నుపోటు పొడవడం, కూటమి గాలిలో భారీ తేడాతో రోజా ఓటమిపాలయ్యారు. తర్వాత కూటమి ప్రభుత్వం రావడంతోకొంత కాలం పాటు రోజా రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నివాసాన్ని చెన్నైకి మార్చిన ఆమె, తరచుగా నగరికి వస్తూ కార్యకర్తలు, నాయకుల శుభకార్యాలలో పాల్గొంటూ వచ్చారు. ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఒక దశలో రోజా వైసిపికి పార్టీకి గుడ్ బై చెబుతుందని కూడా ప్రచారం జరిగింది. మరికొందరు తమిళనాడులో విజయ్ కొత్తగా స్థాపించిన పార్టీలో చేరుతుందని కూడా ప్రచారం చేశారు. రోజాను కట్టడి చేయడానికి తెలుగుదేశం పార్టీ కూడా తనదైన శైలిలో పావులు కదిపింది. ఆటాడుదాం ఆంధ్రాలో భారీ ఎత్తున నిధులు దుర్వినియోగమయ్యాయని ఆమె మీద సిఐడి కేసులు నమోదు చేసింది. తిరుమల దర్శనాలలో భారీగా అవినీతి జరిగిందని విచారణ కూడా ప్రారంభమైంది. ఇవి ఏవి లెక్కచేయకుండా ఇటీవల తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న రోజా, స్వామి వారి ఆశీస్సులతో తిరిగి రాజకీయ విమర్శలకు శ్రీకారం చుట్టారు. అక్కడే కూటమి ప్రభుత్వం మీద విమర్శలు సందించారు. ప్రస్తుతం ఎక్కడికి వెళ్ళినా కూటమి ప్రభుత్వ విధానాలను ఎండగడుగుతున్నారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్న విధంగా రోజా తిరిగి వైసీపీలోనే క్రియాశీలకమయ్యారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *