14, సెప్టెంబర్ 2024, శనివారం

చిత్తూరు జిల్లాలో ఘోర విషాదం

8 మంది మృతి

30 మందికి గాయాలు

మృతులు పెరిగే అవకాశం


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు/ బంగారుపాళ్యం 


చిత్తూరు పలమనేరు రోడ్డులోని మొగిలి ఘాటు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది మృతి చెందారు. 30 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను చిత్తూరు, పలమనేరు, బంగారు పాళ్యం ఆసుపత్రులకు తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. బంగారుపాలెం మండలం పరిధిలోని మొగలి ఘాట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. 


తిరుపతి నుండి బెంగళూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు పలమనేరు నుండి తిరుపతి వైపు వస్తున్న కంటైనర్ అదుపుతప్పి డివైడర్ ను దాటి బస్సును టచ్ అవ్వడంతో బస్సు రివర్స్ లోనికి తిరిగింది.  అదే సమయంలో చిత్తూరు నుండి పలమనేరు వైపు వెళుతున్న లారీ బస్సులు ఢీకొట్టింది. ఇలా రెండు లారీల మధ్య బస్సు తీవ్ర ప్రమాదానికి గురైంది. రెండు లారీల మధ్య బస్సు ఇరుక్కోవడంతో బస్సులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.  ప్రమాదం కారణంగా  లారీలోని ట్రాలీ, కమ్మిలు పక్కకు ఎగిరిపడ్డాయి. విషయం తెలియగానే హుటాహుటిన సంఘటన స్థలానికి  పోలీసులు, స్థానికులు, 108 సిబ్బంది చేరుకున్నారు. వేగవంతంగా సహాయక చర్యలు బంగారుపాలెం, పలమనేరు, చిత్తూరు హాస్పిటల్ కు  క్షతగాత్రులను తరలించారు. ఇప్పటివరకు ఏడు మంది మృతి 30 మందికి పైగా గాయాలు అయినట్లుగా స్థానికుల సమాచారం. మృతులు పెరిగే సంఖ్య పెరిగే అవకాశం ఉందని  పోలీసులు పోలీసులు చెపుతున్నారు. ప్రమాద విషయం తెలియగానే జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణి కంఠ చందోలు, పూతలపట్టు ఏం ఎల్ ఏ మురళీమోహన్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. చిత్తూరు కలెక్టర్  సుమిత్ కుమార్, జిల్లా ఎస్పి  మణి కంఠ చందోలు ప్రమాద స్థలాన్ని స్వయంగా పరిశీలించారు.  ఎస్పి మాట్లాడుతూ.. ప్రమాదానికి గల కారణాలను సవివరంగా తెలుసుకోవాలని, రహదారులపై అనవసర రహదారి నిర్లక్ష్యాలు, ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వంటి అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకు  ఆదేశాలు జారీ చేశారు. రహదారి లో బలమైన ట్రాఫిక్ నియంత్రణ, ప్రమాదాలకు కారకమైన రహదారి లోపాలను సరిదిద్దడం, మరియు భారీ వాహనాల రాకపోకలను మరింత క్రమబద్ధం చేయడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 

 ఘోర బస్సు ప్రమాదంపై సిఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లా మొగ‌లి ఘాట్ వ‌ద్ద జరిగిన రోడ్డు ప్ర‌మాదంలో 8 గురు మృతి చెంద‌డంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తిరుపతి నుంచి బెంగుళూరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీ నీ డీకొన్న ఘటనలో  8 గురు ప్రాణాలు కోల్పోగా... పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఆరా తీసిన సీఎం....సహాయక చర్యలు, బాధితులకు అందుతున్న వైద్య సాయంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌కు మెరుగైన వైద్యం అందించాల‌ని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.  బాధిత కుటుంబాల‌ను ప్రభుత్వం ఆదుకుంటుందని అని తెలిపారు. 

మంత్రి సంతాపం 

చిత్తూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఘటనపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మంత్రి సంతాపం తెలిపారు. గాయపడిన వారికి అందుతున్న వైద్య సేవలపై మంత్రి అరా తీశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా  ఇచ్చారు. 

రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా

గాయపడ్డ వారిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్,ఎస్ పి మణికంఠ చందోలు  పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని  జిల్లా కలెక్టర్ ఆదేశించారు.శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం  మొగిలి ఘాట్ వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో  మృతి చెందిన  కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి  ఐదు లక్షలు ఎక్స్ గ్రేషియా ను రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. ఈ ప్రమాద ఘటనలో ఎనిమిది మంది  మృతి చెందగా, గాయపడ్డ  33 మందికి వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.  శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం  మొగిలి ఘాట్ వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడ్డ వారిని పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. మొగిలి ఘాట్ లో జరిగిన దుర్ఘటన లో గాయపడిన వారి కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సుమిత్‌ కుమార్ కోరారు. గాయపడిన వారికి వైద్య సేవలు అందిస్తున్నామని, అధికారులు అందు బాటులో ఉండి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నరని చెప్పారు.  గాయపడిన వారి సమాచారం నిమిత్తం  చిత్తూరు ఆర్ డి ఓ  ఫోన్ నెం:9491077005, డి ఎస్ పి పలమనేరు ఫోన్ నెం: 9440796732, పలమనేరు ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్   ఫోన్ నెం: 9440012989, బంగారుపాళ్యం తహసిల్దార్ ఫోన్ నెం: 9491077024లకు సంప్రదించాలని  జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ కోరారు.

చిత్తూరు ఆస్పత్రికి తరలింపు 

శుక్రవారం చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం  మొగిలి ఘాట్ వద్ద జరిగిన  ఘోర రోడ్డు ప్రమాద ఘటన లో గాయపడ్డ వారిని  చిత్తూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి కి  తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.  గాయపడ్డ వారిని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్ పి మణికంఠ చందోలు, జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యా ధరి పరామర్శించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 




అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *