చిత్తూరులో గ్రానైట్, స్టోన్ క్రషర్ యజమానులు ఆందోళన
ప్రభుత్వ వైఖరికి నిరసనగా టానా వద్ద రాస్తారోజో, ధర్నా
రాఘవ కన్స్ట్రక్షన్ లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్
పస్తా పద్దతిలోనే రాయల్టీ వాసులు చేయాలని సూచన
లేకుంటే గ్రానైట్, కంకర పరిశ్రమలు ముసేస్తామని హెచ్చరిక
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
చిత్తూరు జిల్లాలో గ్రానైట్, ఫ్యాక్టరీ, క్వారీ యజమానులకు, స్టోన్ క్రషర్ యజమానుల నుండి రాఘవ కన్స్ట్రక్షన్ రాయల్టీ వసూలుకు నిరసనగా బుధవారం చిత్తూరు, పరిసర ప్రాంతాలకు చెందిన గ్రానైట్, ఫ్యాక్టరీ, క్వారీ యజమానులకు, స్టోన్ క్రషర్ యజమానులు అందోళనకు దిగారు. చిత్తూరు గంగాధర నెల్లూరు రహదారిలోని టాణా వద్ద రాస్తారోకో, ధర్నా చేశారు. ప్రైవేటు ఏజెన్సీ రాయల్టీ వాసులు చేయడాన్ని వ్యతిరేకించారు. పాత పద్దతిలోనే రాయల్టీ ప్రభుత్వమే వాసులు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే విధానం అమలులో ఉందని అదే విధానాన్ని మన రాష్ట్రంలో కూడా అమలు చేయాలన్నారు. లేకుంటే జిల్లాలోని గ్రానైట్, ఫ్యాక్టరీ, క్వారీ యజమానులకు, స్టోన్ క్రషర్ యూనిట్లు ముతవేస్తామని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో పెద్దిరెడ్డి స్టోన్స్, గ్రానైట్, మైన్స్ లలో రాఘవ కన్స్ట్రక్షన్ పేరు అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. ఇందువల్ల ఫ్యాక్టరీలు అన్ని మూతపడ్డాయన్నారు. ఆరోజు పెద్దరెడ్డి ఆగడాలతో చిత్తూరు రాష్ట్రవ్యాప్తంగా పెద్దిరెడ్డి మూలంగా సర్వనాశనమైనదని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, మంచి రోజులు వచ్చాయని సంబరపడితే గత ప్రభుత్వం రాఘవ కన్స్ట్రక్షన్ ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం రాయల్టీ వసూలు చేయడానికి మన చిత్తూరుకు వచ్చారన్నారు. ఇందుకు నిరసనగా గ్రానైట్ స్టోన్ ఇతర ఖనిజ యజమానులు న ధర్నా చేయల్చి వచ్చిందని వివరించారు. ఇప్పుడైనా ప్రభుత్వం పునరాలోచించి, రాయల్టీని ప్రభుత్వమే వసూలు చేసే విధంగా ఏర్పాటు చేసి పరిశ్రమలను కాపాడవలసిందిగా కోరారు. లేదంటే వారి దౌర్జన్యానికి అన్ని పరిశ్రమలు మూతపడతాయని హెచ్చరించారు. కావున ప్రభుత్వం ఈ పద్ధతిని మార్చి పాత విధానాన్ని ఏర్పాటు చేయవలసినదిగా డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లాలో 550 వరకు గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. అలాగే 160 వరకు కంకర కటింగ్ యూనిట్లు పనిచేస్తున్నాయి. వీటివల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా 200 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల నుంచి, స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేయడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీని నియమించింది. ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఇస్టారాజ్యంగా గ్రానైట్, కంకర క్రస్సింగ్ యాజమాన్యం నుంచి రాయల్టీని వసూలు చేసింది. కంకర ట్రాక్టర్ కు 750 రూపాయలు చొప్పున, గ్రానైట్ మీటరుకు 2000 నుంచి 5000 రూపాయల వరకు రాయల్టీని వసూలు చేశారు. ఇలా వసూలు చేసినా, గ్రానైట్ ఎగుమతికి పర్మిట్ ఇవ్వకపోవడంతో జిల్లాలో ఉత్పత్తి అయిన ఎక్కడికి అక్కడ పేరుకుపోయింది. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో బ్లేడుకు 45,000 వంతున నెలకు రుసుమున వసూలు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో నిఘా కెమెరాలను పెట్టి, గ్రానైట్ అమ్మకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ కుదేలైంది. జిల్లాలో సగానికి పైగా గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. కొందరు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా, ప్రైవేటు ఏజెన్సీ గ్రానైట్ ఎగుమతులకు అనుమతి ఇవ్వలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీల మీద ఉక్కు పాదం మోపింది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు ఒక్కొక్కరికి 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు కూడా జరిమానాలను విధించింది. ఈ జరిమానాలను కట్టలేకుండా కొందరు గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొందరు వైసీపీ నాయకుల అండ చేరడంతో వారికి వేసిన జరిమానాను మాఫీ చేశారు. ఇలా వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి మెరుగవుతుందని గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కంకర మిషన్ యజమానులు భావించారు. అయితే పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. గత వైసిపి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో రాఘవా కన్స్ట్రక్షన్స్ కు రాయల్టీ వసూలు చేసే బాధ్యతను అప్పగించారు. వారికి రెండు సంవత్సరాలపాటు ఈ హక్కుల ఉన్నాయి. వైసీపీ పాలనలో ఒక సంవత్సరం పాటు రాయల్టిని వాసులు చేసి, ఇప్పుడు మరో సంవత్సరం పాటు వారు రాయల్టీని వసూలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వారు ఫ్యాక్టరీ ల వద్దకు రావడంతో బుధవారం జిల్లాలోని గ్రానైట్, కంకర యజమానులు రాస్తారోకో, ధర్నా చేసి, నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో చౌదరి, మురళీకృష్ణ, రాంబాబు, పట్టాబి తదితరులు పాల్గొన్నారు.
పో రై గంగ 2 చిత్తూరులో గ్రానైట్ స్టోన్ క్రషర్ యజమానులు ఆందోళన