ఇంటింటికి రేషన్ కు కూటమి ప్రభుత్వం స్వస్తి
పాత విధానంలోనే రేషన్ పంపిణి
ఎండియు వాహనాల వాహనాలతో ప్రజల ఇబ్బంది
వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ఎదురుచూపులు
ఈ పాస్ మెషిన్ లో సంకేతిక సమస్యలు
సర్వర్ మొరాయించడంతో, గంటల నిరీక్షణ
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
ఇంటింటికి రేషన్ అంటూ గత ప్రభుత్వం అట్టహాసంగా తీసుకుని వచ్చిన ఎండియు వాహనాలకు కోటమి ప్రభుత్వం స్వస్తి పలకనుంది. పాత విధానంలోనే రేషన్ సరఫరా చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఎండియు వాహనాల ద్వారా రేషన్ సరఫరాలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఆ వాహనం వెళ్ళినప్పుడు కార్డుదారులు లేకపోతే ఆ నెల రేషన్ తీసుకునే వెసులుబాటు లేదు. దీంతో 30 నుంచి 40 శాతం లబ్ధిదారులు రేషన్ తీసుకోకుండా ఇబ్బంది పడుతున్నారు. ఈ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక ప్రజలు కూలి పనులు మానుకొని వాహనం కోసం ఎదురుచూపులు చుడాల్చిన పరిస్థితి. వాహనం వచ్చినా, సర్వర్ మోరాయించడంతో వినియోగదారులు గంటల తరబడి లైన్లో రేషన్ కోశాన్ వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇందుకు ప్రభుత్వానికి అదనంగా నిధులు వ్యయం అవుతున్నా, కార్డుదారులకు నష్టమే జరుగుతోంది. పేరుకు ఇంటింటికి రేషన్ అయినా, వీధిలో ఎక్కడో ఒక చోట వాహనం ఆగుతుంది. అక్కడికి కార్డుదారులు వెళ్లి రేశం తీసుకోవాలి. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ఇంటింటికి రేషన్ పథకాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. పాత విధానంలోనే షాపుల వద్ద కార్డుదారులు ఇకనుంచి ప్రవేశం సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది
చిత్తూరు జిల్లాలో 5,43,202 తెలుపు రంగు రేషన్ కార్డులు ఉన్నాయి. ఇందులో 39,7266 అంత్యోదయ కార్డులు ఉన్నాయి. వీటి సరఫరాకు జిల్లాలో 1,379 రేషన్ షాపులు ఉన్నాయి. ప్రజలకు ప్రతి నెలా 93,04,540 కిలోల బియ్యం, 29,1464 కిలోల చక్కెర, 5,43202 కిలోల పప్పు ధాన్యాలు, 5,41,678 కిలోల గోధుమపిండి సరఫరా చేస్తున్నారు. ప్రతి రేషన్ కార్డులోని సభ్యులకు ఐదు కేజీలు బియ్యం, అంత్యోదయ కార్డుకు 30 కేజీల బియ్యం ఇస్తున్నారు. ప్రతి కార్డుకు గరిష్టంగా 3 కేజీల వరకు బియ్యంలకు బదులుగా రాగులు ఇవ్వడానికి అవకాశం ఉంది. చక్కెర తెల్ల రేషన్ కార్డులకు అరకేజీ చప్పున ఇస్తున్నారు. ప్రతి కార్డుదారునికి కందిపప్పు ఒక కేజీ, గోధుమపిండి ఒక కేజీ సరఫరా చేస్తున్నారు. కొత్తగా 15203 రేషన్ కార్డులను అర్హులకు అందజే అందజేశారు చిత్తూరు జిల్లాలో 2021 ఫిబ్రవరి నెల నుంచి ఎండిఆర్ వాహనాలు ద్వారా నిత్యవసర వస్తువులు సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 336 ఎండిఆర్ వాహనాలు ఉన్నాయి. వీటికి ప్రభుత్వం నెలకు 18 వేల రూపాయల వంతున అందజేస్తుంది .ఈ వాహనం ద్వారా రోజూ 90 బియ్యం కార్డులకు నిత్యవసర వస్తువులను సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. నెలలో 15 రోజులకు పాటు ఈ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ సరఫరా చేస్తున్నారు. మిగిలిన 15 రోజులు పాటు ఈ వాహనాలు వృధాగా ఉంటున్నాయి. దశాబ్దాలుగా సాఫీగా సాగిపోతున్న రేషన్ సరఫరా వ్యవస్థను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కుదిపేసింది. ఇంటింటికీ రేషన్ అంటూ వాహనాలతో హైరానా చేసింది. ఇకపై ఇంటివద్దే రేషన్ తీసుకోచ్చనుకున్న లబ్ధిదారుల ఆశలకు సమస్యలు కళ్లెం వేశాయి. ఎక్కడో వీధి చివరన వాహనం ఆగితే అక్కడి దాకా వెళ్లాల్సి రావడం తలనొప్పిగా మారింది. వాహనాలు ఎప్పుడొస్తాయో తెలియకపోవడం పనులు మానుకొని ఎదురుచూడటం రాకపోతే ఉసూరుమనడం సర్వసాధారణంగా మారిపోయాయి. సాంకేతిక సమస్యలు తలెత్తి పరికరాలు పని చేయకపోయినా ఆ పాపం లబ్ధిదారులపైనే పడుతోంది. ఒకవేళ రేషన్ వాహనం వచ్చినప్పుడు ఇంటివద్ద లేకపోతే ఆ నెల రేషన్ కోల్పోవాల్సిందే. అధిక ధరలకు బయట కొనాల్సిరావడం ఆర్థిక భారాన్ని పెంచింది. ఈ పోస్ మిషన్‌లో ప్రతి కార్డుదారుడి వేలిముద్ర తీసుకుని అందులో వారికి కావాలిసన సరుకులను నమోదు చేసి రేషన్ పోయాల్సి ఉంది. చాల సార్లు సర్వర్‌లు మొరాయించడంతో ఎండీయూ ఆపరేటర్లు, కార్డుదారుల పాట్లు అన్నీ ఇన్నీ కావు. సర్వర్ మొరాయించ డంతో గంటల పాటు కార్డుదారులతో పాటు ఆపరేటర్లు వేచి ఉండాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిళ్లకు ఆపరేటర్లు గురవుతున్నారు. రేషన్ బియ్యం కోసం పనులకు వెళ్లకుండా వేచిచూడాల్సి వస్తోంది. దీనికి తోడు రేషన్ తీసుకోకపోతే కార్డు తొలగిస్తారని తద్వారా ప్రభుత్వ పథకాలకు దూరమవుతామనే భావన ప్రజల్లో ఉండడంతో పడిగాపులు తప్పడం లేదు. వీటికి తోడు కొన్ని రేషన్‌కార్డులకు సంబంధించి బియ్యం, పంచదారకు వేర్వేరుగా రెండు వేలిముద్రలు సేకరించాల్సి వస్తోందని, దీనివల్ల మరింత సమయం పడుతోందని, సర్వర్‌లు పని చేయకపోవడం, ఇలా రెండు వేలిముద్రలు తీసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటోందని ఎండీయూ ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకటో తేదీన రేషన్ పంపిణీ ప్రారంభిస్తే దాదాపు 15 తేదీ దాటే వరకు రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఇక సిగ్నల్స్ సరిగ్గా లేని ప్రాంతాల్లో, ఇళ్లు దూరం దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన ఆపరేటర్లు దాదాపు 17వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రేషన్ పంపిణీ చేయాల్సి వస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో సర్వర్‌లు పనిచేయకపోవడంతో ఎండీయూ ఆపరేటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రధానంగా ఎండీయూ ఆపరేటర్‌కు రూ.18 వేలు జీతం వస్తుంది. దీనిలో హెల్పర్‌కు ప్రతి రోజు రూ.500 ఇవ్వాలి. అంటే దాదాపు 15 రోజులు బియ్యం పోస్తే రూ.7,500లు ఇవ్వాలి. దీనికి తోడు ప్రతి రోజు వాహనంలో బియ్యం బస్తాలు ఎక్కించాల్సి ఉంటుంది. రోజుకు 30 నుంచి 40 బియ్యం బస్తాలు ఎక్కించేందుకు కార్మికుడు ఒక్కొ బస్తాకు రూ.10లు చొప్పున సుమారు రోజుకు రూ.400 ఇలా 15 రోజులకు రూ. ఐదు వేలు నుంచి రూ.ఆరు వేలు ఖర్చు అవుతుంది. వాహనంలో పెట్రోల్‌కు రూ.2 వేలు నుంచి రూ.2500 వరకు ఖర్చు అవుతుంది. వాహనం టైర్ల పంక్చర్ పడటం, డోర్‌లు ఊడిపోవడం, లైట్లు వెలగకపోవడం, వాహనంలో బరువు మిషన్, ఈపోస్ మిషన్‌కు సంబందించి చార్జీంగ్ పెట్టుకునేందుకు వైరింగ్ రిపేర్‌లతో పాటు చిన్నచిన్న రిపేర్‌లు మొత్తంగా వాహనం నడిపేందుకు ఎండీయూ ఆపరేటర్‌కు కష్టంగా మారింది. ఈ కారణంగానే చాలా మంది ఆపరేటర్లు మానేస్తున్నారు. వచ్చే జీతానికి పడే కష్టం, ఖర్చుకు పొంతన లేకుండా పోయిందని ఆపరేటర్లు ఆవేదన చెందుతున్నారు. వీటితో పాటు సర్వర్‌లు మొరాయించడంతో మరింత ఇబ్బందులు పడుతున్నారు.
డీలర్ ఊరిలోనే ఉంటాడు కాబట్టి వీలున్నప్పుడు వెళ్లి రేషన్ దుకాణానికి వెళ్లి సరకులు తెచ్చుకునే వెసులుబాటు ఉండేదని కార్డుదారులు చెబుతున్నారు. వాహనాల వ్యవస్థ వచ్చాక గందరగోళం మొదలైంది. ఇంతకుముందు బియ్యంతోపాటు, గోధుమపిండి, కందిపప్పు, వంటనూనె, చక్కెర వంటి నిత్యావసరాలను తక్కువ ధరకే ఇస్తుండగా వైఎస్సార్సీపీ సర్కారు కేవలం బియ్యానికే పరిమితం చేసింది. అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తూ వచ్చిన క్రిస్మస్ కానుక, సంక్రాంతి కానుక, రంజాన్ తోఫాలను కనుమరుగు చేసింది. రేషన్ వాహనం వచ్చే సమయానికి ప్రజలు ఉంటే తీసుకుంటారు, లేకపోతే లేదు. అధిక ఖర్చు చేసి బయట కొనవలసిన పరిస్థితి. రేషన్ వాహనం ఏ టైంకు వస్తుందో తెలియదు. వీటి కోసం ప్రజలు పనులకు వెళ్లకుండా ఉండాలి. ఈ వాహనం ద్వారా రేషన్ పంపిణీ అయ్యే ఖర్చును నిత్యావసర వస్తువులను అధికంగా ఇస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుంది. గత ప్రభుత్వ హయాంలో బియ్యం మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు, చక్కెర లాంటివి ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఒక్కో ఎండీయూ వాహనానికి 2, 3 రేషన్ షాపులను అధికారులు కేటాయించారు. ఒక్కో వాహనానికి ఆపరేటర్, డీలర్, హమాలీ, వీఆర్ఓలను బాధ్యులుగా ఉంచారు. డీలర్‌కు కమీషన్ ఇస్తే సరిపోయేది కానీ ఈ ఎండీయూ వాహనాల ద్వారా ప్రభుత్వంపై ఆదనపు ఆర్ధిక భారం పడుతోంది. నెలకు ఒక్కో వాహనంపై 18 వేల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతోంది. ఇంత ఖర్చు పెడుతున్నా ప్రభుత్వం అనుకున్న లక్ష్యం నెరవేరుతోందా అంటే అదీ లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ విధానం వల్ల కార్డుదారులతో పాటు తామూ తీవ్రంగా నష్టపోతున్నామని రేషన్ డీలర్లు వాపోతున్నారు. ఈ విధానంతో విసిగిపోయిన ప్రజలు పాత విధానాన్నే తిరిగి అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. దీంతో ఇంటింటికి రేషన్ విధానానికి స్వస్తి పలికి పాత విధానాన్నే కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది.