జిల్లాలో 113 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్
కళ్ళు గీత కార్మికులకు 9 షాపులు
నాణ్యమైన మద్యం అందుబాటులో ఉంచాలని నిర్ణయం
రూ. 99 నుంచి మద్యం ధరలు
రాత్రి పది వరకు మద్యం దుకాణాలు
అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం విధానం
ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.
నూతన అబ్కారి విధానంలో భాగంగా చిత్తూరు జిల్లాలో 113 మద్యం షాపులకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇందులో తొమ్మిది మద్యం షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒకటి రెండు రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం కనిపిస్తోంది. జిల్లాలో అక్టోబర్ ఒకటి నుండి నూతన మద్యం విధానం అమలులోకి రానుంది.
వైసీపీ ప్రభుత్వం గతంలో ఉన్న మద్యం విధానాన్ని రద్దుచేసి, ప్రభుత్వమే వైన్ షాపులను నడపాలని నిర్ణయించింది. ప్రభుత్వపరంగా వైన్ షాపులను ఏర్పాటు చేసి, అందులో మధ్య అమ్మకాలకు ఉద్యోగస్తులను నియమించారు. అక్రమ మద్యం అరికట్టడానికి ఎన్ఫోర్స్మెంట్ బ్యురోను ఏర్పాటు చేశారు. అయితే ఈ మద్యం షాపులలో ఆన్ లైన్ విధానం లేకపోవడం, ఫోన్ పే, గూగుల్ పే అనుమతించకపోవడంతో భారీ ఎత్తున అవినీతి, అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయమై కూటమి ప్రభుత్వం సి ఐ డి విచారణకు కూడా ఆదేశాలు ఇచ్చింది. దీంతో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆప్కారే విధానాన్ని రద్దుచేసి పాద పద్ధతిలోనే వైన్ షాపులకు వేలంపాటలు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను కట్టబెట్టాలని నిర్ణయించిం.ది చిత్తూరు జిల్లాలో ప్రస్తుతం 113 మద్యం దుకాణాలు ఉన్నాయి. ప్రభుత్వం 10 శాతం పెంచే విషయాన్ని కూడా పరిశీలిస్తుంది. ఇందులో గౌడ, సొంటి సామాజిక వర్గాలకు 10 శాతం మద్యం షాపులను రిజర్వ్ చేయాలని నిర్ణయించింది. మద్యం షాపుల లైసెన్సును రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. ఒక మద్యం షాపు లైసెన్స్ రుసుం జనాభా ప్రాతిపదికన 50 లక్షల నుండి 85 లక్షల నిర్ణయించే అవకాశం ఉంది. సంవత్సరం తర్వాత రెండో సంవత్సరానికి ఈ రుసుంను 10 శాతం పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఆరు వాయిదాలలో రుసుం చెల్లించి వెసలుబాటు కల్పిస్తారు. కొత్త మద్యం షాపులు ఉదయం 10 గంటల నుండి రాత్రి పది గంటల వరకు పనిచేస్తాయి. ప్రస్తుతం రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. ఈ మేరకు మద్యం షాపుల నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఎక్సైజ్ శాఖ సిద్ధమవుతోంది. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే మద్యం షాపులను నడిపే విధంగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని సవరించి ఆర్డినెన్స్ చేసే దానికి ఇప్పటికే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దానిని గవర్నర్ ఆమోదానికి పంపారు. ఒకటి రెండు రోజుల్లో గవర్నర్ అనుమతి లభించే అవకాశం ఉంది. నూతన మద్యం విధానం అక్టోబర్ 1వ తేదీ నుంచి అమలులోకి రానుందని ప్రభుత్వం ఇప్పటికీ ప్రకటించింది. గీత కార్మికులకు 10 శాతం మద్యం దుకాణాలు కేటాయించడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. నాణ్యమైన మద్యంను అందుబాటులో ఉంచాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. మద్యం ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉండాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు జరుగుతోంది.