27, సెప్టెంబర్ 2024, శుక్రవారం

అక్రమ రవాణాకు అడ్డాగా జిడి నెల్లూరు నియోజకవర్గం

తమిళనాడుకు తరలిపోతున్న ఇసుక 

యదేచ్చగా గ్రానైట్ అక్రమ రవాణా 

ఎర్రచందనాన్నీ వదలని అక్రమార్కులు 

అక్రమ రవాణా విషయంలో టిడిపి అధిష్టానం సీరియస్ 

శుక్రవారం వివరాల సేకరించిన కేంద్ర కార్యాలయం


ప్రభ న్యూస్ బ్యూరో, చిత్తూరు.

గంగాధర నెల్లూరు నియోజక వర్గం అక్రమ రవాణాను అడ్డాగా మారిపోయింది. ఇక్కడి నుంచి కోట్ల రూపాయల విలువ చేసే  ఇసుక, గ్రానైట్, ఎర్ర చందనం పొరుగు రాష్ట్రాలకు తరలి పోతోంది. అక్రమ రవాణా అరికట్టడానికి గంగాధర్ నెల్లూరు శాసనసభ్యులు ఎంవి థామస్ చాలా పట్టుదలగా ఉన్నారు. శాసనసభ్యుని ఆదేశాలు కూడా పాటించని కొంతమంది అక్రమార్కులు జోరుగా ప్రకృతి సంపదన దోచుకుంటున్నారు. నియోజకవర్గంలోని అధికారులు రాజకీయ వత్తిళ్ళతో చూసిచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఇసుక అక్రమ రవాణా చేస్తున్న  ఒక ఆరు చక్రాల లారీని స్థానికులు పోలీసులకు పట్టిచ్చారు. రెండవ రోజు ఇసుక లోద్దులో ఆరు చక్రాల లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ విషయంలో కేసును నమోదు చేయడానికి కూడా పోలీసుల మేనమీసాలు లెక్కించారు. అలాగే గత రెండు రోజులో  అక్రమ గ్రానైట్ రవాణానకు సంబంధించి రెండు జీపులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తొలుత కొంతమంది ఎర్రచందనం అక్రమ రవాణా కూడా ప్రయత్నించారు. ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి రావడంతో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం చాలా సీరియస్ అయింది. కేంద్ర కార్యాలయం నుంచి నియోజకవర్గ నాయకులకు శుక్రవారం ఫోన్లు వచ్చాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎవరు అక్రమ రవాణాకు పాల్పడుతున్నది వివరాలను ఆతీతీశారు. వీటిపై ఒక నివేదికను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు అందజేయనున్నట్లు సమాచారం. అక్రమ రవాణాలో ముఖ్య కీలక వహిస్తున్న ఒక నేతపై తొందరలోనే వేటు పడే  అవకాశాలు కనిపిస్తున్నాయి. నామినేటెడ్ పదవుల  విషయంలో కూడా గంగాధర నెల్లూరు నియోజకవర్గాన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు నాయకులు అక్రమ వ్యాపారులకు వత్తాసు పలుకుతున్నారు. కొందరు అక్రమార్కుల అవతారం ఎత్తారు. వైసిపి పాలనలో యదేచ్చగా అక్రమాలు సాగించిన కొందరు ఇప్పుడు అధికార పార్టీ నేతలతో చేతులు కలిపి అక్రమ రవాణా కు అడ్డు లేకుండా చూసుకుంటున్నారు. వీరికి రాష్ట్ర స్థాయి టిడిపి నేత ఒకరు రింగ్ మాస్టర్ గా వ్యవహరిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనితో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వి ఎం థామస్ స్వయంగా రంగంలోకి దిగి అక్రమ వ్యవహారాలకు అడ్డు కట్ట వేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి రావడంతో ఆయనే స్వయంగా కార్యకర్తలను హెచ్చరించారు. ఇటీవల కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విస్తృత స్థాయి టెలికాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఇసుక, గ్రానైట్, అక్రమ రవాణా, మద్యం షాపులు జోలికి ఎవరూ వెళ్ళ వద్దని విజ్ఞప్తి చేసారు. వైసిపి నేతలు ఇలాంటి అక్రమాలు చేయడం వల్లనే ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయిందని విషయం గుర్తు చేశారు.2029లో తిరిగి అధికారంలోకి రావాలంటే అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని కోరారు. కార్యకర్తలు న్యాయ బద్ధంగా వ్యాపారాలు, పరిశ్రమలు ప్రారంభించాలని కోరారు. అయినా ఇక్కడి నేతలు కొందరు అక్రమ రవాణా చేస్తున్నారు. మూడు రోజుల క్రితం అనుమతి లేకుంగా లారీలో తరలిస్తున్న గ్రానైట్ దిమ్మను పోలీసులు పట్టు కున్నారు. నెల రోజుల క్రితం ఎస్ ఆర్ పురం మండలంలోని ఒక టిడిపి నాయకుని మామిడి తోటలో ఎర్ర చందనం దుంగలను పోలీసులు పట్టు కొన్నారు. అయితే ఆ పాపాన్ని ఒక వైసిపి  నేతకు అంటకట్టాలని  చూసారు. ఆఖరికి అంతా సద్దు మనిగింది. పాలసముద్రం మండలంలో పది అనధికారిక ఇసుక డంప్ లు ఉన్నాయి. వీటి నుంచి చెన్నైకి ఇసుక తరిస్తున్నారని ఆరోపణలు విని పిస్టున్నాయి. అలాగే జి డి నెల్లూరులోని నీవా నది నుంచి కూడా కొందరు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.ఈ నేపథ్యంలో కొన్ని వాహనాలను పట్టుకున్నారు. అధికార పార్టీ నేతలు దీని వెనక ఉండటం వల్ల పెద్దగా కేసులు పెట్టకుండా అపరాధ రుసుం వేసి చేతులు దులుపుకుంటున్నారు. కొందరు అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని కొందరు అంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం పెద్ద ఇసుక లారీ ఒకటి బోల్తా పడటంతో అక్రమ రవాణా తెర మీదకు వచ్చింది. నియోజక వర్గంలో జరుగుతున్న అక్రమ వ్యవహారాలపై సిఎం చంద్రబాబు నాయుడు ద్రిస్తికి వెళ్ళింది. దీంతో ఒక నివేదికను అమ్దచేయల్చిందిగా టిడిపి కేంద్ర కార్యాలయాన్ని ఆదేశించారు. దీంతో టిడిపి రాష్ట్ర నేతలు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలోని టిడిపి నాయకులు కార్యకర్తలకు పరుసగా ఫోన్లు చేస్తున్నారు. ఇసుక, గ్రానైట్, ఎర్రచందనం అక్రమ రవాణా గురించి అరాతీశారు. తొందరలోనే పార్టీ అధినేతకు నివేదిక అమ్దచేయనున్నారు.ఈ నేపధ్యంలో కొందరు ముఖ్య నేతల మీద వేటు పడే అవకాశం ఉందని సమాచారం. అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా నియోజకర్గంను పక్కన పెట్టె అవకాశం ఉందని ఇక టిడిపి సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఇప్పుడు జిల్లాలో జి డి నెల్లూరు అక్రమ వ్యాపారం జిల్లాలో, రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది.

పో రై గంగ 6 ఇసుక అక్రమ రవాణా  ఫైల్ ఫోటో 

గంగ 7 గ్రానైట్ అక్రమ రవాణా ఫైల్ ఫోటో 

అనుచరులు

Popular Posts

Contact Us

పేరు

ఈమెయిల్‌ *

మెసేజ్‌ *