ప్రజా సమస్యల మీద స్పందించిన ప్రప్రతినిధులు
ప్రభుత్వ పధకాల అమలులో అవినీతి లేకుండా చూడాలని వినతి
జలజివన్ మిషన్ అమలుపై అసంతృప్తి
వైద్య ఆరోగ్య అధికారుల పనితీరుపై ఆక్షేపణ
జిల్లా కలెక్టర్ పనితీరు పట్ల అభినందనలు
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలువురు శాసనసభ్యులు జడ్పిటిసి సభ్యులు ప్రజా సమస్యల పైన స్పందించారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలులో జరుగుతున్న అవినీతి అవతలపైననిలతీ శారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా అమలు చేయాల్సిందిగా జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. ఎక్కడ అవకతవకలో అవినీతి జరిగిన సహించేది లేదని తేల్చి చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం కూడా చేయూతనివ్వాలని కోరారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లా సర్వసభ్య సమావేశం శుక్రవారం చిత్తూరు జిల్లా పరిషత్తు చైర్మన్ గోవింద శ్రీనివాసులు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరీ, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్, ఎం ఎల్ సి లు భరత్, చంద్ర శేఖర్ రెడ్డి, జెడ్ పి వైస్ చైర్మన్ రమ్య,అ సిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, జెడ్ పి సి ఈ ఓ గ్లోరియా, తిరుపతి డి ఆర్ ఓ పెంచల కిషోర్, శాసనసభ్యులు పులివర్తి నాని, ఎంబి థామస్ మురళీమోహన్, జంగాలపల్లి శ్రీనివాసులు, తిరుపతి ఎంపి గురుమూర్తి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రమ్య, అసిస్టెంట్ కలెక్టర్ హేమ, వంచి జెడ్పీ సీఈవో గ్లోరియర్, తిరుపతి ఆర్టీవో పెంచల కుమార్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎంబి థామస్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పని తీరు పైన తీవ్రస్థాయిలో ధ్యజమెత్తారు. నియోజకవర్గంలో, చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పేద రోగులను సక్రమంగా పట్టించుకోవడంలేదని, ఓపికి వచ్చిన వారికి సరైన వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రైవేట్ ఆస్పత్రుల పట్ల ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తున్నారని, ఇందు వల్ల వాళ్లు ప్రయోజనం పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో పట్ల దృష్టిని తగ్గించి ప్రభుత్వ ఆసుపత్రులలో సౌకర్యాలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ఇదే విధంగా ప్రైవేటు ఆసుపత్రిలో పట్ల ఇదేదారని కొనసాగితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాల్చి వస్తుందని హెచ్చరించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లు సక్రమంగా ఉండడం లేదని, ఈ కేంద్రాలలో వసతులు నామమాత్రంగా ఉంటున్నాయని తెలిపారు. ఈ కేంద్రాలలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడం, సక్రమంగా వైద్య సదుపాయం అందించకపోవడంతో ప్రైవేటు డాక్టర్లను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. కార్వేటినగరం, పెనుమూరు ప్రభుత్వ ఆసుపత్రులను వెంటనేపూర్తి చేయాల్సిందిగా కోరారు. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటి సరఫరా చేసే వాటర్ ట్యాంకులను నెలలో రెండు రోజుల్లో శుభ్రం చేయాలని కోరారు. ఆసుపత్రులలో బెడ్స్ కూడా లేదని రోడ్డు పక్కన పడుకోబెట్టి వైద్యం చేస్తున్నారని అన్నారు. ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచాల్సిందిగా థామస్ కోరారు. ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ పర్వతనేని చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా పరిషత్ సమావేశానికి ఒక విద్యాశాఖ అధికారి కూడా రాకపోవడం పట్ల ఆవేదనను వ్యక్తం చేశారు. జిల్లాలో టాపుల పంపిణీ పూర్తిగా జరగలేదని, పలు మండలాల్లో ఇంటర్మీడియట్ బోధనకు టీచింగ్ స్టాఫ్ లేదన్నారు. పలుచోట్ల ల్యాప్టాప్ లు మరమత్తుకు గురయ్యయని, వాటిని రిపేరు చేసే దానికి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు వారి ఇష్టానుసారం కాకుండా, విద్యాశాఖ అధికారుల నచ్చినట్లు చేస్తున్నారని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో ఉత్తీర్ణత శాతం తగ్గడం పట్ల తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. పాఠశాలల్లో టాయిలెట్ల నిర్వహణ అటకెక్కిందన్నారు. ఇందుకు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సమాధానమిస్తూ మరమతుల గురైన లాప్టాప్ లను రెండు వారాల్లో బాగు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. చంద్రగిరి శాసనసభ్యుడు పులివర్తి నాని మాట్లాడుతూ నేషనల్ హైవే మీద ప్రమాదం జరిగితే కనీసం ప్రాథమిక సికిత్స చేసే దానికి కూడా మధ్యలో ఎవరు లేరన్నారు. ఎంతటి గాయాలైనా తిరుపతికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరిగితే చికిత్స చేయడానికి 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా ఒక ఆసుపత్రిని ఏర్పాటు చేయాల్సిందిగా కోరారు. చంద్రగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను మెరుగుపరచాలన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదం జరిగితే వెంటనే తరలించడానికి అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని కోరారు. కాలనీల్లో నిర్మించిన ఇండ్లకు నీటి సౌకర్యం కలగజేయాలన్నారు. పలుచోట్ల బోర్లు తవ్వి మోటర్లు బిగించారని, వాటికి విద్యుత్ సరఫరా లేక పనిచేయడం లేదన్నారు. తోండవాడ, మామండూరు ప్రాంతాలలో ఇసుక అక్రమ రవాణాలను అరికట్టాల్సిందిగా కోరారు. తిరుపతి పార్లమెంటు సభ్యులు గురుమూర్తి మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ పనితీరు పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఏ కార్యక్రమం కూడా జిల్లాలో లక్ష్యాలను చేరడం లేదన్నారు. అధికారులు చిత్త శుద్ధతో లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. తిరుపతిలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ జలజీవన్ మిషన్ అమలులో జరుగుతున్న లోపాలు, అవకతవకలను ఎత్తి చూపారు. పలుచోట్ల బోర్లు వేశారని అవి పనిచేయడం లేదన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాకుండా ఎవరో చెప్పితే బోర్లను వేశారని, అందువల్ల అనుకున్న లక్ష్యం చేరడం లేదన్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించి బోరు వేసి మోటార్ బిగించి నీటి సరఫరా చేయాల్సిందిగా కోరారు. ప్రస్తుతం ఆమలు జరుగుతున్న ఇసుక విన్న విధానం చాలా బాగుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ తిరుపతి మున్సిపాలిటీలో మంజూరు చేసిన ఇళ్లను సత్కారం పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. మదనపల్లెలో ఇసుక కొరత తీవ్రంగా ఉందని, కావున లబ్ధిదారులు ఇళ్లను కూడా నిర్మించుకోలేకపోతున్నారని సభ్యులు సభ దృష్టికి తీసుకుని వచ్చారు. మదనపల్లి టమేటా మార్కెట్లో భారీ ఎత్తున దోపిడీ జరుగుతుందని, దానిని అరికట్టాల్సిందిగా కోరారు. దామలచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ప్రహరీ గోడ లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని సభ దృష్టికి తీసుకుని వచ్చారు. సమస్యలను సావధానంగా విన్న జిల్లా కలెక్టర్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ చూపుతున్నశ్రద్ద పట్ల పలువురు శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ ను అభినందించారు.
పో రై గంగ 1 జిల్లా పరిషత్ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్
గంగ 2సమావేశానికి హాజరైన ప్రజాప్రతినిధులు
గంగ 3తిరుపతి ఎంపి గురుమూర్తి
గంగ 4 జీడి నెల్లూరు ఎంఎల్ఏ ఎం వి థామస్
గంగ 5 పూతలపట్టు ఎంఎల్ఏ మురళీమోహన్
గంగ 6 చంద్రగిరి ఎంఎల్ఏ పులివర్తి నాని
గంగ 7 ఉపాధ్యాయ ఎం ఎల్ సి చంద్రశేఖర్ రెడ్డి
గంగ 8 తిరుపతి ఎంఎల్ఏ శ్రీనివాసులు