25, సెప్టెంబర్ 2024, బుధవారం

జిల్లాలో ఇద్దరికి నామినేటెడ్ పదవులు

ఆర్ టి సి వైస్ చైర్మన్ గా పి ఎస్ మునిరత్నం 

టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా కటారి హేమలత 

జిల్లాకు దక్కని చైర్మన్ పదవులు 

పలువురికి నిరాశ 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు. 

నామినేటెడ్ పోస్టుల భర్తిలో భాగంగా మొదటి జాబితాలో చిత్తూరు జిల్లాకు రెండు పోస్టులు దక్కాయి. కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్న పీఎస్ మునిరత్నమును ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేసి, ప్రస్తుతం నగర పార్టీ అధ్యక్షురాలుగా ఉన్న కటారి హేమలతను టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. మొదటి జాబితాలో పలువురు తమకు పదవులు వస్తాయని భావించారు. అయితే అందరినీ నిరాశ పరుస్తూ ఇద్దరికి మాత్రమే చంద్రబాబు పదవులను కట్టబెట్టారు. జిల్లాకు ఒక కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. 


కుప్పం మండలం కంగోందికి చెందిన పి.ఎస్. మునిరత్నమును ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ గా నియమిస్తూ  ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు, కుటుంబ మిత్రుడు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో ఇద్దరు కలిసి చదువుకున్నారు.  పిఎస్ మునిరత్నం ప్రస్తుతం  కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ఆయన గత 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా చంద్రబాబు వెంట నడిచారు. ఆయన కుప్పం సమితి అధ్యక్షుడిగా, కుప్పం ఎంపీపీగా, రెస్కో చైర్మన్ గా పదవులను నిర్వహించారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఘన విజయానికి ఆయన కృషి చేశారు. ఇందుకు బహుమానంగా ఆయనకు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పదవి లభించింది. 


చిత్తూరుకు  చెందిన కటారి హేమలతను టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా నియమించారు. కటారి హేమలత ఇదివరకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేశారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చిత్తూరు పట్టణ అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. హేమలత అత్తమామలు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. మామ కటారి మోహన్, సీకే బాబు మీద జరిగిన హత్యాయత్నం కేసులు ప్రధాన నిందితుడు. కొంతకాలం అజ్ఞాతంలో కూడా గడిపారు. తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన సతీమణి కటారి అనురాధ చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా పనిచేస్తున్న సమయంలో సొంత బావమరిది చింటూ మున్సిపల్ కార్యాలయంలోని ఇద్దరినీ కాల్చి చంపారు. దీంతో వారి కుమారుడు కటారి ప్రవీణ్  రాజకీయ అరంగ్రేటం చేశారు. పట్టణ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. మున్సిపల్ ఉప ఎన్నికల్లో భార్య హేమలతను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించుకొన్నారు. ఆమెను మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయించింది. కొంతకాలం పాటు మేయర్ గా పనిచేశారు. భర్త ప్రవీణ్ కోరోనాతో కన్ను మూయడంతో, హేమలత ప్రత్యక్ష రాజకిల్లోకి వచ్చారు. తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షురాలిగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎన్నికలలో పార్టీ విజయానికి కృషి చేశారు. ఈమెకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ గా అవకాశం కల్పించింది. చిత్తూరు జిల్లాలో పలువురు నాయకులు చైర్మన్ పెదవులను ఆశించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేష్ ను కలిసి బయోడేటా అందజేశారు. తమకు తెలిసిన గాడ్ ఫాదర్ ల ద్వారా గట్టి ప్రయత్నాలు చేశారు. ఆయనా మొదటి జాబితాలో ఇద్దరికి మాత్రమే  పోస్టులు రాకపోవడంతో పలువురు నిరాశకు గురయ్యారు.

పో రై గంగ 1 మునిరత్నం 
గంగ 2 హేమలత 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *