18, సెప్టెంబర్ 2024, బుధవారం

వేరుశనగ మీద ఆశలు వదులుకున్న రైతాంగం

 జిల్లాలో మూడు వారాలుగా వర్షాభావ పరిస్థితులు 

ఎండిపోతున్న వేరుశనగ 

జిల్లా రైతులకు రూ. 70 కోట్ల నష్టం 

పెరగనున్న వంట నునెల ధరలు 

ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 


రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ వాగులో వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఇందుకు విరుద్ధంగా చిత్తూరు జిల్లాలో గత మూడు వారాలుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆగస్టు నెలలో జిల్లాలో భారీగా వర్షాలు కురవాలి. చిన్న పరిస్థితి అయితే వానిలపడకపోవడంతో జిల్లాలో ఖరీఫ్ పంటలు భారీగా దెబ్బతిన్నాయి ముఖ్యంగా వేరుశనగ పంట జిల్లా వ్యాప్తంగా దెబ్బతింది ఇక వర్షాలు పడిన కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు చిత్తూరు జిల్లాలో వేరుశనగ పంట దెబ్బతినడంతో భవిష్యత్తులో వంట నూనె ధరలు కూడా పెరిగే ప్రమాదం కనిపిస్తుంది జిల్లాలో కొంతలో చెరువులు ఎండిపోవడంతో భవిష్యత్తులో జిల్లాలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం కనిపిస్తోంది 


ఖరీఫ్ సీజన్ కు చిత్తూరు జిల్లాలో 81 వేల హెక్టార్లలో పంటలుగా కావలసి ఉండగా జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితుల కారణంగా కేవలం 33,000 హెక్టర్లలో మాత్రమే పంటలు సాగయ్యాయి. ఇందులో 15 వేల హెక్టార్లలో వేరుశనగ సాగు ఉంటుందని అంచనా. వేరుశనగతో పాటు జిల్లాలో కందులు, వుద్ధులు, పెసలు, అలసందలు ధాన్యాలను కూడా పండిస్తారు.వీటిని అంతర పంటగా వేస్తారు. రైతులు ఎంతో ఉత్సాహంతో ఈ సంవత్సరం వేరుశనగను వేశారు. అయితే గత మూడు వారాలుగా జిల్లాల్లో వర్షాలు పడకపోవడంతో వేరుశనగ పంట పూర్తిగా ఎండిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఇక వర్షాలు పడినా, పంట కోలుకునే పరిస్థితి కనిపించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం వేరుశనగ పంట వేయడానికి  రైతుకు సుమారుగా 20 వేల రూపాయలు వ్యయమవుతుంది. వేరు శనగ వేయడానికి  రెండు పర్యాయాలు భూమిని దున్నాల్సి ఉంటుంది. ఇందుకు సుమారుగా 5వేల రూపాయలు ఖర్చు అవుతుంది. వేరుశెనగ విత్తనం కొనుగోలుకు  5వేలు రూపాయలు అవుతుంది. గింజలు వేయడం, అందులో కలుపు తీయడానికి ఎకరానికి 5వేల  రూపాయలు వరకు  వ్యయం అవుతుంది. ఇక ఎరువులు, ఇతర ధాన్యాలు వేయడం పంట పనులకు మరో ఐదు వేల రూపాయలు వంతన వ్యయమవుతుంది. ఇలా ఒక ఎకరా వేరుశనగ సాగు చేయడానికి రైతుకు 20వేల రూపాయలు వ్యయమవుతుంది. చిత్తూరు జిల్లాలో 15 వేల హెక్టార్లు అంటే 35 వేల ఎకరాల్లో వేరుశనగ సాగైందని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా. ఈ లెక్క న జిల్లాలోని రైతులు వేరుశనగ పంట మీద 70 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారని తెలుస్తోంది. ఆయనా, జిల్లాలో వానలు ఎనక్కి పోవడంతో ఈ పెట్టుబడి రైతులు నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు వర్షాలు పడిన ఎకరాకు 20 బస్తాలు రావలసిన వేరుశనగ ఒకటి, రెండు బస్తాలు కూడా వచ్చే అవకాశం లేదని ఆవేదన చెందుతున్నారు.  వేరుశనగ పంట ఇప్పుడు ఊడలు దిగి, కాయలు ఏర్పడే దశలో ఉంది. కీలకమైన ఈ సమయంలో వర్షం లేకపోవడంతో జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోతుంది. తాము కష్టపడి పండించిన వేరుశనగ పంట తమ కళ్ళముందర ఎండిపోతుండదంతో వేరుశనగ  రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. జిల్లాలో గత నాలుగైదు సంవత్సరాలుగా వేరుశనగ విస్తీర్ణం తగ్గిపోతుంది. ఇందుకు కారణం సకాలంలో వర్షాలు పడకపోవడం. వేరుశనగ పంట చేతికి రాకపోవడం, ఒక సంవత్సరం భారీ వర్షాలతో వేరుశెనగ పంటను ఓడుపుకునే అవకాశం కూడా లేకుండా పంట చేలలోనే కుళ్లిపోయింది. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక విధంగా వేరుశనగ పంట దెబ్బతింటూనే ఉంది. అయినా ఆశతో రైతులు వేరుశనగ పంట వేస్తూనే ఉన్నారు.  పంట వేయడానికి రాయితీ మీద నలభై వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనాలను వ్యయసాయ శాఖ అధికారులు రైతులకు సరఫరా చేశారు. వేరుశనగ పంట వేసిన  తర్వాత కొంతకాలం సక్రమంగానే వర్షాలు పడ్డాయి. దీంతో వేరుశనగ పంటలో కలుపును కూడా తీసి, పంటకు సిద్ధం చేశారు. తీరా వేరుశనగ ఊడల దిగి, కాయలు తయారయ్యే పరిస్థితుల్లో వరుణదేవుడు ముఖం చాటు వేశాడు. దీంతో జిల్లాలో వేరుశనగ పంట ఎండిపోతుంది.  జిల్లాలో క్రమంగా వేరుశనగ పంట విస్తీర్ణం కూడా తగ్గుతుంది. ఒకవైపు సకాలంలో వర్షాలు పడకపోవడం, మరోవైపు వేరు విత్తనాలు విత్తడానికి, అందులో కలుపు తీయడానికి, వేరుశనగ పీకడం, కాయలు ఒలువడం వంటి పనులకు కూడా జిల్లాలో కూలీలు దొరకడం లేదు. కూలీల రోజుకు 500 నుంచి 700 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. దీంతో పంట రాబడి కంటే కూలీలకు అయ్యే ఖర్చు ఎక్కువ అవుతుంది. లెక్కలు వేసుకుంటున్న పలువురు రైతులు వ్యవసాయానికి స్వస్తిపలుకుతున్నారు. ఫలితంగా భవిషత్తులో వంట నునెల ధరలు గణనీయంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


వ్యవసాయం జూదంలా మారింది 


ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం జూదం లాగా మారింది. పంటలు వేస్తే చేతికి వస్తాయన్న నమ్మకం లేదు. ఒకసారి అనావృష్టి, మరోసారి అతివృష్టితో పంటలు దెబ్బతింటున్నాయి. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందడం లేదు. ప్రభుత్వం పంటలకు బీమా సౌకర్యం కలిగించకపోవడంతో నష్టపరిహారం కూడా అందడం లేదు. రైతులు నిరాశకు గురతున్నారు. క్రమంగా రైతులకు పంటలు వేయడం మీద ఆసక్తి తగ్గుతుంది. సగం భూములు బీడు భూములుగా కనిపిస్తున్నాయి. 


గంగ 1: వేణుగోపాల్ రెడ్డి, పెండ్లిగుంట్లపల్లి 


పంట వేయడం కంటే కొనుక్కోవడం మేలు 


చిత్తూరు జిల్లాలో గత నాలుగు సంవత్సరాలుగా వేరుశనగ పంట చేతికి రావడం లేదు. వేరుశనగ పంటమీద పెట్టే పెట్టుబడిలో 10 -20 శాతం కూడా తిరిగి రావడం లేదు. దీంతో వేరుశనగ వేయడానికి రైతులు వెనకడుగు వేస్తున్నారు. వేరుశనగ పంటను పండించడం కంటే వేరుశనగ కాయలు కొనుక్కోవడం మేలని రైతుల భావిస్తున్నారు. ఎకరం పంట వేయడానికి 20వేల రూపాయలు వ్యయమవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఒకటి రెండు బస్తాలు కూడా వచ్చే పరిస్థితులు లేదు. కావున పంట వేయడం కంటే, మార్కెట్లో వేరుశెనక్కాయలు కొనుక్కోవడం లాభదాయకం. 


గంగ 2 శారద, మహిళ రైతు పుత్రమద్ది



పో రై గంగ 3 జిల్లాలో ఎండిపోతున్న వేరుశనగ పంట


అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *