26, సెప్టెంబర్ 2024, గురువారం

కాజూరు రోడ్డులో వెలగని వీధి దీపాలు

చీకటి కార్యక్రమాలకు నిలయంగా ఆ రోడ్డు 

ఆ దారిలో వెళ్ళాలంటే భయపడుతున్న మహిళలు 

చీకటిలో రెచ్చిపోతున్న అవకతాయిలు

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

 చిత్తూరు పట్టణం గిరింపేట నుండి కాజూరుకు వెళ్లే ప్రధాన రహదారిలో గత చాలా కాలంగా వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో  ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. మున్సిపల్ అధికారులు ఈ  రహదారిలో ఖరీదైన  బట్టర్ ఫ్లై వీధి దీపాలను అమర్చారు. వీధి దీపాలు వెలగడం లేదని మున్సిపల్ అధికారులకు స్థానికులు  పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన చేసేస్తున్నారు. ఈ దారిలో వీధి దీపాలు వెలగడం పోవడంతో చీకటి కార్యక్రమాలకు నిలయంగా ఈ దారి మారింది. ఈ దారిలో పొద్దుపోయిన తర్వాత మహిళలు వెళ్లాలంటే భయపడుతున్నారు. 


చిత్తూరు గిరింపేట నుండి కజూరుకు వెళ్లే ప్రధాన రహదారి సుమారు కిలోమీటరు దూరం ఉంటుంది. ఈ రహదారిని మునిసిపల్ అధికారులు నాలుగు లైన్ల రోడ్డుగా అభివృద్ధి చేశారు. రోడ్డుకు మధ్యలో డివైడర్లు పెట్టి, ముక్కలను కూడా పెంచుతున్నారు. విలువైన బటర్ ఫ్లై వీధి దీపాలను ఏర్పాటు చేసినా, అవి వెలగడం లేదు. ఈ దారి పాత కలెక్టర్ కార్యాలయం మీదుగా వెళుతుంది. ఈ దారిలోనే సబ్జెక్ట్ రిజిస్టర్ కార్యాలయం, విద్యుత్ శాఖ డీఈ కార్యాలయం, విద్యుత్తు  ట్రాన్స్ఫార్మర్ల మరమ్మత్తు కేంద్రము, గాయత్రీ నగర్ సచివాలయం కూడా ఉన్నాయి. ఈ రహదారి సూర్యాస్తమయం తర్వాత చీకటిగా మారిపోతుంది. ఈ సమయంలో వాహనాలు పలుమార్లు ఢీకొన్న సంఘటనలు కూడా ఉన్నాయి. రహదారి మొత్తంచీకటిగా ఉండటంతో చీకటి కార్యక్రమాలకు నిలయంగా మారింది. పలువురు మద్యం ప్రియులు బాహాటంగా రోడ్డు మీదనే మద్యం తాగుతున్నారు. గంజాయి, కర్ణాటక మద్యం అమ్మకాలు కూడా కేంద్రంగా మారుతుంది. చీకట్లో ఏం చేసినా ఎవరు పట్టించుకోరనే ధిమతో అల్లరి మొక్కలు రెచ్చిపోతున్నారు. మున్సిపల్ అధికారులు ఇకనైనా ఈ విషయంలో చర్యలు తీసుకొని వీధి దీపాలు వెలిగే విధంగా చూడాలని స్థానికులు  కోరుతున్నారు.

పో రై గంగ 1  కాజూరులో రోడ్డులో ఏర్పాటు చేసినా, వెలుగని వీధి దీపాలు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *