10, సెప్టెంబర్ 2024, మంగళవారం

జిల్లాలో దుర్వినియోగం అవుతున్న ఉచిత ఇసుక విధానం

పాలసముద్రం మీదుగా తమిళనాడుకు అక్రమ రవాణా

ఇందుకు సహకరిస్తున్న స్థానిక అధికారులు 

కూటమి నేతల హస్తం ఉందని అనుమానాలు 

జిల్లా కేంద్రానికి భారీగా ఫిర్యాదులు  

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

రాష్ట్ర ప్రజల అవసరాలను తీర్చడానికి ప్రవేశపెట్టిన ఉచిత  ఇసుక విధానము చిత్తూరు జిల్లాలోని తమిళనాడు సరిహద్దు మండలాల్లో దుర్వినియోగం అవుతుంది. కొంతమంది నాయకులు మాఫియాగా ఏర్పడి, గుట్టు చప్పుడు కాకుండా చిత్తూరు జిల్లా నుండి తమిళనాడుకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. లక్షలాది రూపాయలను అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఈ విషయము బహిరంగ రహస్యమైన స్థానిక అధికారులకు అక్రమ రవాణా కనిపించడం లేదు. ఈ విషయమై జిల్లా కేంద్రానికి భారీగా ఫిర్యాదులు అందుతున్నాయి. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అధికారులు పాలసముద్రం మండలంలో ఆకస్మిక దాడులు జరిపి, భారీగా ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో కూటమి పార్టీ నేతల హస్తము కూడా ఉందని స్థానికులు గుసగుసలాడుతున్నారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేద ప్రజల కోసం ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టారు. ప్రతిరోజు సుమారు 15 ట్రాక్టర్ల ఇసుక గంగాధర నెల్లూరు నుండి పాలసముద్రం మండలానికి వెళ్తోంది. మండలంలో ఇప్పటివరకు ఒక ఇల్లు నిర్మాణం కూడా జరగలేదు. అయినా ప్రతి రోజు మండలానికి సుమారు 15 ట్రాక్టర్ ల ఇసుక వస్తుంది. ఈ ఇసుక ఎక్కడికి వెళుతుంది అని అరా తీస్తే.. పాలసముద్రం మండలం తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో  మండలంలోని కొంతమంది మాఫియాగా తయారై పగటిపూట గంగాధర నెల్లూరు నుండి ఇసుక తెచ్చి తమిళనాడు సరిహద్దులో డంప్ చేస్తున్నారు. రాత్రి వేళలో తమిళనాడు వాసులు టిప్పర్లతో ఇసుకను తీసుకెల్తున్నారు. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటినుండి వీరి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు తమకు  సంబంధం లేనట్టుగా ఉండిపోతున్నారు. మండలంలో సరిహద్దు ప్రాంతంలో ఎక్కడ చూసిన ఇసుక డంపులే ఉండడంతో మండలంలో కొంతమంది సంబంధిత పై అధికారులకు సమాచారం ఇచ్చారు. రహస్య సమాచారం మేరకు జిల్లాస్థాయి అధికారులు నుండి సర్కుల్ ఇన్స్పెక్టర్ కు ఆదేశాలు రావడంతో గత వారం రోజులుగా మండలంలో ఇసుక మాఫియా పై కొరడా జులిపించి, జిల్లా మొత్తం పాలసముద్రం మండల వైపు కన్నెత్తి చూసే విధంగా  ఇసుక డంపులను సీజ్ చేశారు. ఎక్కడి నుండో వచ్చిన అధికారులు ఈ డంపులను గుర్తించి సీజ్ చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు మాత్రం పట్టలేదు. ఒకవేళ తెలిసినా, తెలియనట్టు పట్టించుకోవడం లేదు.  ఇందుకు బలమైన కారణం ఉండాలని స్థానికులు భావిస్తున్నారు. మాఫియాతో చేతులు కలిపి, ఇందుకు సహకరిస్తున్నారని  స్థానికులు గుసగుసలాడుతున్నారు. సీజ్ చేసిన డంప్ లపై గత రెండు రోజులకు ముందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకుడు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. తమ వాళ్లు పనుల కోసం ఏదో కొంత తమిళనాడు సరిహద్దులో డంప్ చేశారని విలేకరుల సమావేశంలో తెలిపారు. ఇంత జరిగిన ఎప్పటి వరకు ఒక్క రోజు కూడా తమిళనాడుకు ఇసుక తరలించడం ఆగలేదు. మన ఇసుక వాహనాలు తమిళనాడు పోలీస్ వారికి భయపడి తమిళనాడు లోకి వెళ్ళరు. అదే తమిళనాడు వాసుల వాహనాలు ఆంధ్రా లోకి వచ్చి యదేచ్చగా  ఇసుక తీసుకెళ్ళుతున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ  పెట్టిన ఉచిత ఇసుక పథకానికి ఇలాంటి వారి వల్ల తూట్లు  పడుతున్నాయి. కావున ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాలసముద్రం మండలంపై ప్రత్యేక దృష్టి పెట్టి, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాల్చిన అవసరం ఉంది.  ఉచిత ఇసుక పథకాన్ని అడ్డుపెట్టుకొని ఇసుక వ్యాపారం చేస్తున్న నాయకుల మెడ ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. 

పో రై గంగ 1 పాలసముద్రంలో ఇటేవల స్వాదీనం చేసుకున్న భారీ ఇసుక డంపు.

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *