30, సెప్టెంబర్ 2024, సోమవారం

కర్నాటకు జోరుగా రేషన్ బియ్యం స్మగ్లింగ్

జిల్లాలో ముఠాగా ఏర్పటి జోరుగా అక్రమ రవాణా 

బియ్యాన్ని రీ సైకిల్ చేసి సన్న బియ్యమని మోసం 

జిల్లాలో భారీగా రేషన్ బియ్యం పట్టుకుంటున్నా పోలీసులు 

అయినా, ఆగని అక్రమ రవాణా 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

 చిత్తూరు జిల్లా నుంచి కర్ణాటక రాష్ట్రానికి పౌరసరఫరాల బియ్యం అక్రమ రవాణా జోరుగా జాగుతోంది. ప్రతినిత్యం ఏదో ఒక మండలం నుంచి బెంగళూరుకు రేషన్ బియ్యం తరలిపోతుంది. వినియోగదారుల నుంచి రేషన్ బియ్యాన్ని  సేకరించి కర్ణాటకకు తరలిస్తున్నారు. కొంతమంది రేషన్ డీలర్లు కూడా పేదలకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని పక్క రాష్ట్రానికి పంపిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి సన్న బియ్యం పేరుతో తిరిగి జిల్లా వాసులకే విక్రయిస్తున్నారు. రేషన్ బియ్యం దందా చాలాకాలంగా జరుగుతున్న, అటు పోలీసులు కానీ ఇటు విజిలెన్స్ అధికారులు కానీ సీరియస్ గా తీసుకోలేదు. దీంతో చిత్తూరు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా  జరుగుతుంది. 


చిత్తూరు జిల్లాలో 2,901 చౌక దుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 11. 74 లక్షల మంది కార్డుదారులకు సుమారు 20 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. ప్రభుత్వం రూపాయికే కిలో బియ్యాన్ని సరఫరా చేస్తుంది. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్ బియ్యాన్ని తినే కుటుంబాలు చాలా తక్కువ. రేషన్ బియ్యాన్ని తీసుకున్న వినియోగదారులు వాటిని వ్యాపారస్తులకు కిలో  10 నుండి 20 రూపాయల వంతున విక్రయిస్తున్నారు. ఇందుకు ప్రతి రేషన్ షాప్ దుకాణం పరిధిలో కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి రేషన్ షాపు పరిధిలో బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇంటింటికి వాహనం తీసుకెళ్లి రేషన్ బియ్యాన్ని పోగు చేస్తున్నారు. పోగుచేసిన బియ్యాన్ని ఒక చోట నిల్వ చేసి, పోలీసులు కండ్లుగప్పి బెంగళూరుకు తరలిస్తున్నారు. రేషన్ బియ్యాన్ని పలువురు ఇడ్లీ, దోశ పిండిలో మాత్రమే వాడుతున్నారు. మరికొందరు రాగి సంగటిలో వాడుతున్నారు. రేషన్ షాపుల్లో ఇచ్చే బియ్యం నాణ్యత లోపించడంతో ఈ బియ్యాన్ని తినడానికి పలువురు ఆసక్తిని చూపడం లేదు. రేషన్ బియ్యాన్ని స్మగ్లర్లుకు కిలో పది నుంచి 20 రూపాయల వరకు విక్రయిస్తున్నా.రు జిల్లాలో ప్రతినెలా ఈ బియ్యాన్ని సేకరించి కర్ణాటకకు అక్రమ రవాణా చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని బంగారుపేట తదితర ప్రాంతాల్లో రైస్ మిల్లులు చాలా ఉన్నాయి. వీటిల్లో రేషన్ బియ్యాన్ని సన్నగా పాలిష్ చేసి, ఆ బియ్యన్ని,  సన్న బియ్యం, సోనా మసురా బియ్యం అంటూ వినియోగదారులను మభ్యపెట్టి విక్రయిస్తున్నా.రు చిత్తూరు జిల్లాలో ఈ ముఠా కార్యక్రమాలు దీర్ఘకారకంగా జరుగుతున్నాయి. ఇటీవల గంగాధర నెల్లూరు మండలం గొల్లపల్లిలో లోకనాథ నాయుడు కోళ్ల ఫారం లో నిర్వహించిన ఐదు టన్నుల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేవీపీ పురం మండలంలో మూడు క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వాహనానికి పంచర్ కావడంతో పోలీసులు ఆరా తీయగా బియ్యం అక్రమ రవాణా చేస్తున్నట్లు తేలింది. అలాగే పూతలపట్టు మండలం గోపాలకృష్ణ పురం వద్ద 20 టన్నుల బియ్యమును పోలీసులు పట్టుకున్నారు. ఈ బియ్యం నగరి, తిరుపతి మీదుగా కర్ణాటక కు తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. పలమనేరు పోలీసులు నాగమంగళం వద్ద నెల రోజుల కిందట పది టన్నుల రేషన్ బియ్యం పట్టుకున్నారు. ఈ బియ్యం పూతల పట్టి నుంచి అరగొండ మీదుగా కర్ణాటక పోతున్నట్లు గుర్తించా.రు ఇటీవల కుప్పం నుండి ఒక లారిలో అక్రమ రవాణా అవుతున్న 10 టన్నుల బియ్యం స్థానిక పోలీసులు సీజ్ చేశారు. వారం రోజుల కిందట  చిత్తూరు నగర సమీపంలోని ప్రశాంత్ నగర్ క్రాస్ వద్ద వేలూరు నుండి పలమనేరు వైపు వెళ్తున్న బొలెరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని సోమవారం టూ టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం రావడంతో ఎస్ఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది ప్రశాంత్ నగర్ వద్ద వాహన తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదగా టాటా ఏసీ ఆగింది ఆ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా సుమారు లక్ష రూపాయల విలువ 70 బస్తాల రేషన్ బియ్యాన్ని ఉండడానికి గుర్తించారు. తమిళనాడు నుంచి పలమనేరు మీదుగా కర్ణాటక కు టాటా ఏసీలో రేషన్ బియ్యాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇలా చిత్తూరు జిల్లాలో కొంతమందికి బియ్యం అక్రమ రవాణా లాభసాటి వ్యాపారంగా మారింది. రేషన్ షాప్ డీలర్ల నుండి వినియోగదారుల నుండి తక్కువ ధరకు రేషన్ బియ్యం సేకరించి అంతకు రెట్టింపు, మూడింతల మూడింతల లాభంతో కర్ణాటకకు విక్రయిస్తున్నారు. అక్కడ కర్ణాటక వ్యాపారస్తులు ఈ బియ్యాన్ని రీ సైకిల్ చేసి తిరిగి వినియోగదారులకు విక్రయిస్తున్నారు. ఈ విషయంలో పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పగడ్బందీగా వ్యూహరచన చేసి బియ్యం స్మగ్లర్లను పట్టుకోవలసిన అవసరం ఉంది. జిల్లాలోని చెక్ పోస్టులను మరింత కట్టుతిట్టం చేసి, బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకడ్డ వేయడం అవసరం. అక్రమ రవాణా కారణంగా రేషన్ బియ్యాన్ని రీ సైకిల్ చేసి నాణ్యమైన బియ్యంగా వినియోగదారులకు అంటగడుతున్నారు. ఈ మోసాలను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

గంగ 1 చిత్తూరులో పోలీసులు స్వాదీనం చేసుకున్న బియ్యం ఫైల్ ఫోటో 

గంగ 2 జీడి నెల్లూరులోని కోళ్ళ షెడ్లో దాచిన రేషన్ బియ్యం 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *