1, సెప్టెంబర్ 2024, ఆదివారం

సంక్షోభంలో గ్రానైట్, కంకర ఫ్యాక్టరీలు

జిల్లాలో మూతపడిన సగం పరిశ్రమలు 

ప్రభుత్వానికి తగ్గుతున్న ఆదాయం 

వైసిపి విధానాన్నే అవలంభిస్తున్న కూటమి ప్రభుత్వం 

ప్రైవేటుఏజెన్సీని రద్దు చేయాలని యజమానుల డిమాండ్ 

త్వరలో చిత్తూరులో  గ్రానైట్, కంకర ఫ్యాక్టరీలు యజమానుల సమావేశం 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

రాష్ట్రంలో ప్రభుత్వం మారినా, చిత్తూరు జిల్లాలో గ్రానైట్ క్వారీ యజమానులకు, స్టోన్ క్రషర్ యజమానులకు వేధింపులు తప్పడం లేదు. దీంతో చిత్తూరు జిల్లాలో సగం వరకు గ్రానైట్ ఫ్యాక్టరీలు, స్టోన్ క్రషింగ్ యూనిట్లు మూతపడ్డాయి. పాత పద్ధతి ప్రకారం పాత ఏజెన్సీ ఫాక్టరీ యజమానుల నుండి రాయల్టీ  వసూలు చేయడంతో మీరు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వం కొత్త పాలసీలు తీసుకొని రాకపోవడంతో జిల్లాలోని గ్రానైట్, స్టోన్ క్రషర్ యూనిట్లు సంక్షోభంలో కొరుకుపోతున్నాయి. ఈ యూనిట్లు నడపడం తమ వల్ల కాదంటూ యజమానులు చేతులెత్తేస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఎగుమతి ద్వారా కేంద్ర ప్రభుత్వానికి రావలసిన ఆదాయం రావడం లేదు. కంకర యజమానులు కూడా ఆందోళన బాట పట్టడంతో జిల్లాలో నిర్మాణాలకు కంకర కూడా లభించడం లేదు. 

చిత్తూరు జిల్లాలో 550 వరకు గ్రానైట్ యూనిట్లు ఉన్నాయి. అలాగే 160 వరకు కంకర కటింగ్ యూనిట్లు  పనిచేస్తున్నాయి. వీటివల్ల ప్రభుత్వానికి ప్రతి ఏటా 200 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వం గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానుల నుంచి, స్టోన్ క్రషర్స్ యజమానుల నుంచి రాయల్టీని వసూలు చేయడానికి ఒక ప్రైవేటు ఏజెన్సీని నియమించింది. ఆ ప్రైవేట్ ఏజెన్సీ ఇస్టారాజ్యంగా గ్రానైట్, కంకర క్రస్సింగ్ యాజమాన్యం నుంచి రాయల్టీని వసూలు చేసింది. కంకర ట్రాక్టర్ కు 750 రూపాయలు చొప్పున, గ్రానైట్ మీటరుకు 2000 నుంచి 5000 రూపాయల వరకు రాయల్టీని వసూలు చేశారు. ఇలా వసూలు చేసినా, గ్రానైట్ ఎగుమతికి పర్మిట్ ఇవ్వకపోవడంతో జిల్లాలో ఉత్పత్తి అయిన ఎక్కడికి అక్కడ పేరుకుపోయింది. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో బ్లేడుకు 45,000 వంతున నెలకు రుసుమున వసూలు చేశారు. గ్రానైట్ ఫ్యాక్టరీల్లో  నిఘా కెమెరాలను పెట్టి, గ్రానైట్ అమ్మకుండా అడ్డుకున్నారు. దీంతో జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ కుదేలైంది. జిల్లాలో సగానికి పైగా గ్రానైట్ పరిశ్రమలు మూతపడ్డాయి. కొందరు కోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకున్నా, ప్రైవేటు ఏజెన్సీ గ్రానైట్ ఎగుమతులకు అనుమతి ఇవ్వలేదు. ముఖ్యంగా గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వాళ్లకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీల మీద ఉక్కు పాదం మోపింది. తెలుగుదేశం పార్టీ నాయకుల ఆర్థిక మూలాలను దెబ్బ కొట్టడానికి గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులకు ఒక్కొక్కరికి 50 కోట్ల నుంచి 80 కోట్ల వరకు కూడా జరిమానాలను విధించింది. ఈ జరిమానాలను కట్టలేకుండా కొందరు గ్రానైట్ ఫ్యాక్టరీలను మూసివేశారు. మరికొందరు వైసీపీ నాయకుల అండ చేరడంతో వారికి వేసిన జరిమానాను మాఫీ చేశారు. ఇలా వైసీపీ పాలనలో చిత్తూరు జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ తీవ్ర సంక్షోభానికి గురైంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ పరిస్థితి మెరుగవుతుందని గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కంకర మిషన్ యజమానులు భావించారు. అయితే పరిస్థితులు ఏమాత్రం మార్పు రాలేదు. గత వైసిపి ప్రభుత్వం చిత్తూరు జిల్లాలో రాఘవా కన్స్ట్రక్షన్స్ కు రాయల్టీ వసూలు చేసే బాధ్యతను అప్పగించారు. వారికి రెండు సంవత్సరాలపాటు ఈ హక్కుల ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ పాలనలో ఒక సంవత్సరం పాటు రాయల్టిని వాసులు చేసి,  ఇప్పుడు మరో సంవత్సరం పాటు వారు రాయల్టీని వసూలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. సెప్టెంబర్ మూడవ తారీఖు నుంచి ఫ్యాక్టరీలకు వెళ్లి రాయల్టీ వసూలు చేసుకోవడానికి రాఘవా కన్స్ట్రక్షన్స్ సిద్ధమవుతుండడంతో, జిల్లాలోని గ్రానైట్ క్వారీ యజమానులు, గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కంకర మిషన్ యజమానులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు అప్పగించిన రాయల్టీ వసూలను రద్దు చేయకుంటే, తాము గ్రానైట్, కంకర ఫ్యాక్టరీలు మూసివేస్తామని ప్రభుత్వానికి తెలియజేయనున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక సామాజిక వర్గం గ్రానైట్, కంకర క్వారీలను నడుపుతోంది. ఆ సామాజిక వర్గం వైసీపీ పాలనలో తీవ్ర ఒడిదుడుకులకు  లోనైంది. ఆర్థికంగా భారీగా నష్టపోయారు. ప్రభుత్వం మారితే తమకు మంచి రోజులు వస్తాయని భావించారు. ప్రభుత్వం మారినా, అదే పరిస్థితి కొనసాగడంతో జిల్లాలోని గ్రానైట్, కంకర యజమానులు చేయునది లేక ఆందోళనకు సిద్ధమవుతున్నారు. జిల్లా కేంద్రంలో ఒకటి రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఒక తీర్మాణాన్ని ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్ళనున్నారు. ప్రైవేట్ ఏజెన్సీల విధానాన్ని రద్దుచేసి, పాత విధానాన్ని కొనసాగించాలని ప్రభుత్వాన్ని గ్రానైట్, కంకర క్వారీ యజమానులు కోరనున్నారు.

పో రై గంగ 1 గ్రానైట్ ఫ్యాక్టరీ  

గంగ 2 కంకర ఫ్యాక్టరీ 







 స్టోన్ క్రషర్ గ్రానైట్  యజమానులు ఆందోళన  గత రాక్షస ప్రభుత్వంలో గ్రానైట్ స్టోన్ పిండి పీల్చి పిప్పుచేసి ఆర్థికంగా దివాలదేసి జగన్మోహన్ రెడ్డి సర్కార్  ప్రైవేటు ఏజెన్సీ ఫిక్స్ చేసి  వారి ఆక్రంగా ప్రైవేటు వారితో రాయల్టీ ట్రాక్టర్కు 750 రూపాయలు గ్రానైట్ కి మీటరు కు 2000 5000  వసూలు చేసి 

 ఇష్టానుసారంగా వేధించి దివాలా తీయించి సగం స్టోన్ క్రషర్లు  గ్రానైట్ ఫ్యాక్టరీలు మూత వేయడం జరిగింది గతంలో   మంత్రిగా ఉన్న పెద్ద రెడ్డి రాఘవ కన్స్ట్రక్షన్ వారి  అరాచకాలు    కుహద్దు లేకుండా చిన్న తరహా ఖనిజాలు గవర్నమెంట్ ఆ డెవలప్మెంట్ సంబంధించిన రోడ్ మెటల్  పేదవారు నిర్మించుకునే గృహాలకు సంబంధించిన మెటీరియల్స్ ఈ రోడ్ మెటల్ సంబంధించింది మినిమం 20  కిలోమీటర్లు పరిధిలోనే తోలుకుంటారు ఇటువంటి రోడ్ మెటల్ పైన వేధించి జిల్లా అభివృద్ధికి రాష్ట్ర అభివృద్ధికి నష్టం చేయకుండా పేదల నిర్మించే గృహాలకు చిన్నపాటి ఉపాధి హామీ మెటీరియల్  వర్కులు చేసుకునే ఉపాధి కూలీలకు ఉపాధి పొందే మేస్త్రీలకు ఎవరికి ఇబ్బంది కలకుండా రోడ్ మెటల్కు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి సంవత్సరానికి ఒకసారి రాయల్టీ   వసూలు చేసుకుని ఈ యొక్క ఇండస్ట్రీని కాపాడకపోతే రాష్ట్ర అభివృద్ధి కాదు కదా ఒక పేదవాడు ప్రతి ఒక్క పరిశ్రమల స్థాపించి యజమాని తీవ్రంగా నష్టపోతారు కాబట్టి కర్ణాటక తరహాలో అన్న రాయ ఎల్ టి  వసూలు చేసి ఈ పరిశ్రమను కాపాడవలసిందిగా కోరుకుంటూ లేదంటే ఇప్పుడు మన రాఘవ కన్స్ట్రక్షన్ గురించి చిత్తూరు జిల్లా రాయల్టీ వసూలు చేసుకునే బాధ్యత ఇచ్చినారని తెలుస్తున్నది దీనివల్ల స్టోన్ క్రషర్  యజమానులు  ప్రజలు ఆగ్రహం గా ఉన్నారు చిన్నచిన్న వర్కులు చేసుకునే పార్టీ కార్యకర్తలు కూడా చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు  దీని దయచేసి ప్రభుత్వం వారు స్టోన్ యజమానులు ప్రైవేటు  వారి బారి   నుండి కాపాడి రాయల్టీని వారి బాధ నుండి  గవర్నమెంట్ ప్రభుత్వ వర్కులకు అంత కూడా గవర్నమెంట్ కి అడ్జస్ట్ చేసే విధంగా ఇబ్బంది లేకుండా అసలు యజమానులను మన చిత్తూరు జిల్లా ప్రజలను రాష్ట్ర ప్రజలను ఈ యొక్క స్టోన్  యజమానులను మన ముఖ్యమంత్రి గారు  వారి బాధ నుంచి తొలగించి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే విధంగా పరిశ్రమ యజమానులను  పాడవలసిందిగా కోరుతూ   ఉపయోగించుకుంటే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఈ ఒక ప్రైవేట్ ఏజెన్సీలు వెంటనే రద్దుచేసి ఓల్డ్ సిస్టం ముందు పాత విధానం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరుకుంటూ స్టోన్ క్రషర్ మరియు గ్రానైట్ యజమానులు

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *