4, సెప్టెంబర్ 2024, బుధవారం

వి.కోటలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు

పరిస్థితులను సమీక్షిస్తున్న కలెక్టర్, ఎస్పి 

ఒక వర్గంపై మరో వర్గం దాడులు 

హుటాహుటిన చేరుకున్న  జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ 

రాళ్ల దాడిలో పలమనేరు డి.ఎస్.పి కి గాయాలు 

ఒక వర్గానికి చెందిన ఆస్తులు భారీగా ధ్వంసం 

30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలు 

కొనసాగుతున్న భాధితుల అందోళన 


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు/ వి. కోట 


చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి కోట మండల కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సోమవారం రాత్రి ప్రారంభం అయిన దాడులు నివారించడానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పి మనికంట చందోలు అక్కడే మకాం పెట్టారు. పలమనేరు ఎం ఎల్ ఏ , మాజీ మంత్రి అమరనాధ రెడ్డి వి కోటలో  పర్యటించారు. జరిగిన విషయాన్ని కలెక్టర్, ఎస్పిని అడిగి తెలుసుకున్నారు. వి కోట ప్రజలు సంయమనం పాటించాలని అయన విజ్ఞప్తి చేశారు.సోమవారం రాత్రి ఒక వర్గం మీద మరో వర్గం దాడులు చేయడంతో వి కోట రక్తసిక్తమైంది.  దాడులతో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. హుటాహుటిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. శాంతి కమిటిని ఏర్పాటు చేశారు. రెండు రోజులపాటు వి కోట మండలంలో పోలీస్ 30 యాక్ట్, 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. గొడవలను అదుపు చేయడానికి ప్రయత్నించిన పలమనేరు డిఎస్పీ ప్రభాకర్ మీద కూడా రాళ్ల దాడి జరిగింది. ఆయన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులలో ఒక వర్గానికి చెందిన ఆస్తులు భారీగా ధ్యంసం అయ్యాయి. పలువులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వి కోట పట్టణానికి పలువురు బిజెపి నాయకులు చేరుకుంటున్నారు. పరిస్థితిని అదుపు చేయడానికి అదనపు పోలీస్ బలగాలను మోహరించారు. కలెక్టర్, ఎస్పిలు స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.


చిత్తూరు జిల్లా వి కోట మండల కేంద్రంలో చిన్న గొడవ భారీ విధ్వంసానికి దారితీసింది. సోమవారం రాత్రి  క్రికెట్ బాల్ ఒక మహిళ ఎదకు తగలడంతో గొడవ ప్రారంభమైంది. తనకు క్రికెట్ బాల్ తగలడంతో ఆ మహిళ తరఫున వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లారు. మరో వర్గం వారు భాధిత కుటుంబంపై దాడులు చేశారు. దీంతో వి కోట పట్టణం రెండు వర్గాలుగా విడిపోయింది. ఒక వర్గం వారు మరో వర్గం వారి మీద దాడులు చేశారు. ఒక వర్గం వారు కత్తులు, రాడ్లు, కర్రలతో వీరవిహారం చేశారు. దొరికిన వారిని దొరికినట్లు కొట్టారు. తమకు రక్షణ  కల్పించాల్సిందిగా ఒక వర్గం అంబేద్కర్ సర్కిల్ లో ధర్నాకు దిగింది. వారి మీద మరో వర్గం దాడి చేయడానికి ప్రయత్నం చేసింది. విషయం తెలియగానే  హుటాహుటిన అక్కడికి చేరుకున్న పలమనేరు డిఎస్పి ఇరువర్గాలకు సర్దిచెప్పి, శాంత పరిచే ప్రయత్నం చేశారు. ఒక వర్గం డిఎస్పి ప్రభాకర్ మీద రాళ్లురవడంతో ఆయన తలకు బలమైన గాయమైంది. ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. విషయం తెలియగానే హుటాహుటిన చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అక్కడికి చేరుకున్నారు. వి కోట పట్టణంలో పోలీస్ 30 యాక్టు, 144 సెక్షన్ విధిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రకటించారు. ఇరు వర్గాల ఘర్షణలో గాయపడ్డ క్షతగాత్రులను జిల్లా కలెక్టర్,  జిల్లా ఎస్పీ పరామర్శించారు. ధర్నా విరమించాల్సిందిగా ఒక వర్గాన్ని విజ్ఞప్తి చేశారు. తమపై దాడి చేసిన వ్యక్తులను అరెస్టు చేసే వరకు ధర్నా విరమించబోమని మరో వర్గం తేల్చి చెప్పింది. ఇది ఇలా ఉండగా సోమవారం అర్ధరాత్రి దుండగులు జనసేనకు చెందిన ట్రాన్స్పోర్ట్ అధినేత పొట్టు భాస్కర్ ఇంటిపై దాడి చేశారు. అతనికి సంబంధించిన 8 బస్సుల అద్దాలను పగలగొట్టారు. అతని ఇంటిముందు ఆపిన ద్విచక్ర వాహనానికి నిప్పు పెట్టారు. ఈ సంఘటనలో సుమారు 5 లక్షల పైగా ఆస్తి నష్టం సంభవించిందని భావిస్తున్నారు. గొడవలో ఒక దినపత్రిక విలేకరి కూడా గాయపడ్డారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఒక ప్రకటన చేస్తూ వి కోట పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు 30 పోలీస్ యాక్టు, 144 సెక్షన్ అమలులో ఉందన్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా ఉండరాదని, దుకాణాల వద్ద నలుగురు కన్నా ఎక్కువ మంది వ్యక్తులు గుమికూడరాదన్నారు. ర్యాలీలు, ధర్నాలకు ఎటువంటి అనుమతులు లేవని ప్రజలు సమయం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సోమవారం జరిగిన సంఘటనలపై బాధితుల ఫిర్యాదు మేరకు నిందితులపై తగిన చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ఆస్తి నష్టం జరిగిన వారికి ప్రభుత్వం తరఫున నష్టపరిహారం చెల్లించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ సంఘటనలో తప్పు చేసినవారికి శిక్షపడే విధంగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వి కోట పట్టణంలో శాంతి కమిటీని ఏర్పాటు చేశారు. ఇరవర్గాలతో శాంతి కమిటీ సభ్యులు మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు చట్టాన్ని అధిక్రమించి దాడులు చేసినా, కఠినమైన చర్యలు తీసుకుంటామని జిల్లా అధికారులు హెచ్చరించారు. ఒక వర్గం మీద దాడులు జరగడంతో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి భాను ప్రకాష్ రెడ్డి, జిల్లా కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, మాజీ అధ్యక్షుడు రామచంద్రుడు, ఇతర బిజెపి జిల్లా నాయకులు అక్కడికి చేరుకున్నారు. బాధితులకు అండగా నిలబడ్డారు. వి కోట పట్టణంలో పరిస్థితి నివురు కప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ఒక వర్గం ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నారు.

ప్రజలు సంయమనం పాటించాలి: పలమనేరు ఎమ్మెల్యే

వి.కోటలో జరిగిన ఘటనపై ప్రజలందరూ సంయమనం పాటించాలని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు. సోమవారం జరిగిన ఘటన దురదృష్టకరమని ఇరువర్గీయులు  అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉన్న చోట చిరు వివాదం ఇలా ఘర్షణకు దారి తీయడం బాధాకరమన్నారు.జిల్లా కలెక్టర్ ఎస్పీలు రాత్రి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారని, ప్రజలందరూ ఎవరి మాట వినిపించుకోకుండా సంయమనంతో వ్యవహరించాలన్నారు. గొడవలు దుకాణాలు నష్టపోయిన వారికి ప్రభుత్వం ద్వారా తగిన పరిహారం ఇప్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఘటన కారుకులైన బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.

శ్రీ శక్తి భవన్ లో శాంతి చర్చలు 

వి కోటలో రాత్రి జరిగిన సంఘటనలకు సంబంధించి కలెక్టర్ సుమిత్ కుమార్, పోలీస్ అధికారులు తెదేపా నాయకులు వైసిపి నాయకులు జనసేన నాయకులు గ్రామ పెద్దల సమక్షంలో చర్చల ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాత్రి జరిగిన సంఘటన దురదృష్టకరంగా ఉందని, మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కొంతమంది దాడులకు పాల్పడ్డారని ఇకపై ఈ లాంటి సంఘటనలకు పాల్పడకుండా శాంతియుతంగా కలిసి మెలిసి ఉండాలని కోరారు. ఈ సంఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందని ఈ అల్లరులలో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామని, మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని పెద్దలకు తెలియజేశారు.

పది మంది మీద ఎఫ్ఐఆర్ 

వి.కోట. రాత్రీ జరిగిన సంఘటనలో 10 మంది ప్రమేయం ఉందని పోలీసులు గుర్తించారు. దాడులలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆరిఫ్, లాల్, కట్టు,సిద్ధిక్,  ఉమర్,  సద్దాం, మసూద్, ఏ ఎస్ నయీమ్, షాహిద్,  ఖాదర్. ఇంకా కొంతమంది ఉన్నారని వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితులుముందస్తు ప్రణాళికా  ప్రకారము సంఘటన జరిగిన ప్రాంతానికి ఇనుప రాడ్లు కర్రలు, రాళ్లు, సమకూర్చుకొని  తన అనుచరులతో వచ్చి, దాడి చేయడం మొదలు పెట్టారని ఎస్సై బాబు తెలియజేశారు. నిందితులు మరికొందరు ఉన్నారని, వారిని గుర్తిస్తున్నామని చెప్పారు.

 పాఠశాలలు, కళాశాలలు బంద్ 

వి కోట అల్లర్ల నేపథ్యంలో పాఠశాలలు, కళాశాలలకు జిల్లా కలెక్టర్ సెలవుల్లో ప్రకటించారు. దుకాణాలన్నీ చాలా వరకు మూతపడ్డాయి. వి కోటలో బంద్ వాతావరణం కొనసాగుతోంది. ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. జిల్లా కలెక్టర్ ఎస్పీ ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *